iDreamPost

Chiranjeevi: హనుమాన్, గుంటూరు కారం వివాదంపై చిరంజీవి ఆసక్తికర కామెంట్స్

  • Published Jan 08, 2024 | 10:24 AMUpdated Jan 08, 2024 | 10:24 AM

హనుమాన్ విడుదల విషయం పై చిరంజీవి స్పందిస్తూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఆ వివరాలు..

హనుమాన్ విడుదల విషయం పై చిరంజీవి స్పందిస్తూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఆ వివరాలు..

  • Published Jan 08, 2024 | 10:24 AMUpdated Jan 08, 2024 | 10:24 AM
Chiranjeevi: హనుమాన్, గుంటూరు కారం వివాదంపై చిరంజీవి ఆసక్తికర కామెంట్స్

సంక్రాంతి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా పెద్ద పండుగ. ఎక్కడెక్కడో ఉన్న వారు.. పండుగకు సొంత ఊళ్లకు తరలి వెళ్తారు. గ్రామాలన్ని కలకల్లాడతాయి. ఇక సంక్రాంతి సంబురాలు అనగానే గుర్తుకు వచ్చే మరో అంశం.. సినిమాలు. సంక్రాంతి సందర్భంగా నాలుగైదు పెద్ద పెద్ద సినిమాలు థియేటర్స్ లో విడుదలవుతాయి. సంక్రాంతి అంటే జనాలకు మాత్రమే కాక.. సినిమాల వాళ్లకు కూడా పెద్ద పండుగే. బడా బడా హీరోలు సంక్రాంతి బరిలో దిగడానికి ఆసక్తి చూపుతారు. ప్రతి ఏటా సంక్రాంతి బరిలో స్టార్ హీరోల సినిమాలు పోటీ పడతాయి. సినీ అభిమానులు కూడా సంక్రాంతి సినిమాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు.

ఇక ఈ ఏడాది కూడా సంక్రాంతి బరిలో నలుగురు స్టార్ హీరోలు పోటీ పడుతున్నారు. మహేష్ బాబు గుంటూరు కారం, వెంకటేష్ సైంధవ్, నాగార్జున నా సామిరంగా సినిమాలతో పోటీ పడుతుండగా.. వీరితో ఢీకొట్టేందుకు రెడీ అవుతున్నాడు యంగ్ హీరో తేజ సజ్జ. హనుమాన్ సినిమాతో సంక్రాంతి బరిలోకి దిగుతున్నాడు.

megastar comments on haniman function

అయితే హను-మాన్ సినిమా విడుదల విషయంలో అనేక అవాంతరాలు ఎదుర్కొంటుంది. ఈ సినిమా విడుదలను ఆపేయాలనే ప్రయత్నలు జరిగాయని.. చిన్న ప్రాజెక్ట్‌ కదా మరో తేదీలో విడుదల చేసుకోవచ్చు కదా అంటూ చిత్ర పరిశ్రమ నుంచి కొందరు ఒత్తిడి తీసుకొస్తున్నారని గతంలో నిర్మాత నిరంజన్‌ రెడ్డి తెలిపిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇండస్ట్రీలో గుంటూరు కారం వర్సెస్ హనుమాన్ వార్ సాగుతోంది. కారణం ఈ రెండు సినిమాలు ఒకే రోజున అనగా డిసెంబర్ 12న విడుదల అవుతున్నాయి. దాంతో ఈ రెండు సినిమాల ఫలితాలు ఎలా ఉంటాయో అన్న దానిపై పెద్ద ఎత్తున ఆసక్తికర ఏర్పడింది. ఈ క్రమంలో హనుమాన్ ప్రీరిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. ఈ వివాదంపై పరోక్షంగా స్పందించారు. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

చిరంజీవి మాట్లాడుతూ.. “ఈ సంక్రాంతి సీజన్‌కు ఎన్ని సినిమాలు వచ్చినా సరే.. కంటెంట్‌లో సత్తా ఉంటే.. దేవుడి ఆశీస్సులు ఉన్నాయంటే ప్రేక్షకులు కచ్చితంగా ఆదరించి, విజయం అందిస్తారు. ఇందులో ఎలాంటి సందేహం అక్కరలేదు. ఇప్పుడు ఇదీ కాస్త పరీక్షా కాలం అనుకోవచ్చు.. అందరూ అనుకున్నట్లుగా హనుమాన్‌ సినిమాకు సరిపడా థియేటర్లు దొరకకపోవచ్చు. కానీ సినిమాలో కంటెంట్‌ ఉంటే సెకండ్‌ షో చూస్తారు. అదీ లేకపోతే మరో వారం తర్వాత అయినా చూస్తారు. ఈ సంక్రాంతికి వస్తున్న గుంటూరు కారం, సైంధవ్, నా సామిరంగ సినిమాలతో పాటు హను–మాన్‌ కూడా బాగా ఆడాలి.. ఆడుతాయని ఆశిస్తున్నాను. చిత్ర పరిశ్రమ ఎప్పుడూ పచ్చగా ఉండాలని కోరుకుంటున్నాను” అని చెప్పుకొచ్చారు

అంతేకాక చిరంజీవి మాట్లాడుతూ..”2017 సంక్రాంతి సమయంలో కూడా ఇలాంటి సందర్భమే వచ్చింది. అప్పుడు రిలీజ్ సమయంలో చాలా పెద్ద సినిమాలు ఉన్నాయి. ఆ రేసులోకి శతమానం భవతి అనే చిన్న సినిమా తీసుకువచ్చి.. విడుదల చేశాడు నిర్మాత దిల్‌ రాజు. ఆ సమయంలో నేను దిల్ రాజుతో మాట్లాడాను. ఇంత రిస్క్ అవసరమా అని ప్రశ్నించాను. అందుకు ఆయన ఒకటే మాట అన్నాడు.. సినిమా బాగుంది.. అందరికీ నచ్చుతుందని విడుదల చేస్తున్నాను అన్నాడు. అనుకున్నట్లే ఆ సమయంలో శతమానం భవతి సినిమా సూపర్‌ హిట్‌ అయింది. ఈ ఏడాది కూడా చిన్న సినిమాగా వస్తున్న హనుమాన్‌ కూడా సూపర్‌ హిట్‌ అవుతుంది” అని అభిప్రాయపడ్డారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి