iDreamPost
android-app
ios-app

Cheteshwar Pujara: వృద్ధ బ్యాటర్ అన్నారు.. రన్ మెషిన్ గా మారాడు..రంజీల్లో దడదడలాడిస్తున్న పుజారా!

  • Published Feb 17, 2024 | 3:36 PM Updated Updated Feb 17, 2024 | 3:36 PM

ప్రస్తుతం జరుగుతున్నరంజీ ట్రోఫీ 2024 సీజన్ లో తాజాగా మరో సెంచరీని సాధించాడు టీమిండియా నయావాల్ చతేశ్వర్ పుజారా. దీంతో ఏ క్షణంలోనైనా భారత జట్టులోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు.

ప్రస్తుతం జరుగుతున్నరంజీ ట్రోఫీ 2024 సీజన్ లో తాజాగా మరో సెంచరీని సాధించాడు టీమిండియా నయావాల్ చతేశ్వర్ పుజారా. దీంతో ఏ క్షణంలోనైనా భారత జట్టులోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు.

Cheteshwar Pujara: వృద్ధ బ్యాటర్ అన్నారు.. రన్ మెషిన్ గా మారాడు..రంజీల్లో దడదడలాడిస్తున్న పుజారా!

చతేశ్వర్ పుజారా.. టీమిండియా సీనియర్ బ్యాటర్ గా, నయావాల్ గా కీర్తించబడుతున్నాడు. తనదైన బ్యాటింగ్ తో టీమ్ కష్టాల్లో ఉన్నప్పుడు బయటపడేస్తూ ఉంటాడు ఈ సీనియర్ బ్యాటర్. అయితే టెస్ట్ బ్యాటర్ గా ముద్రపడటంతో.. మిగతా ఫార్మాట్స్ కు దూరమైయ్యాడు ఈ సొగసరి ప్లేయర్. సౌతాఫ్రికాతో పాటుగా ఇంగ్లాండ్ సిరీస్ కు సెలెక్ట్ చేయకపోవడంతో.. మరింత కసితో చెలరేగిపోతున్నాడు పుజారా. ప్రస్తుతం జరుగుతున్నరంజీ ట్రోఫీ 2024 సీజన్ లో తాజాగా మరో సెంచరీని సాధించాడు. దీంతో తన పరుగుల ప్రవాహాన్ని కొనసాగిస్తున్నాడు.

సౌతాఫ్రికాతో జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ను టీమిండియా డ్రా చేసుకుంది. కానీ ఆ బ్యాటర్ ఉంటే కచ్చితంగా గెలిచేది. మరి ఆ ప్లేయర్ ఎవరు? అంటే.. దానికి సమాధానం చతేశ్వర్ పుజారా అని వస్తుంది. ఇక ఇంగ్లాండ్ తో జరిగిన రెండో టెస్ట్ లో ఓటమి చెందడంతో.. ఓ ప్లేయర్ పేరు బాగా వినిపించింది. ఆ వినిపించిన పేరే పుజారా. అచ్చమైన టెస్ట్ బ్యాటర్ గా ముద్రపడిన పుజారాను ఎందుకు టెస్టుల్లోకి తీసుకోవట్లేదు అన్నదే ఇక్కడ ప్రధాన సమస్య. పైగా అతడు అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు.

Pujara is throbbing in Ranji!

ప్రస్తుతం సౌరాష్ట్ర తరఫున రంజీల్లో ఆడుతున్నాడు ఈ సీనియర్ టీమిండియా బ్యాటర్. తనదైన బ్యాటింగ్ తో ప్రత్యర్థి సహనానికి పరీక్ష పెడుతున్నాడు. ఈ రంజీ సీజన్ లో పరుగులవరద పారిస్తున్నాడు ఈ సొగసరి బ్యాటర్. తొలి మ్యాచ్ లోనే భారీ డబుల్ సెంచరీ బాది తానేంటో నిరూపించుకుని, మరోసారి సెలెక్టర్లకు సవాల్ విసిరాడు. తాజాగా మణిపూర్ తో జరుగుతున్న మ్యాచ్ లో కేవలం 102 బాల్స్ లోనే శతకం బాది.. అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇక ఈ సెంచరీతో రంజీ ట్రోఫీ 2024 సీజన్ లో మూడో శతకం బాదిన ప్లేయర్ గా నిలిచాడు.

ఓవరాల్ గా ఈ మ్యాచ్ లో 105 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు, ఓ సిక్స్ తో 108 పరుగులు చేశాడు చతేశ్వర్ పుజారా. వృద్ధ బ్యాటర్ అంటూ ఎగతాళి చేసిన వారే నేడు.. టీమిండియా మరో రన్ మెషిన్ పుజారా అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఈ సూపర్ ఫామ్ తో త్వరలోనే టీమిండియాలోకి నయావాల్ రీ ఎంట్రీ ఖాయం అని చెప్పొచ్చు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మణిపూర్ తొలి ఇన్నింగ్స్ లో 142 పరుగులకే కుప్పకూలగా.. సౌరాష్ట్ర 529/6 పరుగులకు తమ తొలి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. మరి ఈ రంజీ సీజన్ లో పరుగుల వరదపారిస్తున్న పుజారాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: Abdul Samad: టెస్టు క్రికెట్ ను టీ20 చేశాడు.. సన్ రైజర్స్ బ్యాటర్ సంచలన సెంచరీ!