iDreamPost

కోడిగుడ్డుపై ఈకలు పీకడం అంటే ఇదే..!

కోడిగుడ్డుపై ఈకలు పీకడం అంటే ఇదే..!

ఆంధ్రప్రదేశ్‌లో సీఎం వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వ పరిపాలన ప్రతిపక్ష పార్టీకి విమర్శలు, ఆరోపణలు చేసేందుకు ఎలాంటి అవకాశం లేకుండా సాగుతోంది. పరిపాలన, సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి విమర్శలు చేసేందుకు అవకాశం లేకుండా పోతుండడంతో ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడుకి ఏమి చేయాలో పాలుపోవడంతో లేదు. అందుకే రంధ్రాన్వేషణ చేసి కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్న చందంగా వ్యవహరిస్తున్నారు.

రాష్ట్రంలో కరెంట్‌ బిల్లులు పెంచారంటూ టీడీపీ గగ్గొలు పెడుతోంది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ నేతల ఒక్క పూట నిరాహార దీక్ష చేపట్టారు. హైదరాబాద్‌ నుంచి జూమ్‌ యాప్‌ ద్వారా నిన్న చంద్రబాబు తమ పార్టీ నేతలకు దీక్షలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కరోనా వైరస్‌ భయం, లాక్‌డౌన్‌ వల్ల ఏప్రిల్‌ నెలలో కరెంట్‌ బిల్లు రీడింగ్‌ తీయలేదు. మే నెలలో రెండు నెలల బిల్లులు తీయడంతో బిల్లు ఎక్కువగా వచ్చిందన్న అభిప్రాయాలు పలు చోట్ల వ్యక్తమయ్యాయి. ఈ విషయంలో అటు పంపిణీ సంస్థలు, ఇటు ప్రభుత్వం వినియోగదారులు సందేహాలను, సమస్యలను తీర్చేందుకు స్పష్టమైన చర్యలు చేపట్టాయి.

అయితే కరెంట్‌ బిల్లులు పెంచారంటూ టీడీపీ విమర్శలు చేస్తూ సీఎం జగన్‌ ప్రవేశపెట్టే సంక్షేమ పథకాల నుంచి ప్రజలను డైవర్ట్‌ చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. మంగళవారం సీఎం వైఎస్‌ జగన్‌ రాబోవు ఏడాదిలో అమలు చేసే పథకాలు, వాటి తేదీలతో సహా వెల్లడిస్తూ.. సంక్షేమ పథకాల క్యాలెండర్‌ను విడుదల చేశారు. దేశంలో ఇలా చేసిన ప్రభుత్వం మరొకటి లేదని విమర్శకుల సైతం కొనియాడుతున్నారు. సీఎం జగన్‌ ఇలా ప్రకటించారో లేదో.. ఆ అంశం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు కరెంట్‌ బిల్లులు పెంచారంటూ బాబు హడావుడి చేస్తున్నారు. తనకున్న మీడియా బలంతో నిరాహార దీక్షల ద్వారా పబ్బం గడుపుకునేందుకు యత్నిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

చంద్రబాబు చేస్తున్న వాదన ఉత్త డొల్ల అని ఆయనే నిరూపిస్తున్నారు. ఈ రోజు తన ట్విట్టర్, ఫేస్‌బుక్‌ పేజీల్లో.. కరెంట్‌ బిల్లులతో పోస్టు చేశారు. అందులో ఒకే సర్వీస్‌ నంబర్‌పై జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల బిల్లులు ఉన్నాయి. జనవరి 20న తీసిన రీడింగ్‌లో 124 యూనిట్లు, 399 రూపాయల బిల్లు, ఫిబ్రవరి 20న తీసిన రీడింగ్‌లో 95 యూనిట్లు వాడకం.. 318 రూపాయల బిల్లు, మార్చి 20 నుంచి మే 20 వరకూ తీసిన రీడింగ్‌లో 628 యూనిట్లు, 3,041 రూపాయల బిల్లు వచ్చింది. ఈ మూడు బిల్లులను జత చేసి.. అందులో రూపాయలను మాత్రమే హైలెట్‌ చేస్తూ చంద్రబాబు పోస్టు చేశారు కానీ ఏ బిల్లులో ఎంత మేర యూనిట్లు వాడారన్న విషయాన్ని మాత్రం వదిలేసి ఓ సందేశాన్ని ఇచ్చారు.

‘‘లాక్‌డౌన్‌లో ప్రజలు ఇళ్లలోనే ఉన్నారు. పని లేదు, ఆదాయం లేదు. కానీ ఏపీ ప్రభుత్వం అకస్మాత్తుగా కరెంట్‌ బిల్లులను పెంచింది. సామాన్యులు ఎలా చెల్లిస్తారు. మూడు నెలల బిల్లులు రద్దు చేయాలి’’ అంటూ చంద్రబాబు డిమాండ్‌ చేశారు. పనిలేదు, ఆదాయం లేదు కాబట్టి బిల్లులు చెల్లించలేరు.. రద్దు చేయండి అనే డిమాండ్‌ వరకూ బాగానే ఉంది. కానీ కరెంట్‌ బిల్లులు పెంచారని అబాండాలు వేస్తూ పబ్బం గడుపుకోవడమే రాజకీయదిగజారుడుకు నిదర్శనం అనే విమర్శలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి