iDreamPost

నాణ్యతే పరమావధి..

నాణ్యతే పరమావధి..

ఏదైనా ఓ పథకం కింద ప్రభుత్వం వంద రూపాయలు ప్రజలకు ఇస్తే.. వివిధ చేతులు మారి ప్రజలకు చేరే సరికి ఈ మొత్తం పది రూపాయలే ఉంటుందని దేశంలో ప్రభుత్వాల పనితీరుపై ఓ నానుడి ఉంది. రాజకీయ, అధికార అవినీతికి ఈ మాటలు అద్దం పట్టేవి. ఈ పరిస్థితి మారడం సాధ్యం కాదనుకున్నారు. కానీ దృఢ సంకల్పంతో సాధ్యం కానిదంటూ లేదని నిరూపించారు ఆంధ్రప్రదేశ్‌ యువ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి. ప్రభుత్వ పథకాలను నేరుగా ప్రజలకే అందించేలా సరికొత్త విధానాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. అర్హులకు నేరుగా నగదు వారి ఖాతాలోనే జమ చేస్తున్నారు. వస్తు రూపంలో అమలు చేసే పథకాలలో లోటు పాట్లు ఉంటే సరిదిద్దుకుంటూ సిసలైన ప్రభుత్వానికి అసలైన నిర్వచనం చెబుతున్నారు. ప్రజల డబ్బును ప్రజలకే సరైన రీతిలో వెచ్చిస్తూ ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ రాజ్యం తెచ్చారు.

తాజాగా జగనన్న విద్యా కానుక పథకం విషయంలో వైసీపీ సర్కార్‌ తీసుకున్న నిర్ణయం సీఎం వైఎస్‌ జగన్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించే విద్యార్థులందరికీ యూనిఫాం, బూట్లు, సాక్స్‌లు, పుస్తకాలు, నోట్‌ పుస్తకాలు, బెల్ట్, టై, బ్యాగ్‌ తదితర వస్తువులను జగన్‌ప్రభుత్వం గత నెల 5వ తేదీన అందించింది. జగనన్న విద్యా కానుక పేరుతో కిట్‌గా దీనిని అందించారు. కొన్ని చోట్ల బూట్లు సైజులు సరిగా లేవని, బెల్ట్‌ నాణ్యత లేదనే విమర్శలు వచ్చాయి. ఉచితంగా ఇచ్చినవే కదా.. అనుకోకుండా.. ప్రభుత్వం వెంటనే తగు చర్యలు చేపట్టింది. బూట్లు సైజులు సరిపోకపోయినా,. బ్యాగు నాణ్యత లేకపోయినా.. మరే ఇతర వస్తువు నాణ్యత లేకపోయినా మార్చుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. ఆయా పాఠశాలలోనే వస్తువులను మార్చుకోవచ్చని పేర్కొంది.

ప్రస్తుతం పాఠశాలల్లో జగనన్న విద్యా కానుక వారోత్సవాలు జరుగుతున్నాయి. సోమవారం ప్రారంభమైన ఈ వారోత్సవాలు శనివారం వరకూ కొనసాగనున్నాయి. ఈ సమయంలో విద్యార్థులకు తమకు ఇచ్చిన జగనన్న విద్యా కానుక కిట్‌లో ఏ వస్తువు నాణ్యత సరిగా లేకపోయినా నిరభ్యంతరంగా మార్చుకోవచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి