iDreamPost

HYDలోనే తయారైన బాలరాముడి పాదుకలు! వీరి జన్మ ధన్యం!

రామ నామ స్మరణతో అయోధ్య వీధులన్నీ మారుమోగిపోయాయి. అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట అంగరంగ వైభవంగా, అద్భుతంగా పూర్తి చేసుకుంది. అయితే రామునికి సమర్పించిన పాదుకలకు ఓ విశిష్టత ఉంది. ఇంతకు అదేంటంటే..?

రామ నామ స్మరణతో అయోధ్య వీధులన్నీ మారుమోగిపోయాయి. అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట అంగరంగ వైభవంగా, అద్భుతంగా పూర్తి చేసుకుంది. అయితే రామునికి సమర్పించిన పాదుకలకు ఓ విశిష్టత ఉంది. ఇంతకు అదేంటంటే..?

HYDలోనే తయారైన బాలరాముడి పాదుకలు! వీరి జన్మ ధన్యం!

ఆ సేతు హిమాచలం గర్వపడేలా అయోధ్యలోని రామాలయ ప్రాణ ప్రతిష్ట పూర్తి చేసుకుంది. బాల రాముడి దివ్య మంగళ రూపం ప్రజలకు దర్శనమిచ్చింది. జీవ కళ ఉట్టిపడేలా ఉన్న విగ్రహ మూర్తిని చూసి ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. జనవరి 22న మధ్యాహ్నం 12.29 నిమిషాలకు అభిజిత్ లగ్నంలో బాలరాముడి ప్రతిష్టాపన జరిగింది. 84 సెకన్ల పాటు ఈ మొత్తం కార్యక్రమం చోటుచేసుకుంది. ప్రధాని మోడీ చేతుల మీదుగా ఈ వేడుక ఘనంగా జరిగింది. కాగా, ఆయన శ్రీరామునికి పట్టు పీతాంబరాలతో పాటు ఛత్రం, పాదుకలు అందించారు. కాగా, ఆ పాదుకలు తయారు చేసింది ఎవరో తెలుసా..  మన తెలంగాణ వాసి.

హైదరాబాద్ నరానికి చెందిన ఓ ఫౌండేషన్ ఆ పాదుకలను తయారు చేసి అందించింది. అయోధ్య భాగ్య నగర సీతారామ ఫౌండేషన్ బంగారు తాపడం పాదుకలను తయారు చేసి.. అయోధ్యకు పంపించింది. వీటి విలువ దాదాపు రూ. 1.03 కోట్ల పై మాటే. సికింద్రాబాద్ ఓల్డ్ బోయినపల్లిలో హస్మత్ పేటలోని శ్రీ మద్విరాట్ కళా కుటీర్‌లో రూపొందించారు. లోహ శిల్పి పిట్టంపల్లి రామలింగా చారి ఈ పాదుకలను పాతిక (25) రోజుల పాటు శ్రమించి రూపొందించారు. సుమారు 13 కేజీల బరువుతో చేసిన వెండిపై బంగారు పూతతో వీటిని తయారు చేశారు. పాదుకలను తయారు చేసే అదృష్టం తమ సంస్థకు దక్కడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఆ ఫౌండేషన్ డైరెక్టర్ చల్లా శ్రీనివాస్ శాస్త్రి. తమ జన్మ ధన్యమైందని చెబుతున్నారు తయారు చేసిన అనంతరం వాటిని అయోధ్యకు అప్పగించామన్నారు.

Balaramaiah's paadukalu are from HYD!

కాగా, తెలంగాణకు అరుదైన అవకాశం దక్కింది. అయోధ్య రామ మందిర నిధి సేకరణలో రెండవ స్థానంలో నిలిచింది. అంతే కాకుండా రామ మందిరం కోసం వినియోగించిన 118 దర్వాజాలు కూడా హైదరాబాద్‌లో నే తయారు చేశారు. అలాగే హైదరాబాద్ నుండి 1265 కిలోల భారీ లడ్డూ కూడా తరలి వెళ్లింది. మొత్తానికి ఓ చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వామ్యం అయ్యింది తెలంగాణ. ఎట్టకేలకు శ్రీరాముడు మళ్లీ అయోధ్యకు ప్రతిష్టాపన రూపంలో చేరుకున్నాడు. మంగళవారం నుండి జనవరి 23 నుండి సామాన్యులు కూడా సందర్శించే అవకాశం రానుంది. ఇప్పటికే లక్షలాది మంది తమ టీవీ స్క్రీన్లపై రాముడిని చూసి పులకరించిపోతున్నారు. మరీ ఈ అరుదైన గౌరవం దక్కడం పట్ల మీ అభిప్రాయాన్ని  కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి