iDreamPost

ఒత్తిడి దెబ్బకు ప్లాన్ మార్చిన ప్రైమ్

ఒత్తిడి  దెబ్బకు ప్లాన్ మార్చిన ప్రైమ్

లాక్ డౌన్ పుణ్యమాని జనం ఇళ్లలోనే కాలక్షేపం చేస్తున్నారు. టీవీలో ఎంతసేపని సీరియల్స్ చూస్తారు. మూవీ ఛానల్స్ లో అన్ని కొత్త సినిమాలు రావడం లేదు. అందులోనూ అతడు అని మన్మధుడు అని వేసినవే వేసి వేసి వాయిస్తున్నారు. ఈ నేపధ్యంలో డిజిటల్ స్ట్రీమింగ్ యాప్స్ కి అమాంతం డిమాండ్ పెరిగిపోయింది. లేటెస్ట్ వెబ్ సిరీస్ లతో పాటు వివిధ బాషల సరికొత్త సినిమాలు అందుబాటులో ఉండటంతో అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లకు సబ్స్క్రైబర్స్ సంఖ్య అంతకంతా పెరుగుతూ పోతోంది. ఈ నేపధ్యంలో వీటి సర్వర్స్ మీద ఒత్తిడి పెరుగుతోంది.

ముఖ్యంగా సెల్యులర్ నెట్ వర్క్ ద్వారా నెట్ వాడే వాళ్ళ వల్ల ఇది మరింత ఎక్కువగా ఉంది. ఇలాంటి యాప్స్ లో స్ట్రీమింగ్ సాధారణంగా 4కె క్లారిటీ దాకా వస్తుంది. కాని డేటా ఎక్కువ తీసుకుంటుంది. మంచి క్వాలిటీ కోసం వినియోగదారులు దీనినే ఆప్షన్ గా ఎంచుకుంటారు. కాని దేశవ్యాప్తంగా వినియోగం విపరీతంగా పెరిగిపోవడంతో ఆపరేటర్లు HD (హై డెఫినిషన్) నుంచి SD (స్టాండర్డ్ డెఫినిషన్) కు తగ్గించమని సదరు సంస్థలు అభ్యర్థించడంతో ఆ మేరకు ప్రైమ్ నిర్ణయం తీసుకుంది.

సెల్యులార్ ద్వారా తమ వీడియోలు చూసేవాళ్ళకు కొంత కాలం SD క్వాలిటీ మాత్రమే అందుబాటులో ఉంటుందని సహకరించమని కోరుతూ ప్రకటన విడుదల చేసింది. అయితే కంటెంట్ లభ్యత విషయంలో ఎలాంటి పరిమితులు ఉండవని ఎప్పటిలాగే ఎంజాయ్ చేయొచ్చని కోరింది. ఇది కొంత ఇబ్బంది కలిగించే అంశమైనా ట్రాఫిక్ దృష్ట్యా తప్పనిసరి మరి. ఒకవైపు ప్రేక్షకులు చాలా వేగంగా వీటికి ఎడిక్ట్ అయిపోతున్నారు. దీని ప్రభావం ఏ స్థాయిలో ఉంటుంది థియేటర్లు తెరిచాక క్లారిటీ వస్తుంది. ఇప్పటికైతే ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ అన్నారు కాని అంతకు మించి పొడిగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి