iDreamPost

Sr. NTR సలహాలే నా జీవితాన్ని నిలబెట్టాయి! చిరు ఎమోషనల్ కామెంట్స్!

  • Published Jan 20, 2024 | 5:13 PMUpdated Jan 20, 2024 | 5:38 PM

ఇటీవల సీనియర్ ఎన్టీఆర్ 28వ వర్థంతి సంధర్బంగా పలువురు సినీ ప్రముఖులు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరజీవి ఎన్టీఆర్ ను గుర్తుతెచ్చుకుంటూ.. ఆయన గొప్ప తనాన్ని కొనియాడారు.

ఇటీవల సీనియర్ ఎన్టీఆర్ 28వ వర్థంతి సంధర్బంగా పలువురు సినీ ప్రముఖులు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరజీవి ఎన్టీఆర్ ను గుర్తుతెచ్చుకుంటూ.. ఆయన గొప్ప తనాన్ని కొనియాడారు.

  • Published Jan 20, 2024 | 5:13 PMUpdated Jan 20, 2024 | 5:38 PM
Sr. NTR సలహాలే  నా జీవితాన్ని నిలబెట్టాయి! చిరు ఎమోషనల్ కామెంట్స్!

తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న హీరోల మధ్యన ఎటువంటి బాండింగ్ ఉంటుందో తెలియదు కానీ.. టాలీవుడ్ ఇండస్ట్రీని కొన్ని సంవత్సరాల పాటు తమ భుజాల మీద మోసి.. వారి జ్ఞాపకాలను కొన్ని తరాల పాటు గుర్తుండిపోయేలా చేసి.. ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రను సంపాదించుకున్న.. ఆ ఇద్దరి లెజెండరీ యాక్టర్స్ గురించి అందరికి తెలుసు. ఈ తరం వారిని సైతం వారి చిత్రాలు అలరిస్తునే ఉన్నాయి. వారి సినీ వారసత్వాన్ని తీసుకుని ఇప్పుడు ఇండస్ట్రీని ఏలుతున్న హీరోలు ఉన్నారు. వారి నటనను ఆదర్శంగా తీసుకుని తెలుగు ఇండస్ట్రీలో హీరోగా అరంగేట్రం చేసి.. స్వయం కృషితో ప్రేక్షకుల మన్నన పొందిన హీరోలు ఉన్నారు. వారే ఎన్టీఆర్ , ఏ ఎన్ ఆర్ . వారిలో మొదటిగా చెప్పుకోవాల్సిన పేరు నందమూరి తారక రామారావు. ఈ పేరు తెలియని వారు ఎవరు ఉండరు. అయితే, రెండు రోజుల క్రితం సీనియర్ ఎన్టీఆర్ 28వ వర్థంతి సందర్బంగా.. ఇండస్ట్రీలోని పలువురు సినీ హీరోలు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి ఎన్టీఆర్ ను స్మరించుకుంటూ.. వారి మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తుతెచ్చుకున్నారు.

మెగాస్టార్ చిరంజీవి.. సీనియర్ ఎన్టీఆర్ వర్థంతి సంధర్బంగా ఓ సభలో మాట్లాడుతూ.. రామారావు గారి గురించి, అక్కినేని నాగేశ్వరరావు గారి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదని.. వారితో పాటు అప్పటిలో నేను కూడా సినిమాలలో కలిసి నటించడం తన పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నానని చెప్పుకొచ్చారు. అదే విధంగా ఆ సమయంలో వారితో జరిగిన కొన్ని సంభాషణలను కూడా పంచుకున్నారు. అలాగే రామారావు గారితో పాటు ఒక సినిమాలో నటించినప్పుడు.. ఆయన ఇచ్చిన సలహాలు, సూచనలు గురించి చెప్పారు. అలాగే ఒకానొక సమయంలో ఎన్టీఆర్.. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఇచ్చిన సలహాలను కూడా చిరు ఇలా చెప్పుకొచ్చారు. ” బ్రదర్.. మీరు బాగా అభివృద్ధిలోకి వస్తున్నారు. మీరు సంపాదించిన సంపద అంతా ఇనుప ముక్కల మీద పెట్టకండి. ఏదైనా మంచి ఇళ్ళు కట్టుకోండి. తర్వాత ఏదైనా స్థలాలు కొనండి. ఎప్పటికైనా మనల్ని కాపాడేది అదే. మనం ఎక్కువ కాలం ఇదే సూపర్ స్టార్ డం తో ఉంటాము. ఇది శాశ్వతం అని మాత్రం అనుకోకండి ” అని ఎంతో జాగ్రత్తగా ముందు చూపుతోటి చెప్పారని చిరు వారి మధ్య జరిగిన సంభాషణను పంచుకున్నారు.

అలాగే N T రామారావు గారు దూరద్రుష్టితో చాలా సలహాలు ఇచ్చారని. అప్పటి వరకు కారులు కొందాం అనుకున్న చిరు.. ఎన్టీఆర్ చెప్పిన తరువాత భూములు మీద పెట్టుబడి పెట్టారని. ఈరోజు చిరు రెమ్యూనరేషన్ కంటే ఆ స్థలాలే చిరంజీవి కుటుంబాన్ని కాపాడుతున్నాయని.. ఆ సంధర్బంగా వారి మధ్యన ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఏదేమైనా ఒకప్పటి సినీ తారలకు ఒకరి పట్ల ఒకరికి ఉన్న అనుబంధం ఎటువంటిదో.. చిరంజీవి చెప్పిన మాటలని బట్టి అర్ధం చేసుకోవచ్చు. తెలుగు నాట ఎప్పటికి వీరి పేరు చరిత్రలో నిలిచిపోతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మరి, మెగాస్టార్ చిరంజీవి.. సీనియర్ ఎన్టీఆర్ గురించి పంచుకున్న విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి