iDreamPost

మామ‌య్య అన్న పిలుపు…

మామ‌య్య అన్న పిలుపు…

మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు. కమ్మగా పాడనా కంటి పాప జోల. కానుకే ఇవ్వనా చెల్లికి ఉయ్యాల. ఇది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, సినీ హీరో బాల‌కృష్ణ న‌టించిన ఓ సినిమాలో బాగా ప్రాచుర్యం పొందిన పాట‌. కానీ తాజాగా గురువారం ఏపీ అంత‌టా మావ‌య్య అన్న పిలుపు మార్మోగింది. ల‌క్ష‌లాది మంది విద్యార్థులు మావ‌య్య అంటూ సంభోధించిన ఏకైక వ్య‌క్తి సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి. జగనన్న విద్యా కానుక అందుకున్న విద్యార్థులంద‌రూ ఆనందంతో మావ‌య్య అంటూ జ‌గ‌న్ ను కీర్తిస్తూ ప‌ర‌వ‌శం పొందారు.

పిల్ల‌ల ఆనందం.. త‌ల్లిదండ్రుల భావోద్వేగం..

సీఎం జ‌గ‌న్ పాల్గొన్న కార్య‌క్ర‌మంలోనే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా ప‌లు పాఠ‌శాల‌లో జ‌రిగిన జగనన్న విద్యా కానుక కార్య‌క్ర‌మాల్లో ఉద్విగ్ర భ‌రిత స‌న్నివేశాలు చోటుచేసుకున్నాయి. ఆ కానుక అందుకున్న పిల్ల‌లు అందులో ఉన్న బూట్లు, బ్యాగులు, ఇత‌ర వ‌స్తువులు చూసి ఆనందంతో ఉబ్బిత‌బ్బిబ్బ‌య్యారు. త‌మ పిల్ల‌ల ఆనందం చూసి త‌ల్లిదండ్రులు భావోద్వేగానికి గుర‌య్యారు. ప్రైవేటు పాఠ‌శాల‌ల్లో చ‌దువుకునే విద్యార్థుల్లా.. త‌మ పిల్ల‌లు కూడా ఇక‌పై మంచి బ్యాగు, బూట్లు, యూనిఫాం తో స్కూలుకు వెళ్తార‌నే ఆలోచ‌న‌లు వారిని భావోద్వేగానికి గురి చేశాయి. తాము అందించ‌లేని వ‌స్తువుల‌ను జ‌గ‌న్ అందించారంటూ ఆయ‌న‌కు కృత‌జ్ఞ‌త‌లు చెప్పుకున్నారు.

ఇంతకంటే గొప్ప మామయ్య మనకు దొరుకుతాడా..

‘మనలాంటి పేదలకేం కావాలో, ఏమిస్తే ఏమిస్తే మనం సంతోషంగా ఉంటామో, ఆయనకు తెలుసు. ఇంతకంటే గొప్ప మామయ్య మనకు దొరుకుతాడా.. అందుకే జగన్‌ మామయ్య అంటే నాకు ఎంతో ఇష్టం’ అంటూ మండల పరిషత్‌ ప్రాధమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతునన్న షేక్‌ తస్లీం తెలిపింది. జగనన్న విద్యా కానుక అందుకున్న ప‌లువురు చిన్నారులు, వారి తలిదండ్రులు ఆనందం వ్య‌క్తం చేశారు. విద్యార్థిని షేక్ తస్లీం మాట్లాడుతూ.. ‘మన జగన్‌ మామయ్య ముఖ్యమంత్రి అయ్యాక, విద్యకు సంబంధించి చాలా పథకాలు ప్రవేశపెట్టారు. వాటిలో భాగంగా అమ్మఒడి, జగనన్న గోరుముద్ద, నాడు–నేడు. ఈ రోజు జగనన్న విద్యా కానుక. నాకొక కోరిక ఉంది. అది ఏంటంటే, నేను బాగా చదువుకుని కలెక్టర్‌ అయి మీరు పెట్టిన ఈ పథకాలన్నీ పేద ప్రజలకు అందేలా చూడాలని. అప్పటి దాకా మీరు సీఎంగా ఉండాలి, ఉండి తీరాలి’ అని కోరింది.

మా నాన్న చెప్పారు…

‘కాన్వెంటు పిల్లలను చూసి వాళ్లలాగా బూటూ, సూటూ వేసుకుని వెల్లాలని ఉంటుంది. ఆ కోరిక నాకు ఈ ‘జగనన్న విద్యా కానుక’ ద్వారా తీరబోతుంది. మా నాన్న చెప్పారు, జగనన్న విద్యా కానుక ద్వారా అందించిన వస్తువులను కొనాలంటే 3500 రూపాయలు అవుతాయని చెప్పారు. ఇప్పుడు మాకు ఆ బాధలేదు. అంతేకాదు నాడు–నేడు కార్యక్రమంలో పాఠశాలకు రూపురేఖలు మార్చేశారు. మధ్యాహ్న భోజనంలో మంచి పౌష్టిహారం అందించారు. దాంతో పిల్లలందరూ ఆరోగ్యంగా ఉన్నారు. మనకేం కావాలో, ఏమిస్తే మనలాంటి పేదలు గొప్పవాళ్లమవుతామో ఆయనకు తెలుసు. ఈ వనరులను ఉపయోగించుకుని కలెక్టర్‌ అవుతాను’ అని మ‌రో చిన్నారి తస్లీం పేర్కొంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి