iDreamPost

ఏమైందీ ఆంధ్రజ్యోతికి .. తీరు మారింది !!!.

ఏమైందీ ఆంధ్రజ్యోతికి .. తీరు  మారింది !!!.

బాబు కోసం బాబు చేత అన్నట్లు పత్రిక పుట్టిన తర్వాత ఏ రోజూ కూడా బాబుకి , టీడీపీకి అనుకూలమైనవి తప్ప ఇతర పక్షాల గురించి సానుకూలంగా రాయని ఆంధ్రజ్యోతి పత్రిక , జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి నిప్పులేనిదే పొగరాదు అనే సామెతను నిజం చేయటానికి నిప్పును రాజేసే ప్రయత్నం చేసిన ABN ఛానెల్ కు ఎదో జరిగింది అనుకోవచ్చు , ఈ రోజు వచ్చిన ఓ న్యూస్ క్లిప్ , ఓ వీడియో చూస్తే .

1 . ఓ అగ్రహీరో రాజధాని అమరావతిలో తన బినామీల పేరు మీద ఐదు వందల ఎకరాలు కొన్నాడు . ఇంకా పలువురు పారిశ్రామిక వేత్తలు , సినీ హీరోలు కోట్లు వెచ్చించి బినామీల పేర్లతో భూములు కొన్నారు ……

ఈ న్యూస్ చూసిన వారెవరైనా ఇది ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైంది అంటే నమ్మకపోవచ్చు . అమరావతి విషయంలో ఇంసైడర్ ట్రేడింగ్ జరగలేదన్న టీడీపీని సమర్థిస్తూ రైతు పోరాటాలు అని లేని హడావుడి ఈ రోజు ఉదయం వరకూ చేసిన ఆంధ్రజ్యోతి మధ్యాహ్నానికి ఇంసైడర్ ట్రేడింగ్ జరిగింది అన్న వాదనలకు బలం చేకూర్చే ఈ వార్తని ప్రచురించడం విడ్డూరమే .

2 . జగన్ ప్రభుత్వం పై ఉద్దేశ్యపూర్వకంగానే ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి .

తిరుమలను క్రైస్తవ కేంద్రంగా మారుస్తున్నారు అంటూ సీఎం జగన్ పై చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు .
ఈ స్టేట్మెంట్ ఇచ్చింది మరెవరో కాదు . కరుడు గట్టిన హిందూత్వవాది అధికార బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి …..

ఏ అంశాన్నైనా లోతుగా పరిశీలించి నిజానిజాలు విచారించుకొని స్పష్టంగా మాట్లాడే సుబ్రమణ్యస్వామి ఈ స్టేట్మెంట్ ఇవ్వడంలో ఆశ్చర్యం లేదు కానీ జగన్ కి , వైసీపీ కి అనుకూలమైన ఏ వార్తనైనా నిర్ద్వంద్వంగా పక్కన పడేసే ABN ఛానెల్ ప్రసారం చేయడమే ఈ దుష్ప్రచారానికి మూలమైన టీడీపీకి , బాబు గారికి మింగుడుపడని పచ్చి వెలక్కాయ అని చెప్పొచ్చు .

అధికారంలోకి వచ్చిన నాటి నుండి కులమత అంశాల పై టీడీపీ , జనసేన చేస్తున్న దుష్ప్రచారాలతో చికాకులు ఎదుర్కొంటున్న వైసీపీకి ఈ అంశం ఉపశమనం అనటంలో సందేహం లేదు . ఏ పత్రిక అయితే ఈ దుష్ప్రచారాలకు వేదికగా నిలిచిందో . ఏ పత్రిక అయితే అనునిత్యం బురద చల్లి కడుక్కొంటుంటే ఇన్నాళ్లు వేడుకగా చూసిందో అదే పత్రికలో కరుడుగట్టిన హిందూవాది ఇచ్చిన సెర్టిఫికెట్ లాంటి స్టేట్మెంట్ ని ప్రసారం చేయడం చూస్తుంటే ఏమైందీ ఆంధ్రజ్యోతికి అని అనుమానం రావటంతో తప్పులేదు .

ఇన్నాళ్లు టీడీపీతో రాసుకుపూసుకు తిరిగి పత్రికా ధర్మాన్ని తుంగలో తొక్కి పార్టీ అంతర్గత వ్యవహారాల్లో నడిపిన మంత్రాగం తాలూకూ దుష్ఫలితాలు ఎదురొస్తాయనా ?? లేదా ఇంసైడర్ ట్రేడింగ్లో తన పాత్ర బయటికొస్తే భవిష్యత్ ఏమిటని భయామా ?

మరే పత్రికా , ఛానెల్ పొందని విధంగా ప్రతి జిల్లాలో కొంత భూమి , రాజధానిలో కూడా భారీగానే పొందిన భూములు రద్దు అవుతాయని ఆందోళనా ? .లేక నిన్నటి వరకూ వైసీపీ హయాంలో టీటీడీలో అన్యమత ప్రచారం జరుగుతోందని , ఆచారాలు మంట గలుస్తున్నాయని చేసిన దుష్ప్రచారాల పై వ్యక్తులు కాకుండా టీటీడీ లాంటి ఉన్నత ధార్మిక సంస్థ 100 కోట్లకి పరువు నష్టం దావా వేయనుందని వార్తలొచ్చిన నేపధ్యంలో దుమ్ముకి పుట్టిన దడా ?? .

ఏదేమైనా ABN లో వచ్చిన ఈ మార్పు కొంత కాలం అయినా నిలిచి ఉంటుందా . లేదా రేపు ఉదయాన్నే మరో విషప్రచారంతో మేల్కొలుపుతాడా అనేది తెలియాలి అంటే రేపు ఉదయం దాకా వేచి చూడాల్సిందే .

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి