iDreamPost
android-app
ios-app

మెగాస్టార్ 156వ సినిమా టైటిల్ రిలీజ్.. అదిరిపోయిందిగా!

Viswambhara: బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రంను మెగా 156గా పిలుస్తున్నారు. చిరుకి ఇది 156వ చిత్రం కావడంతో ఈ సినిమాకి వర్కింగ్ టైటిల్ మెగా156 అని పెట్టారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి టైటిల్ ను మూవీ టీమ్ విడుదల చేసింది.

Viswambhara: బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రంను మెగా 156గా పిలుస్తున్నారు. చిరుకి ఇది 156వ చిత్రం కావడంతో ఈ సినిమాకి వర్కింగ్ టైటిల్ మెగా156 అని పెట్టారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి టైటిల్ ను మూవీ టీమ్ విడుదల చేసింది.

మెగాస్టార్ 156వ  సినిమా టైటిల్ రిలీజ్.. అదిరిపోయిందిగా!

మెగాస్టార్ చిరంజీవి తెలుగు ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకున్న హీరో. స్వయం కృషితో ఒక్కోమెట్టు ఎక్కుతూ ప్రేక్షకుల మదిలో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న హీరో చిరు. ఇప్పటికి యువ హీరోలకు తనదైన శైలిలో పోటీ ఇస్తూనే ఉన్నారు. ప్రస్తుతం  వశిష్ఠ దర్శకత్వంలో తన 156వ చిత్రంలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ సినిమా టైటిల్ మీద గతంలో ఎన్నో చర్చలు నడిచాయి. సోషల్ మీడియాలోనూ ఈ విషయమై చాలా టాక్ నడిచింది. వశిష్ఠ, చిరు కాంబినేషన్ లో రాబోతున్న ఈ చిత్రానికి  ఏ టైటిల్ ను ఫిక్స్ చేస్తారా అని అభిమానులు.. ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.  మూవీ మేకర్స్ ఈ సినిమా టైటిల్ ను ఫిక్స్ చేసినట్లుగా కూడా గతంలో కొన్ని వార్తలు వినిపించాయి. ఎట్టకేలకు తాజగా చిత్ర బృందం.. చిరు నటిస్తున్న 156వ చిత్రం పేరును ప్రకటించింది.

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న  156వ చిత్రం “విశ్వంభర”. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. సంగీత దర్శకుడిగా కీరవాణి వ్యవహరించనున్నారు. చంద్రబోస్ సాహిత్యం ఈ సినిమాకు వెన్నుముకగా ఉండబోతుందని సమాచారం. చిరు వింటేజ్ కమ్ బ్యాక్ కోసం ఎంతో మంది అభిమానులు ఎదురుచూస్తున్నారు . ఈ చిత్రంలో చిరు ఐదుగురు టాప్ హీరోయిన్స్ తో స్క్రీన్ ను పంచుకోనున్నారనే కథనాలు వినిపిస్తున్నాయి. కాగా.. చిరు ఈ చిత్రం తర్వాత మరో రెండు చిత్రాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. ఇలా వరుస సినిమాలతో మెగాస్టార్ టాలీవుడ్ లో బిజీగా ఉన్నారు. మరి చిరు ప్రస్తుతం నటిస్తున్న ” విశ్వంభర  ” తన  గ్రాఫ్ ను ఎక్కడ ఉంచబోతుందో వేచి చూడాలి.

ఏదేమైనా.. టాలీవుడ్ లో ఎంత మంది హీరోలు వచ్చినా సరే చిరుకు మాత్రం ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇక ఇప్పుడు మెగాస్టార్ కెరీర్ లో రాబోయే చిత్రాలు.. ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటాయో చూడాల్సి  ఉంది. గతేడాది సంక్రాంతికి వాల్తేరు వీరయ్య చిత్రంతో మెగాస్టార్ బ్లాక్‍బాస్టర్ హిట్ కొట్టారు. ఆ తర్వాతవచ్చిన భోళా శంకర్ తీవ్రంగా నిరాశపరిచింది. దీంతో కాస్త గ్యాప్ తీసుకొని తదుపరిగా ఈ సోషియో ఫ్యాంటసీ మూవీకి మెగాస్టార్ చిరంజీవి ఓకే చెప్పారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ రోజు సాయంత్రం 5 గంటలకు మెగా156 టైటిల్‍ను ప్రకటింటించారు. దీంతో పండుగ రోజున మెగా అభిమానులు.. తమకు మంచి గిఫ్ట్ వచ్చినట్లుగా సంతోషం వ్యక్తంచేస్తున్నారు. మరి, తాజాగా విడుదలైన చిరు 156వ చిత్రం టైటిల్ ” విశ్వంభర “పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

jojobet girişmarsbahisJojobet GirişcasibomJojobet GirişCasibomcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobettaraftarium24madridbet güncel girişmadridbet güncel girişmadridbetholiganbet giriş