iDreamPost

వెన్నుపోటుదారులు బాబు, నాదెండ్లను పవన్ పక్కనే పెట్టుకున్నారు: కొడాలి నాని

kodali Nani, Pawan: వైఎస్సార్ సీపీ కీలక నేతల్లో మాజీ మంత్రి కొడాలి నాని ఒకరు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ అభిమానులకు, జనసేన కార్యకర్తలకు ఓ విజ్ఞప్తి చేశారు. ఇదే సమయంలో చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

kodali Nani, Pawan: వైఎస్సార్ సీపీ కీలక నేతల్లో మాజీ మంత్రి కొడాలి నాని ఒకరు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ అభిమానులకు, జనసేన కార్యకర్తలకు ఓ విజ్ఞప్తి చేశారు. ఇదే సమయంలో చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

వెన్నుపోటుదారులు బాబు, నాదెండ్లను పవన్ పక్కనే పెట్టుకున్నారు: కొడాలి నాని

రానున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార వైఎస్సార్ సీపీ ఒంటరిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అలానే టీడీపీ,జనసేన పొత్తులో భాగంగా కలిసి పోటీ చేయనున్నాయి. ఈక్రమంలో జనసేన కేవలం 24 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తుంది. ఈ నేపథ్యంలో జనసేన కార్యకర్తలు, నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.  ఈ క్రమంలో పవన్ కల్యాణ్ పై వైసీపీ నేతలు పలు వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.. పవన్ కల్యాణ్ కు పలు సూచనలు చేశారు. అభిమానులు అప్రమత్తంగా లేకపోతే పవన్ కల్యాణ్‌ మూల్యం చెల్లించుకుంటాడని నాని అన్నారు.

సోమవారం వైఎస్సార్ సీపీ కీలక నేత, మాజీ మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పవన్ కల్యాణ్, జనసేనల గురించి ప్రస్తావించారు. పవన్ కల్యాణ్ ను రక్షించుకోవాల్సిన అవసరం జనసైనికులకు, అభిమానులకు ఉందని తెలిపారు. చంద్రబాబుకు ఓట్లు కావాలి, కానీ సీట్లు ఇవ్వరని నాని అన్నారు. తాము రాష్ట్రంలోని ఏ నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా టార్గెట్‌గా పెట్టుకోలేదని, 175 స్థానాల్లో గెలవడమే తమ లక్ష్యమని నాని చెప్పుకొచ్చారు. భీమవరంలో, పిఠాపురంలో పవన్ ఓడించడానికి జగన్ ప్రయత్నిస్తున్నాడని ఎల్లో మీడియా ప్రచారం చేస్తోందని,  తాము పవన్ కల్యాణ్ ని ఎలా ఓడిస్తామన్నారు. గత ఎన్నికలను పరిశీలించినట్లు అయితే భీమవరంలో టీడీపీ 54 వేల ఓట్లు వచ్చాయి. పవన్ కల్యాణ్ గారికి 60 వేల ఓట్లు వచ్చాయని, 70 వేల ఓట్లు వైఎస్సార్ సీపీకి వచ్చాయి. వాళ్లద్దరి ఓట్లు కలిస్తే మేము ఎలా ఓడిస్తామన్నారు. కచ్చితంగా చెబుతున్నా పవన్ కల్యాణ్‌ను ఓడించేది టీడీపీనేనని, ఎన్నికల అనంతరం ఈ విషయం స్పష్టంగా తెలుస్తుందని నాని పేర్కొన్నారు.

వెన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడర్లు అయిన చంద్రబాబు, నాదెండ్ల మనోహర్ ను పవన్ కల్యాణ్‌ పక్కన పెట్టుకుని తిరుగుతున్నాడని, అధికారంలో ఉన్న ఎన్టీఆర్ గారినే కూల్చిపడేసిన వ్యక్తులు చంద్రబాబు,నాదెండ్ల అని గుర్తు చేశారు. అలాంటి వారికి పవన్ కల్యాణ్ ఎంత? అని జనసైనికులకు గుర్తుచేశారు. 3 శాతం ఓటింగ్ ఉన్న తన సామాజిక వర్గానికి చంద్రబాబు 30 సీట్లు ఇచ్చి.. 20 శాతం ఉన్న వర్గానికి 24 సీట్లిచ్చాడని నాని తెలిపారు. ఇచ్చిన 24 సీట్లలో పది కచ్చితంగా ఓడిపోయే సీట్లు ఉన్నాయని నాని స్పష్టం చేశారు. 24 సీట్లు ఇవ్వడానికి చంద్రబాబుకి.. తీసుకోవడానికి పవన్‌కు సిగ్గుండాలని మండిపడ్డారు. రాజ్యాధికారం కోసం ఎదురుచూస్తున్న పవన్ సామాజిక వర్గం ఓట్లు కూటమికి బదిలీ అవ్వవని కొడాలి నాని అన్నారు. చిల్లర రాజకీయ నాయకుడైన చంద్రబాబు చేస్తేనే సంసారమని కొడాలి నాని  అన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి