iDreamPost

బాబు అజ్ఞాన‌మే మండ‌లిని ముంచేసింది

బాబు అజ్ఞాన‌మే మండ‌లిని ముంచేసింది

ఒక సంఘ‌ట‌న, అనేక సంఘ‌ట‌న‌ల‌కి దారి తీస్తుంది. చంద్ర‌బాబు తెలివి త‌క్కువత‌నం ఈ రోజు శాస‌న‌మండ‌లిని, అమ‌రావ‌తిని ముంచేసింది. మ‌న‌కి ఇల్లు లేదు, కానీ ఒక ఇంటిలో ఉండి, కొత్త ఇల్లు క‌ట్టుకోమ‌ని చెప్పారు. కొత్త‌గా ఏర్పాట‌య్యే ఇంటిని స‌ర్దుకున్న త‌ర్వాతే, పాత ఇంటిని వ‌దిలేస్తారు. ఇది లాజిక్‌.

చంద్ర‌బాబు ఆద‌రాబాద‌రా హైద‌రాబాద్ ఖాళీ చేశాడు. కొంచెం ఆలోచ‌న ఉన్న‌వాళ్లు రాష్ట్రంలో అతి పెద్ద న‌గ‌రం వైజాగ్‌ని ఎంచుకుంటారు. ఎందుకంటే కొత్త‌గా న‌గ‌రాన్ని క‌ట్టే ప‌నిలేదు. ప్ర‌భుత్వ భ‌వ‌నాలు కూడా చాలా ఉన్నాయి. ఈ డిజిట‌ల్ యుగంలో ప‌రిపాల‌న కోసం మ‌హాభ‌వ‌నాలు అక్క‌ర్లేదు. స‌రైన సౌక‌ర్యాలుంటే చాలు.

Read Also: మండ‌లికి మంగ‌ళం.. 13 ఏళ్లకే ముగిసిన ప్రయాణం

అయితే అమరావ‌తి అనే రియ‌ల్ ఎస్టేట్ గేమ్ ప్రారంభించాడు. ప్ర‌భుత్వ భూములు, బీడు భూములు ఎంచుకున్నాడా అంటే అదీ లేదు. పంట పండే భూముల‌తో వ్యాపారం, రైతుల్ని లాగాడు. అప్ప‌టికే కొనాల్సిన వాళ్లు కొనేశారు. ఇవ్వ‌డానికి ఇష్టం లేని రైతుల్ని బెదిరించారు. ఐదేళ్లు ప్లాన్లు గీయ‌డంలో గ‌డిపేశాడు. జ‌గ‌న్ వచ్చాక ఆ ప‌థ‌కం బెడిసి కొట్టింది.

వికేంద్రీక‌ర‌ణను వ్య‌తిరేకించే వాళ్లంతా , ఐదేళ్లు చేసిందేమిటి? జ‌నం విరాళాలు ఏమ‌య్యాయి….ఇవి అడ‌గ‌డం లేదు. లాట‌రీ టికెట్ కొన్న‌వాడికి బ‌హుమ‌తి త‌గ‌ల‌క‌పోతే లాట‌రీ నిర్వాహ‌కుడి మీద కేసు వేస్తాన‌ని బెదిరించిన‌ట్టు ఉంది ఈ త‌తంగం.

Read Also: మేమూ స్వతంత్ర సమరయోధులమే..

అమ‌రావ‌తి త‌న సంప‌ద‌ను తానే సృష్టించుకుంటుంద‌ని, ప్ర‌భుత్వం ఖ‌ర్చు పెట్ట‌క్క‌ర్లేద‌ని చంద్ర‌బాబు అంటున్నాడు. దొంగ‌నోట్ల ముద్ర‌ణాశాల‌ను అమ‌రావ‌తిలో ర‌హ‌స్యంగా పెడితే త‌ప్ప ఇది సాధ్యం కాదు.

Read Also: పార్టీల్లో ఉన్న స్వతంత్ర సమరయోధులకు ఫించన్ ఇవ్వాల్సిందే…

రైతుల ఉద్య‌మం రాష్ట్ర‌మంతా వ్యాపిస్తుంద‌ని బాబు భ్ర‌మ‌ప‌డ్డాడు. అయితే సామాన్యుడికి రాజ‌ధాని ఎక్క‌డున్నా ఒక‌టే. అందుకే ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. మండ‌లికి బిల్లు వ‌చ్చిన‌ప్పుడు దాన్ని అడ్డుకోవ‌డం వ‌ల్ల రాజ‌కీయ ప్ర‌యోజ‌నం ల‌భిస్తుంద‌ని, ప్ర‌జ‌ల్లో గుడ్‌విల్ పెరుగుతుంద‌ని అనుకున్నాడు. దీనివ‌ల్ల బిల్లు ఆల‌స్య‌మ‌వుతుందే త‌ప్ప , వీగి పోద‌ని బాబుకి తెలుసు.

ఇప్పుడు జ‌గ‌న్ ఏకంగా ర‌ద్దుకు తీర్మానించాడు. బాల్ ఢిల్లీ కోర్టులో ఉంది. చంద్ర‌బాబుని మాత్రం అంద‌రూ క‌లిసి పుట్‌బాల్ ఆడుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి