iDreamPost

మంచి మనసు చాటుకున్న చిరంజీవి.. అనారోగ్యం పాలైన బాల్య మిత్రుడి కోసం..

  • Published Oct 23, 2023 | 2:07 PMUpdated Oct 23, 2023 | 2:07 PM

చిరంజీవి దాతృత్వం గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఇండస్ట్రీలో ఎవరికి ఎలాంటి సాయం కావాలన్న.. చిరు ముందుంటారు. అలానే బ్లడ్‌ బ్యాక్‌, ఐ బ్యాంక్‌ వంటి సేవా సంస్థలను ఏర్పాటు చేసి.. ఎందరినో ఆదుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా బాల్య మిత్రుడిని ఆదుకుని మంచి మనసు చాటుకున్నారు చిరంజీవి. ఆ వివరాలు..

చిరంజీవి దాతృత్వం గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఇండస్ట్రీలో ఎవరికి ఎలాంటి సాయం కావాలన్న.. చిరు ముందుంటారు. అలానే బ్లడ్‌ బ్యాక్‌, ఐ బ్యాంక్‌ వంటి సేవా సంస్థలను ఏర్పాటు చేసి.. ఎందరినో ఆదుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా బాల్య మిత్రుడిని ఆదుకుని మంచి మనసు చాటుకున్నారు చిరంజీవి. ఆ వివరాలు..

  • Published Oct 23, 2023 | 2:07 PMUpdated Oct 23, 2023 | 2:07 PM
మంచి మనసు చాటుకున్న చిరంజీవి.. అనారోగ్యం పాలైన బాల్య మిత్రుడి కోసం..

అన్ని బంధాల కన్నా స్నేహ బంధం గొప్పదని అంటారు. బంధువులు, నా అనుకున్నవారు ఆదుకోని సమయంలో.. స్నేహితులే పెద్ద దిక్కయి ఆదుకుంటారు. మన దగ్గర డబ్బులుంటే.. బంధుగణం మన చుట్టూ చేరి భజన చేస్తుంది.. అదే డబ్బులేక ఇబ్బందులు పడుతుంటే.. ముఖం పక్కకు తిప్పుకుని పోతారు. కనీసం మనల్ని మనుషులుగా కూడా గుర్తించరు. కానీ మిత్రులు అలా కాదు. కష్టమైనా, నష్టమైనా సరే.. మన వెన్నంటి ఉండి నడిపిస్తారు. అయితే అన్ని స్నేహాలు ఇలానే ఉంటాయి అనుకుంటే తప్పులో కాలేసినట్లే. మన సమాజంలో స్నేహితులు నిలిపిన జీవితాలు ఎన్ని ఉన్నాయో.. చెడగొట్టిన బతుకులు కూడా అదే స్థాయిలో ఉన్నాయి.

ఇక కొందరు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న తర్వాత.. పాత స్నేహితులను మర్చిపోతారు. సాయం చేయడం కాదు కదా.. కనీసం పలకరించరు కూడా. కానీ కొందరు మాత్రం.. జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా.. తాము నడిచి వచ్చిన దారిని.. తోడుగా నిలిచిన ఆప్తులను మర్చిపోరు. అన్ని వేళలా అండగా ఉండి ఆదుకుంటారు. ఈలాంటి వారి జాబితాలో మెగాస్టార్‌ చిరంజీవి ముందు వరుసలో ఉంటారు. తన బాల్య స్నేహితుడికి ఆరోగ్యం బాగా లేదని తెలుసుకున్న చిరంజీవి.. అతడిని ఆస్పత్రిలో చేర్పించి.. వైద్యం అందించారు. ఆవివరాలు..

మంచి మనసు చాటుకున్న మెగాస్టార్‌..

మెగాస్టార్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. అనారోగ్యం బారిన పడిన చిన్ననాటి మిత్రుడికి మర్చిపోలేని సాయం చేసి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. చిరంజీవి బాల్యం అంతా మొగల్తూరులో గడిచిందనే సంగతి తెలిసిందే. అక్కడ ఆయనకు పువ్వాడ రాజా అనే బాల్య మిత్రుడు ఉన్నాడు. అయితే ఈమధ్య కాలంలో అతడి ఆరోగ్యం దెబ్బ తిన్నది. ఈ విషయం కాస్త చిరంజీవికి తెలిసింది. దాంతో చిరు స్వయంగా రాజాకు ఫోన్ చేసి క్షేమ సమాచారాలు తెలుసుకున్నారు. ఆ కుటుంబానికి అండ‌గా నిలుస్తాన‌ని భ‌రోసానిచ్చారు.

అంతేకాక చెప్పిన ప్రకారం.. ఇటీవల తన స్నేహితుడు రాజాని.. హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేర్పించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా చిరు ఆస్పత్రికి వెళ్లి మిత్రుడిని పలకరించి, అతడి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను నటుడు, నిర్మాత బండ్ల గణేశ్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

చిరంజీవిపై ప్రశంసల జల్లు..

ఈ వార్త తెలిసి చిరంజీవి పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. స్నేహితులకు బాగోకపోతే.. ఎక్కడ సాయం చేయాల్సి వస్తుందో అని భావించి.. తప్పించుకొని తిరిగే వ్యక్తులున్న ఈరోజుల్లో.. ఎప్పుడో చిన్నప్పుడు తనతో కలిసి తిరిగిన స్నేహితుడికి చిరంజీవి చేసిన సాయం నిజంగా గ్రేట్‌. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం అనేది చిరంజీవి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి అని కామెంట్స్‌ చేస్తున్నారు నెటిజనులు. బండ్ల గణేష్ సైతం చిరుని ట్యాగ్ చేస్తూ ‘మీరు గ్రేట్‌ సర్‌’ అంటూ ప్రశంసించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌ గా మారాయి.

ఇక సినిమాల విషయానికొస్తే.. 2023 సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’ తో బ్లాకబాస్టర్‌ హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నారు చిరంజీవి. గ్రాండ్‌గా న్యూ ఇయర్‌ని ప్రారంభించిన చిరు.. ఆ తర్వాత ఢీలా పడ్డారు. వాల్తేరు వీరయ్య తర్వాత.. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరు నటించిన ‘భోళా శంకర్‌’ చిత్రం తీవ్రంగా నిరాశ పరిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టార్‌గా నిలిచింది. దాంతో తరువాత చేయేబోయే ప్రాజెక్ట్స్‌ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటున్నారు చిరంజీవి. ప్రసుత్తం ‘బింబిసార’ ఫేమ్‌ వశిష్ఠ దర్శకత్వంలో ఓ సోషియో ఫాంటసీ మూవీ చేయడానికి రెడీ అయ్యారు. ఈ సినిమా 2025లో విడుదల అవుతుందని ప్రచారం సాగుతోంది. ఫ్రెండ్‌కి చిరు చేసిన సాయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి