iDreamPost

అప్పుడు బ్రీఫ్డ్ మీ.. ఇప్పుడు స్టీల్ ఇన్ టన్! బాబుని ఇరికించిన కోడ్ లాంగ్వేజ్!

అప్పుడు బ్రీఫ్డ్ మీ.. ఇప్పుడు స్టీల్ ఇన్ టన్! బాబుని ఇరికించిన కోడ్ లాంగ్వేజ్!

ఏపీలో రాబోయే ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు వాడీ వేడిగా కొనసాగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో మరోసారి గెలుపు పగ్గాలు చేపట్టేందుకు అధికార పార్టీ గట్టి ప్రయత్నం ఉంది. మరోవైపు ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీని గద్దె దింపేందుకు ఎన్నో రకాల ప్రయాత్నాలు మొదలు పెట్టింది. ఇదే సమయంలో టీడీపీ నేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడికి ఆదాయ పన్ను శాఖ వరుస షాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. చంద్రబాబు తన పాలన సమయంలో కొన్ని కంపెనీల నుంచి రూ.118 కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఇదే విషయంపై ఐటీ శాఖ ఆయనకు నోటీసులు పంపించడంతో ఏపీలో రాజకీయంగా తీవ్ర చర్చ జరుగుతోంది. ఇదే అంశం ఆ పార్టీని ఇరుకున పెట్టిందనే చర్చ నడుస్తుంది. అయితే ముడుపులు తీసుకునే సమయంలో చంద్రబాబు కోడ్ లాంగ్వేజ్ వాడినట్లు వార్తలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..

చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో తాత్కాలిక రాజధాని నిర్మాణం పనులను అప్పగించిన ప్రతి కాంట్రాక్ట్ సంస్థల నుంచి రూ.118 కోట్ల రూపాయల వరకు ముడుపులు అందుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఐటీ శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్న సమయంలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముడుపులు అందుకునే సమయంలో చంద్రబాబు కోడ్ భాష వాడినట్లు తెలుస్తుంది. దాదాపు ఎనిమిది వందల కోట్ల విలువైన కాంట్రాక్ట్ పనులు అప్పగించిన షాపూర్జీ పల్లోంజీ, లార్సన్ అండ్ టూబ్రో సంస్థల నుంచి పెద్ద ఎత్తున ముడుపుల రూపంలో తన పీఏ పెండ్యాల శ్రీనివాస్ ద్వారా రూ.118 కోట్ల రూపాయలు తీసుకున్నారని, ఈ వ్యవహారంలో ఎవరూ కనిపెట్టలేని విధంగా కోడ్ లాంగ్వేజ్ ని వినియోగించినట్లు వార్తలు వస్తున్నాయి.

ఆయా కంపెనీల నుంచి ముడుపుల రూపంలో డబ్బును ఏఏ ప్రాంతాలకు ఎలా బదిలీ చేయాలో అన్న విషయం ఎక్కడా లీక్ కాకుండా చాలా పకడ్బందీగా కోడ్ భాష ఉపయోగించినట్లు ఐటీ శాఖ వారు చెబుతున్నారు. హైదరాబాద్ కు డబ్బును తరలించడానికి ‘HYD’ అని, విజయవాడలో డబ్బు చేర్చడానికి ‘విజయ్’ అని, విశాఖపట్నంలో తన అనుయూలకు పంపించడానికి ‘విష్’అనే పదాలు వాడినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక బెంగుళూరు లో డబ్బును తరలించేందుకు ‘బాంగ్’ అనే కోడ్ భాషన్ వాడినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే ఎక్కడ కూడా క్యాష్ అనే పదం వాడకుండా దానికి బదులుగా స్టీల్ అనే పదం వాడినట్లు చెబుతున్నారు. స్టీల్ అంటే డబ్బు.. దీన్ని టన్నుల్లో అని పేర్కొంటున్నారు.

ఇక టన్ను అంటే కోటి అనే అర్థం వచ్చేలా వారి మధ్య కోడ్ భాషను సెట్ చేసుకున్నారని.. టన్నుల్లో కోట్లను కొట్టేశారని చంద్రబాబు పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారం కన్సల్టెంట్ గా ఉన్న మనోజ్ వాసుదేవ్ పార్థసానికి చంద్రబాబు పీఎకు మధ్య నడిచిన చాట్ సంభాషణలు, డబ్బు చెల్లింపుల వ్యవహారం ఇతర డాక్యుమెంట్స్ ఆధారాలు ఐటీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం అందుతుంది. ఆయా కంపెనీల నుంచి ముడుపులు అందుకున్నారని ఆదాయ పన్నుశాఖ అధికారులు గుర్తించి చంద్రబాబు నాయుడికి నోటీసులు ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. చీటికి మాటికి వైసీపీ పై విమర్శలు చేసే చంద్రబాబు ఇప్పుడు తనపై వచ్చిన ఆరోపణలు సమర్ధించుకునే పని చేస్తున్నారని వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఏది ఏమైనా వచ్చే ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు వ్యవహారం పెద్ద సమస్యగా మారే అవకాశం ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి