iDreamPost

వంద చేస్తే ఈ ఒక్కటే హైలెట్‌ చేసారట..!!

వంద చేస్తే ఈ ఒక్కటే హైలెట్‌ చేసారట..!!

ప్రతి సంఘటన వెనుకా ఏదో ఒక కారణం లేకపోదు. అందులోనూ ఘనత వహించిన చంద్రబాబు నాయుడు, ఆయన బృందం గతంలో చేసిన ఇప్పుడు చేస్తున్న ఘన కార్యాలను తిరగబెడితే తప్పకుండానే ఏదో ఒక సంఘటన చోటు చేసుకోక మానదు. అందులోనూ నేరుగా చంద్రబాబుపైనే విమర్శలకు దిగుతున్న రాష్ట్ర మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిపై ప్రత్యర్ధి వర్గం అటెన్షన్‌ కొంచెం ఎక్కువగానే ఉంటుందనడంలో సందేహం లేదు. అందులో భాగంగానే ఆ నియోజకవర్గంలో పేకాటశిబిరంపై పోలీస్‌లు దాడిచేయడాన్ని హైలెట్‌ చేసారు. దానికి మంత్రికి లింక్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్టులతో రెచ్చిపోయి సంతృప్తి పడ్డారు. ప్రజల అటెన్షన్‌ను డైవర్ట్‌ చేయడంలోనూ, జరుగుతున్న మంచి పనులను తక్కువ చేసి చూపడంలో టీడీపీ అనుంగు మీడియా అందెవేసిన చెయ్యిగా ఇప్పటికే నిరూపించుకుంది. తన నైపుణ్యాన్ని కొనసాగించే క్రమంలోనే నేరుగా రాష్ట్ర మంత్రితోనే జరిగిన ఘటనకు లింక్‌పెట్టేస్తుండడంతో జనం విస్తుపోతున్నారు.

అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే గత వారం రోజులుగా వివిధ ప్రాంతాల్లో వంద క్లబ్బులపై ఎస్‌ఈబీ దాడులు చేస్తే, ఒక్క గుడివాడలో జరిగిన దాడిని మాత్రమే హైలెట్‌ చేస్తున్నారట. ఈ విషయాన్ని స్వయంగా కృష్ణాజిల్లా ఎస్పీ రవీంద్రే ప్రకటించారు. దీనిని బట్టే ప్రత్యర్ధులు కొడాలి నాని పట్ల ఎంతగా కాచుక్కూర్చున్నారో అర్ధం చేసుకోవచ్చు. సూటిగా మంత్రి కొడాలి చేసే వ్యాఖ్యలకు సమాధానం చెప్పే పరిస్థితి లేకపోవడంతో, ఇటువంటి కుహనా ప్రచారానికి సిద్ధపడుతున్నారని వైఎస్సార్‌సీపీ నాయకుల నుంచి తిరుగు విమర్శలు కూడా ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

స్పెషల్‌ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో సంక్షిప్తంగా ఎస్‌ఈబీ. రాష్ట్రంలో సీయంగా వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించాక మెరుగైన శాంతిభద్రతల స్థాపనలో భాగంగా ఎస్‌ఈబీని ఏర్పాటు చేసారు. ఇందులో డేరింగ్‌ ఆఫీసర్స్‌నే నియమించారు. చట్టవ్యతిరేకంగా జరిగే ఈ కార్యకలాపాన్నైనా ఈ ఎస్‌ఈబీ సిబ్బంది అడ్డుకునేందుకు వెసులుబాటు కల్పించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా జూదం, అక్రమ సారా, గంజాయి, అక్రమ ఇసుక రవాణా తదితర వాటిని సమర్ధవంతంగానే ఈ బ్యూరో అడ్డుకుంటోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి