iDreamPost

జైల్లో మొదటి రోజు చంద్రబాబు చేసిన అల్పాహారం ఇదే!

జైల్లో మొదటి రోజు చంద్రబాబు చేసిన అల్పాహారం ఇదే!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ  జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్టు అంశం రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. శనివారం ఉదయం నంద్యాలో ఆయను అరెస్ట్ చేసింది మొదలు.. ఆదివారం రాత్రి 7 గంటలకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించే వరకు అందరిలో ఒకటే ఉత్కంఠ. చంద్రబాబు.. ఆయన రాజకీయ జీవితంలో ఇలాంటి ఘటన ఎప్పుడు ఎదుర్కొలేదు. ఇక ఆదివారం విజయవాడలోని ఏసీబీ కోర్టు చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ ను విధించింది. దీంతో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు.ఇక తొలి రోజు ఆయన కాలకృత్యాలకు సంబంధించిన వార్తలు బయటకు వచ్చాయి.

రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకి ఖైదీ నెంబర్ 7691 ఇచ్చారు. అలానే జైలులోని స్నేహ బ్లాక్ లో ప్రత్యేక గదిని ఆయన కోసం ఏర్పాటు చేశారు. అలానే ఆయన అవసరాల నిమిత్తం ఒక వ్యక్తిగత సహాయకుడిని ఉంచారు. ఇక ఆయన ఎస్పీజీ భద్రత కలిగిన వ్యక్తి కావడంతో..మాములు ఖైదీలకు దూరంగా ఉంచారు.  అలానే మాములు ఖైదీలకు అయితే రెండు రకాల టిఫిన్లు ఉంటాయి. అయితే వారికి అందించే అల్పాహారాన్ని చంద్రబాబుకు సిబ్బంది అందించలేదు. కోర్టు ఆదేశాల మేరకు ఆయన వ్యక్తిగత సిబ్బంది తీసుకొచ్చిన ఆహారం మాత్రం అందిస్తున్నారు.

రిమాండ్ కు తరలించిన తరువాత తొలి రోజు అయిన సోమవారం ఆయనకు సిబ్బంది.. ఇంటి టిఫిన్ ను అందించారు. జైలులో ఉన్న చంద్రబాబుకు సిబ్బంది అల్పాహారం అందించారు. జైలుకు ఎదురుగా ఉన్న జైలు ఆస్పత్రిలో చంద్రబాబుకు వైద్య పరీక్షలు పూర్తి చేశారు. అనంతరం ఆయన ఉండే ప్రత్యేక గదికి తీసుకొచ్చి.. ఇంటి నుంచి తెచ్చిన బ్రేక్ ఫాస్ట్ ను అందించారు. ఇంటి నుంచి తీసుకొచ్చిన ఫ్రూట్ సలాడ్ ను అల్పాహారం చంద్రబాబు తీసుకున్నారు. అలానే వేడి నీళ్లు, బ్లాక్ కాఫీ అందించారు. అనంతరం ఆయనకు అవసరమైన మెడిసిన్స్ కూడా అందించారు. ఉదయం నిద్ర లేచిన తరువాత చంద్రబాబు యోగా చేసినట్లు సిబ్బంది తెలియజేశారు. మరి.. రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుకు అందితున్న సదుపాయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి