iDreamPost

తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌లో రెండేళ్ల బాలుడి కిడ్నాప్..

తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌లో రెండేళ్ల బాలుడి కిడ్నాప్..

ఇటీవల కాలంలో తరచూ ఏదో ఒక ప్రాంతంలో పిల్లల కిడ్నాప్ ఘటనలు జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం సికింద్రబాద్ ప్రాంతంలో ఓ బాలుడి కిడ్నాప్ ఘటన చోటుచేసుకుంది. వెంటనే స్పందించిన పోలీసులు సీసీ పుటేజీల ఆధారం కనిపెట్టి..మాదాపూర్ ప్రాంతంలో బాలుడిని అమ్ముడుతుండగా పట్టుకున్నారు. ఇలా కొన్ని కిడ్నాప్ కేసులను పోలీసులు చేధిస్తుండగా, మరికొన్ని ఘటనలు ఇప్పటికీ కొలిక్కి రాలేదు. తాజాగా ఏపీలోని తిరుపతిలో రెండేళ్ల బాలుడు కిడ్నాప్ కలకలం రేపింది. తమిళనాడు నుంచి తిరుమలకు వచ్చిన ఓ కుటుంబం రైల్వే స్టేషన్ లో నిద్రించిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని వరసవక్కం ప్రాంతానికి చెందిన రామస్వామి చంద్రశేఖర్ కుటుంబం సోమవారం తిరుపతికి వచ్చింది. సోమవారం ఉదయం తిరుమలకు చేరుకుని.. శ్రీవారి దర్శనం పూర్తి చేసుకున్నారు. శ్రీవారి దర్శనం అనంతరం సోమవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో తిరుపతికి చేరుకున్నారు. అక్కడి నుంచి వారి ఊరికి వెళ్లే బస్సులు ఉదయం 3 గంటలకు ఉందని తెలుసుకున్నారు. తన భార్య.. ఇద్దరు కుమారులతో తిరుపతి బస్టాండులో చెన్నై బస్సుల కోసం ఫ్లాట్ ఫామ్ నంబర్ 3కు వచ్చారు. బస్సులు లేకపోవడంతో అక్కడే నేలపై పడుకున్నారు. రామస్వామి చంద్రశేఖర్ కుటుంబ సభ్యులు నిద్రలోకి జారుకున్నారు.

మధ్యలో మెలకువ వచ్చి చూస్తే.. వారి  రెండేళ్ల అనిల్ మురుగన్ అనే కుమారుడు కనిపించలేదు. కంగారుపడి బస్టాండ్ మొత్తం తిరుగుతూ.. కనిపించిన వాళ్లను అడిగిన ప్రయోజనం లేకపోయింది. చివరకు పోలీసులకు సమాచారం అందించడంతో వారు రంగంలోకి దిగారు. తిరుపతి బస్టాండ్ కు చేరుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. అర్థరాత్రి 2 గంటలకు బాలుడు కిడ్నాప్ గురైనట్లు పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా బాలుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. తిరుపతి బస్టాండ్ లో కిడ్నాప్ అయిన బాలుడిని సురక్షితంగా పోలీసుల చెంతకు చేరాడు. కిడ్నాపర్ చెర నుంచి చిన్నారిని స్థానిక మహిళ ఒకరు కాపాడినట్లు తెలుస్తోంది. ఏర్పేడులో బాలుడిని క్షేమంగా పోలీసులకు అప్పగించినట్లు తెలుస్తోంది.. మరి.. కిడ్నాప్ ల నివారణకు మీ సలహాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి