iDreamPost
android-app
ios-app

బస్సు డ్రైవర్ కూతురికి లండన్‌లో ఉద్యోగం..

బస్సు డ్రైవర్ కూతురికి లండన్‌లో ఉద్యోగం..

మనిషి జీవితంలో కష్టాలు అనేవి ఉంటాయి. ఎంతోమంది అత్యంత దారుణమైన పరిస్థితులు, కష్టాల మధ్యనే జీవిస్తుంటారు. కొందరు అలాంటి పరిస్థితును కూడా ధైర్యంగా ఎదుర్కొని నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు. తన జీవితం ఎలా మొదలైంది కాదు.. ఎలా ముగించాలి అనే అంశంపై స్పష్టమమైన అవగాహన ఉన్న ఓ బస్ డ్రైవర్ కుమార్తె.. చరిత్రలో నిలిచిపోయేలా విజయం సాధించింది. పేద కుటుంబంలో జన్మించిన ఆ యువతి.. లండన్ లో లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని కొట్టేసి.. అందరికీ ఆదర్శంగా నిలిచింది. మరి.. ఆ యువతి సక్సెస్ స్టోరి గురించి ఇప్పుడు తెలుసుకుందాం…

చత్తీస్ గడ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా అందరికి గుర్తుండిపోయే ప్రాంతం. కారణం.. ఈ ప్రాంతంలో తరచూ  పోలీసులకు, నక్సల్స్ మధ్య కాల్పుల మోతలు వినిపిస్తుంటాయి. అంతేకాక నక్సల్ ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాలో సుక్మా ఒకటి. అలాంటి ప్రాంతంలోని  దోర్నపాల్ గ్రామంలో రితేష్ ఫిలిప్, షోలీ ఫిలిప్  అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి రియా  అనే కుమార్తె ఉంది. రితేష్ ఓ ప్రైవేటు స్కూల్ బస్సు డ్రైవర్ గా పని చేస్తూ.. రిటైర్డ్ అయ్యారు. ఆయన భార్య కూడా అదే స్కూల్ లో టీచర్ గా పని చేస్తుంది.

ఇక రియా ఫిలిప్ బాల్యం అంతా కాల్పుల శబ్దాలు వింటూ భయం భయంగా గడిచింది. ఎప్పుడూ పోలీసుల కర్ఫూలు, తుపాకీల మోతలు, ఆర్తనాదలతో ఆ ప్రాంతం అట్టుడుకిపోతుండే.  అయినప్పటికీ బతుకు సాఫీగా సాగాలంటే చదువు ఒక్కటే మార్గమని రియా భావించింది.  ఎన్ని అవరోధాలు ఎదురైన వెరువక చదువుపై దృష్టి పెట్టింది. ఇక రియా తల్లిదండ్రులు ఎన్ని కష్టాలు వచ్చినా పిల్లల ఉన్నత చదువులు చదివించాలని నిశ్చయించుకున్నారు. అలాగే రియా కూడా వారి ఆశలను వమ్ము చేయకుండా బాగా చదివింది.

అంతేకాక ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో నర్సుగా ఉద్యోగం సంపాదించింది. అక్కడ రెండేళ్ల పాటు విధులు నిర్వహించింది. అయితే రియాలో ఇంకా ఎదో సాధించాలనే కోరిక బలంగా ఉంది. తాను ఫారెన్ లో జాబ్ సంపాదించాలని ఆమె బలంగా అనుకుంది. ఈ క్రమంలో రియా ఎంతో కష్టపడి తన కలను నిరవేర్చుకుంది.  లండన్ లో మంచి ఉద్యోగం ఆమెకు ఆఫర్ వచ్చింది. అయితే రియా లండన్ వెళ్లేందుకు.. ఆమె తల్లిదండ్రులు ఇంటిని తాకట్టు పెట్టారు.  అలానే రియాను లండన్ పంపేందుకు రూ.3 లక్షలు సమకూర్చారు.

అన్ని కష్టాలను అధికమించి.. లండన్ లో ఏకంగా 21లక్షల వార్షిక వేతనంతో మంచి ఉద్యోగాన్ని సంపాదించింది.  అంతేకాక.. రియా తల్లిదండ్రులు తమ కుమార్తె నెలకు లక్షకు పైగా జీతం సంపాదిస్తుందని గర్వంగా చెప్పుకుంటున్నారు. రియా సక్సెస్ ను చూసిన ఆమె బంధువులు, కుటుంబ సభ్యులకు గర్వాన్ని కలిగించడమే కాక.. ఆ జిల్లాలో విద్యా వ్యవస్థ మెరుగు పడేందుకు దోహద చేసింది.  కుటుంబ సపోర్టు ఉంటే ఏదైనా సాధించవచ్చని, తన విజయానికి తల్లిదండ్రులే కారణమని రియా తెలిపింది. మరి.. రియా ఫిలీప్ సక్సెస్ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియేజేయండి.

ఇదీ చదవండి70 ఏళ్ల వృద్ధుడితో 23 ఏళ్ల యువతి లవ్వాట! క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి