iDreamPost

చంద్రబాబుకి ఫైబర్ గ్రిడ్ కేసులో షాక్!

మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కి సంబంధించిన కేసుల్లో ఫైబర్ గ్రిడ్ ప్రధానమైనది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన పలు అంశాలను సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టులో సమర్పించారు. తాజాగా ఈ కేసులో సీఐడి అధికారులు దూకుడు పెంచారు.

మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కి సంబంధించిన కేసుల్లో ఫైబర్ గ్రిడ్ ప్రధానమైనది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన పలు అంశాలను సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టులో సమర్పించారు. తాజాగా ఈ కేసులో సీఐడి అధికారులు దూకుడు పెంచారు.

చంద్రబాబుకి ఫైబర్ గ్రిడ్ కేసులో షాక్!

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చుట్టునే తిరుగుతున్నాయి. ఆయన దాదాపు రెండు నెలల క్రితం ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టైన సంగతి తెలిసిందే. 52 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు ఉన్నారు. ఇక స్కిల్ డెవలప్మంట్ కేసే కాకుండా చంద్రబాబుపై అనేక కేసులు ఉన్నాయి. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగళ్ల అల్లర్లు, ఫైబర్ గ్రిడ్ వంటి కేసుల్లో చంద్రబాబు పేరు ఉంది. ఈ కేసులన్నిటిల్లో ఇప్పటికే వివిధ కోర్టులో చంద్రబాబుకు అనేక ఎదురు దెబ్బతగిలాయి. తాజాగా చంద్రబాబుకు మరో షాక్ తగిలింది. అది కూడా ఫైబర్ గ్రిడ్ కేసులో సీఐడీ కీలక నిర్ణయం తీసుకుంది.

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిపై ఉన్న కేసుల్లో స్కిల్ డెవలప్మంట్ తరువాత అతిప్రధానమైనది.. ఫైబర్ గ్రిడ్ కేసు. ఈ కేసులో భారీగా అవినీతి జరిగిదంటూ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. అంతేకాక ఈ కేసులో చంద్రబాబు పేరును కూడా చేర్చారు. తక్కువ ధరకే నెట్ ఇచ్చే పేరుతో.. భారీగా అవినీతికి పాల్పడినట్లు సీఐడీ అధికారులు ఆరోపించారు. ఇప్పటికే ఈ కేసు ఏసీబీ కోర్టులో  ఉంది. తాజాగా ఫైబర్ గ్రిడ్ కేసులో సీఐడీ అధికారులుు దూకుడు పెంచారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సన్నిహితుల స్థిరాస్తుల అటాచ్‌మెంట్‌ చేయడానికి నిర్ణయించారు. ఏడు స్థిరాస్తులను అటాచ్‌ చేయాలని సీఐడీ అధికారుల ప్రతిపాదనకు రాష్ట్ర హోంశాఖ కూడా ఆమోదం తెలిపింది.

తాజాగా ఫైబర్ నెట్ కేసులో ఆస్తుల కోసం ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు పిటిషన్ వేశారు. చంద్రబాబు సన్నిహితులకు చెందిన ఏడు ఆస్తుల అటాచ్ మెంట్ కు  కోర్టుకు సీఐడీ ప్రతిపాదనలను పిటిషన్ లో పొందుపర్చింది. కోర్టు అనుమతిస్తే అటాచ్మెంట్ ప్రక్రియ సీఐడీ మొదలు పెట్టనుంది. సీఐడీ ప్రతిపాదనలకు ఇప్పటికే అనుమతిస్తూ హోంశాఖ ఉత్తర్వూలు జారీ చేసింది. స్థిరాస్తుల అటాచ్ మెంట్ కు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ ఫైల్ చేసింది. ఫైబర్ నెట్ కేసులో ఉన్న టెరాసాఫ్ట్ కంపెనీ  ఎండీతో పాటు చంద్రబాబు సన్నిహితులకు చెందిన స్థిరాస్తుల అటాచ్మెంట్ కోసం పిటిషన్ దాఖలు చేసింది.

అటాచ్‌ ఆస్తుల్లో గుంటూరులో ఇంటి స్థలం, విశాఖపట్నంలో ఓ ఫ్లాట్, హైదరాబాద్‌లోని నాలుగు ఫ్లాట్లు, రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ భూమి తదితర ఆస్తుల అటాచ్‌మెంట్‌కు హోంశాఖ ఉత్తర్వుల ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆ స్థిరాస్తులను అటాచ్‌మెంట్‌కు అనుమతించాలని కోరుతూ సీఐడీ అధికారులు ఇవాళ విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో పిటిషన్‌ను దాఖలు చేశారు. ఏసీబీ కోర్టు అనుమతి ఇస్తే.. చంద్రబాబుకు మరో షాక్ తగిలినట్లే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. మరి..ఫైబర్ గ్రిడ్ కేసులో సీఐడీ మరో పిటిషన్ వేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి