iDreamPost
android-app
ios-app

ఆ ఉద్యోగులకు సీఎం జగన్‌ గుడ్‌ న్యూస్‌.. భారీగా జీతం పెంపు

  • Published Aug 16, 2023 | 12:39 PM Updated Updated Aug 16, 2023 | 12:43 PM
  • Published Aug 16, 2023 | 12:39 PMUpdated Aug 16, 2023 | 12:43 PM
ఆ ఉద్యోగులకు సీఎం జగన్‌ గుడ్‌ న్యూస్‌.. భారీగా జీతం పెంపు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. ఇక ప్రభుత్వశాఖ ఉద్యోగుల విషయంలో కూడా సీఎం జగన్‌ ఇలానే వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విద్యుత్‌ శాఖలో విధులు నిర్వహిస్తోన్న ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు జగన్‌ సర్కార్‌ శుభవార్త చెప్పింది. వారికి వచ్చే జీతాలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారులు ప్రకటన చేశారు. సీఎం జగన్‌ నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాలు..

ఏపీలో విద్యుత్‌ శాఖలో పని చేస్తోన్న ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల జీతాలను 37 శాతం పెంచుతూ జగన్‌ సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విద్యుత్‌ శాఖ స్పెషల్‌ సీఎస్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల 27 వేల మంది ఔట్‌ సోర్సింగ్‌ విద్యుత్‌ ఉద్యోగులకు లబ్ది చేకూరనుంది. సీఎం జగన్‌ సూచనల మేరకే విద్యుత్‌ శాఖ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల వేతనాలు పెంచినట్లు సీఎస్‌ తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల కనిష్ట వేతనం 21 వేల రూపాయలు దాటింది. అలానే గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ సౌకర్యం కూడా కల్పించాలని కాంట్రాక్ట్‌ ఏజెన్సీలను ఆదేశించింది.

ప్రభుత్వ నిర్ణయం ప్రకారం హై స్కిల్డ్ ఉద్యోగి వేతనం రూ.22,589 నుంచి రూ.30, 605కు పెరిగింది. అలానే స్కిల్డ్ ఉద్యోగి జీతం 20,598 నుంచి రూ.27,953లకు పెంచారు. సెమీ స్కిల్డ్ ఉద్యోగి వేతనం రూ.17,144 నుంచి రూ.23, 236 కు పెరిగింది. అన్ స్కిల్డ్ ఉద్యోగి సాలరీ రూ.16,473 నుంచి 22,318 కు పెంచారు. జీతాల పెంపుపై ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేశారు.. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. అలానే విధి నిర్వహణలో ఉద్యోగి మృతి చెందితే కారుణ్య నియామకం కింద వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని కోరుతున్నారు.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibomgrandpashabetmarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetgrandpashabet girişgrandpashabetjojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabet