iDreamPost

రైతులకు అలర్ట్.. ఆ పని చేయకపోతే నష్టపోతారు!

రైతులకు అలర్ట్.. ఆ పని చేయకపోతే నష్టపోతారు!

రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వ ఎన్నో వినూత్నమైన పథకాలను ప్రవేశపెట్టి వారి సంక్షేమం కోసం పాటుపడుతోంది. రైతు బీమా, రైతు బంధుతో ఆదుకుంటూ, వ్యవసాయంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉచిత కరెంటు, సాగు నీరు అందిస్తూ వ్యవసాయాన్ని పండగలా మార్చింది. దీంతో పాటు ఆరుగాళం శ్రమించి పంట పండించిన రైతుకు తగిన గిట్టు బాటు ధర అందించాలని ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేస్తోంది. ఈ క్రమంలో రైతులకు రాష్ట్ర సివిల్ సప్లై డిపార్ట్ మెంట్ కీలకమైన సూచనలు చేసింది. ఆధార్ లేని రైతులు అలా చేయకపోతే నష్టపోతారని సూచించింది. వెంటనే ఆ పని పూర్తి చేయాలని కోరింది. వివరాల్లోకి వెళ్తే..

తెలంగాణలో ఆధార్ లేని రైతులు కొత్తగా నమోదు చేసుకోవాలని సివిల్ సప్లై డిపార్ట్ మెంట్ సూచించింది. రైతులకు ఆధార్ తప్పని సరి అని, ఆధార్ లేని రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకునే సమయంలో ఇబ్బందులు తలెత్తుతాయని తెలిపింది. ధాన్యం కొనుగోలుకు ఆధార్ లింక్ చేసి, రైతుల బయోమెట్రిక్ చేయాలని సివిల్ సప్లై డిపార్ట్ మెంట్ నిర్ణయించింది. ప్రతి ప్యాడీ పర్చేజింగ్ సెంటర్ (పీపీసీ)లో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయనున్నారు. రైతులు వేలి ముద్ర వేసిన తర్వాతే ధాన్యాన్ని కొనుగోలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి