iDreamPost

అంజనమ్మగారి దేశభక్తి

Anjanamma was Patriotic: మెగాస్టార్ చిరంజీవి తల్లిదండ్రులు పిల్లల్ని ఎలాంటి క్రమశిక్షణతో పెంచారన్నది మెగాబ్రదర్స్ ఎదుగుదల చూస్తే అర్థమవుతుంది.

Anjanamma was Patriotic: మెగాస్టార్ చిరంజీవి తల్లిదండ్రులు పిల్లల్ని ఎలాంటి క్రమశిక్షణతో పెంచారన్నది మెగాబ్రదర్స్ ఎదుగుదల చూస్తే అర్థమవుతుంది.

అంజనమ్మగారి దేశభక్తి

మెగాస్టార్ చిరంజీవి తల్లిదండ్రులు పిల్లల్ని స్పష్టమైన క్రమశిక్షణతో పెంచారన్నది మెగాస్టార్ జీవితాన్ని చూస్తేనే అర్ధమవుతుంది. అందులోనూ అన్ని రకాలైన నీతిప్రాయమైన, రుజుసిద్ధాంతాలను, దైవభక్తిలతో పాటు దేశభక్తిని కూడా సమపాళ్ళలో రంగరించారన్నది కొన్ని సందర్భాలు చెప్పకనే చెబుతాయి. మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనమ్మగారి నరరాల్లోనూ దేశభక్తి నిండి ఉందన్నవిషయం ఇటీవల జరిగిన ఆపరేషన్ వేలంటైన్ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మెగాబ్రదర్ నాగబాబు మాటల్లో సుస్పష్టమైంది.

దేవుడుకి పూజ చేసే వేళలో సాధారణంగా చదువుకునే స్త్రోత్రాలు, మంత్రాలతో పాటు అంజనమ్మగారు దేశసరిహద్దులపైన దేశరక్షణ కోసం ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి కాపలా కాసే సైనికుల ప్రాణాలను రక్షించి, వారిని ఆపదలనుండి కాపాడమని కూడా ప్రత్యేకంగా దైవాన్ని ప్రార్ధిస్తారన్న సంగతిని మెగాబ్రదర్ తెలియజేయడం ఆడిటోరియంని ఆశ్చర్యపరచింది. ఆశ్చర్యపరిచినా, అది పచ్చినిజం. ఈ ఆశ్చర్యం మొట్టమొదట మెగాబ్రదర్ మదిలోనే కలగడం విశేషం. అమ్మా….ఇలా కూడా నువ్వు దేవుడిని కోరుకుంటావా అని అంజనమ్మగారిని అడిగిన ఆయనకు ఆమె అద్భుతమైన సమాధానమిచ్చారు. మనకోసం ప్రాణాలర్పించడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళ గురించి కాక మరెవరి గురించి ప్రార్ధించాలిరా……అన్నది అంజనమ్మగారి సమాధానం.

మెగాబంధువులలో దేశసైన్యంలో పనిచేసినవారున్నారు. కొందరు యుద్ధంలో అసువులు బాసినవారున్నారు. కొందరు రిటైర్మెంట్ వరకూ సైన్యంలో పనిచేసి, ప్రతీక్షణం దేశం కోసమే పోరాడి ఇంటికి తిరిగొచ్చినవారూ ఉన్నారు. అందుకే అంజనమ్మగారిలో ఆ దేశభక్తికి సంబంధించిన భక్తిప్రపత్తులు నిండుగా మెండుగా ఉన్నాయి. మెగాబ్రదర్ నాగబాబు ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చాలా నిర్మొహమాటంగా చెప్పారు. తాను వరుణ్ తేజ్ గురించో, నిర్మాతల గురించో, దర్శకుడి గురించో మాట్లాడడానికి రాలేదని, కేవలం దేశ కోసం అహర్నిశలు కష్టపడిన జనరల్ మానెక్షాలాటి మహనీయుల గురించి మాట్లడానికి మాత్రమే వచ్చానని చెప్పి అందరి మన్ననలను అందుకున్నారు.

అసలు ఏ ఫంక్షన్లకీ రాని మెగా బ్రదర్ నాగబాబు ఈ ఫంక్షన్కి రావడమే ఈ సినిమా కేవలం దేశరక్షణలో అన్నిటినీ త్యాగం చేయడానికి ముందువరసలో ఉండే సైనికుల మీద సినిమా కావడం ప్రధాన కారణమని మెగా బ్రదర్ చెప్పడం అందరినీ ఆకట్టుకుంది. తర్వాత వచ్చిన ముఖ్యఅతిధి మెగాస్టార్ చిరంజీవి కూడా తన మాటల్లో సైనికులే రియల్ హీరోలని చెప్పి, ఇటువంటి సినిమాలను చూపి ప్రోత్సహించడం కేవలం త్రిదళ సైనికవిభాగాలకు సమర్పించే నిజమైన నివాళి అని తన దేశభక్తిని కూడా నిరూపించుకున్నట్టుగా మాట్లాడారు. మొత్తానికి ఆపరేషన్ వేలంటైన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ పూర్తిగా దేశబక్తి వైబ్రేషన్లతో ప్రతిధ్వనించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి