iDreamPost

పిఎం కేర్స్‌కి చైనా విరాళాలు: చైనాతో బిజెపికి సంబంధాలు:

పిఎం కేర్స్‌కి చైనా విరాళాలు: చైనాతో బిజెపికి సంబంధాలు:

బిజెపికి కౌంటరించిన కాంగ్రెస్

చైనా విషయంలో అధికార బిజెపి, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఒక పార్టీపై మరొక పార్టీ ఆరోపణ, ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి. చైనాతో మీకు సంబంధాలు ఉన్నాయంటే…మీకు సత్సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు గుప్పించుకుంటున్నాయి. బిజెపి తరపున ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా రంగంలోకి దిగి కాంగ్రెస్ పై విమర్శలు చేస్తుంటే.‌‌.కాంగ్రెస్‌కు నుంచి ఆ పార్టీ రాజ్యసభ ఎంపి, అధికార ప్రతినిధి అభిషేక్‌ మను సింఘ్వీ రంగంలోకి దిగి బిజెపి విమర్శలను తిప్పికొడుతున్నారు.

రాజీవ్‌ గాంధీ ఫౌండేషన్‌కి చైనా నిధులు అందాయని బిజెపి ఆరోపణల్ని తీవ్రతరం చేస్తున్న నేపథ్యంలో ఆ పార్టీపై కాంగ్రెస్‌ ఎదురుదాడికి దిగింది. భారత్, చైనా మధ్య ఉద్రిక్తత నెలకొన్న ఈ సంక్షోభ పరిస్థితుల్లో పిఎం కేర్స్‌ ఫండ్‌కి చైనా సంస్థలు ఇస్తున్న విరాళాలు కేంద్రం ఎందుకు స్వీకరిస్తోందని ప్రశ్నించింది. ప్రధాన మంత్రి మోడీ చైనాని ఒక దురాక్రమణదారుడిగా ఎందుకు చూడడం లేదని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి అభిషేక్‌ సింఘ్వీ నిలదీశారు.

Also Read:రాజీవ్‌ ఫౌండేషన్‌కి ‘ప్రధాని’ నిధులు: గాంధీ కుటుంబం పై జెపి నడ్డా ఆరోపణలు, కొట్టిపారేసిన కాంగ్రెస్

గత ఆరేళ్లలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో 18 సార్లు సమావేశమైన మోడీ ఆ దేశ దురాక్రమణని ఎందుకు గుర్తించలేదన్నారు. చైనాని దురాక్రమణదారుడుగా మోడీ అంగీకరించి తీరాలన్నారు. పిఎం కేర్స్‌ ఫండ్‌కి చైనా సంస్థల నుంచి నిధులు స్వీకరించడం జాతీయ భద్రతకి పెను ముప్పు అని సింఘ్వీ ఆందోళన వ్యక్తం చేశారు.

చైనా కంపెనీల నుంచి కోట్లాది రూపాయల నిధులు స్వీకరిస్తూ ఆ దేశం చేస్తున్న ఆక్రమణల నుంచి దేశాన్ని ఎలా రక్షించగలరో ప్రధాని సమాధానం చెప్పాలని అన్నారు. పిఎం కేర్స్‌కి చైనా కంపెనీలైన హవాయి రూ. 7 కోట్లు, టిక్‌టాక్‌ రూ. 30 కోట్లు, పేటిఎం రూ.100 కోట్లు, షియామీ రూ.15 కోట్లు, ఒప్పో రూ. కోటి ఇచ్చినట్టుగా సింఘ్వీ తెలిపారు.

కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ చైనా (సిపిసి)తో బిజెపికి ఎప్పట్నుంచో సత్సంబంధాలున్నాయని సింఘ్వీ ఆరోపించారు. 2007 నుంచి బిజెపి ఈ బంధాలను కొనసాగిస్తోందన్నారు. బిజెపి జాతీయ అధ్యక్షులుగా పనిచేసిన రాజ్‌నాథ్‌ సింగ్, నితిన్‌ గడ్కరీ, అమిత్‌ షా చైనాతో మంచి సంబంధాలు ఉన్నావారేనని అన్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీతో 13 ఏళ్లుగా సత్సంబంధాలున్న రాజకీయ పార్టీ మరొకటి దేశంలో లేదని విమర్శించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి