iDreamPost
android-app
ios-app

మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ మ్యాన్ చేయకపోవడమే మంచిదైంది!

మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ మ్యాన్ చేయకపోవడమే మంచిదైంది!

మెగాస్టార్ చిరంజీవి.. ఒక్క తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా యావత్ భారతదేశంలో ఉన్న సినీ ప్రేక్షకులు ఇష్టపడే ఒక గొప్ప స్టార్ హీరో. ఒక్కడిగా వచ్చి ఒక శిఖరంలా ఎదిగాడు. దాదాపు 3 దశాబ్దాలపాటు మకుటంలేని మహారాజుగా తెలుగు చలనచిత్ర పరిశ్రమను ఏలిన వ్యక్తి. ఇప్పుడు రెండు, మూడు సినిమాలు ఆశించిన ఫలితం రాకపోయేసరికి అందరూ ఆయన్ను జడ్జ్ చేస్తున్నారు. ఇటీవల ఫ్యామిలీ మ్యాన్ కథను తాను రిజెక్ట్ చేసిన విషయం బయటకు వచ్చింది. అందరూ అలాంటి కథను ఎలా రిజెక్ట్ చేశారు అంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే చిరంజీవి ఫ్యామిలీమ్యాన్ కథను రిజెక్ట్ చేయడమే మంచిదైంది.

సాధారణంగా హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు. కానీ, హీరోలే ఫ్యాన్స్ గా ఉన్న వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. ఇండస్ట్రీ హిట్టులు, బాక్సాఫీస్ కలెక్షన్స్ అనేవి ఆయనకు తెలియనవి కాదు.. చూడనివి కాదు. బిగ్గర్ ద్యాన్ బిగ్ బీ అని బిరుదు సొంతం చేసుకున్న వ్యక్తి. పాన్ ఇండియా లెవల్లో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకున్న హీరో. ఇప్పుడు ఆచార్య, భోళా శంకర్ వంటి సినిమాలు ఆశించిన ఫలితాలు అందుకోలేక పోయాయని చిరంజీవి స్టోరీ జడ్జిమెంట్ ఎబిలిటీనే శంకిస్తున్నారు. ఆయన కథలను సరిగ్గా ఎంచుకోలేకపోతున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు. అంతేకాకుండా కొంతమంది అలాచేస్తే బాగుండేది.. ఇలా చేసుండాల్సింది అంటూ ఉచిత సలహాలు కూడా ఇవ్వడం మొదలు పెట్టారు.

ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే.. 155 సినిమాలు తీసిన అనుభవం, పది మంది వరకు హీరోలను తన భుజాలపై నిలబెట్టి ఇండస్ట్రీకి అందిచిన ఘనత ఆయన సొంతం. అలాంటి వ్యక్తికి ఎవరు కొత్తగా పాఠాలు నేర్పించాలి? ఏ కథను ఒప్పుకుంటే బాగుంటుందో చెప్పాలి? మీరు ఒప్పుకోకపోయినా ఫ్యామిలీ మ్యాన్ కథను చిరంజీవి రిజెక్ట్ చేయడమే మంచిదైంది. ఫ్యామిలీ మ్యాన్ కథను ఎవరూ తక్కువ చేయడం లేదు. పాన్ ఇండియా లెవల్లో ఎంతో గొప్ప ప్రేక్షకాదరణ పొందిన వెబ్ సిరీస్ అది. విడుదలైన రెండు సీజన్స్ కు ప్రేక్షకుల నుంచి ఎంతో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ రెండు పార్టులు చూసిన వాళ్లు ఒక విషయాన్ని బాగా గమనించి ఉంటారు. అదేంటంటే.. హీరోకి ఎక్కడా ఎలివేషన్స్ ఉండవు, సెపరేట్ పుషింగ్ సీన్స్ ఉండవు.

కథతో పాటుగా హీరో కూడా సాగిపోతూ ఉంటాడు. కథకు తగ్గట్లు మనోజ్ బాజ్ పాయీ కూడా చాలా బాగా యాక్ట్ చేసుకుంటూ వెళ్లాడు. అయితే అదే కథను అదే విధంగా చిరంజీవిని పెట్టి తియ్యాలి అంటే అయ్యే పని కాదు. చిరంజీవి నటిస్తున్నారు అంటే కొన్ని ఎలివేషన్స్, కొన్ని ఎస్టాబ్లిమెంట్ షాట్స్, హీరోయిజం ఉన్న సన్నివేశాలను అభిమానులు కోరుకుంటారు. చిరంజీవి పాత్రకు తగ్గట్లు ఆ కథలో స్టార్ హీరో ఎలిమెంట్స్ ని కొన్ని ఇరికించాల్సి వస్తుంది. అలా చేస్తే కథలో ఉండే సోల్ మిస్ అయ్యే ప్రమాదం లేకపోలేదు. ఫ్యామిలీ మ్యాన్ చూసిన వాళ్లు ఏదైనా ఒక సీన్ లో మనోజ్ బాజ్ పాయీకి బదులుగా మెగాస్టార్ చిరంజీవిని ఊహించుకుని చూడండి. సమాధానం మీకే అర్థమవుతుంది. అందుకే ఇప్పుడేదో వస్తున్న రిజల్ట్స్ ని బట్టి మెగాస్టార్ చిరంజీవి ఎబిలిటీని క్వశ్చన్ చేయడం కరెక్ట్ కాదనే చెప్పాలి.