iDreamPost

విద్యార్థుల‌కు మరో గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్ర‌భుత్వం!

విద్యార్థుల‌కు మరో గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్ర‌భుత్వం!

ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు మరో గుడ్ న్యూస్ ను అందించింది. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల్లో 1 తరగతి నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇక తరగతుల వారీగా ఇంగ్లీష్ మీడియంను పెంచుకుంటూ పోతుందని ప్రభుత్వం గతంలో వివరించిన విషయం తెలిసిందే. సీఎం జగన్ తీసుకున్న ఈ ప్రతిష్ఠాత్మకమైన నిర్ణయంతో పలువురు మేధావులు, విద్యావేత్తలు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే జగన్ ప్రభుత్వం విద్యార్థులకు మరో గుడ్ న్యూస్ ను అందించింది. అదేంటంటే?

తాజాగా ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ స్కూల్లో చదువుకునే విద్యార్థులకు మరో శుభవార్తను అందించింది. సర్కార్ బడుల్లో ఐబీ(ఇంటర్నేషనల్ బాకలారియేట్) సిలబస్ ప్ర‌వేశ‌పెట్టేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఇక ఇందులో భాగంగానే విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్, సెల్ఫ్ లెర్నింగ్, క్రిటికల్ థింకింగ్ వంటివి నేర్పించనున్నారని తెలుస్తుంది. దీని కారణంగా విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించేందుకు దోహదపడుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకుని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: ఏపీలో సొంతిల్లు లేదు.. బోడి ప్రచారాలు చేస్తున్నారు: మంత్రి రోజా

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి