iDreamPost

Pushpa : బన్నీ బృందానికి సవాళ్లు ఛాలెంజులు

Pushpa : బన్నీ బృందానికి సవాళ్లు ఛాలెంజులు

ఇవాళ్టితో కలుపుకుని పుష్ప పార్ట్ 1 గ్రాండ్ రిలీజ్ కు కేవలం 5 రోజుల టైం మాత్రమే ఉంది. ఈ రోజు హైదరాబాద్ యూసఫ్ గూడ గ్రౌండ్స్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయబోతున్నారు. అతిథులు ఎవరనే విషయం బయటికి రాలేదు. స్టేజి మీద చాలా సర్ప్రైజులు ఉంటాయని మాత్రం అంటున్నారు. అవేంటో తెలియాలంటే సాయంత్రం దాకా ఎదురు చూడాల్సిందే. చివరి నిమిషం దాకా ఫైనల్ కాపీని దర్శకుడు సుకుమార్ చెక్కుతూనే ఉన్నారనే టాక్ ఆల్రెడీ బయటికి వచ్చింది. 2 గంటల 59 నిమిషాల ఫైనల్ వెర్షన్ ని సెన్సార్ చేయించి లాక్ చేశాక కూడా ఇంకా ఏం జరుగుతుందనే అనుమానం రాకమానదు కాని సుక్కు స్టైల్ ముందు నుంచి అంతే.

ట్రేడ్ నుంచి అందుతున్న అనధికార సమాచారం మేరకు తెలుగు రాష్ట్రాల పుష్ప థియేట్రికల్ బిజినెస్ 100 కోట్ల పై మాటేనట. అంటే గ్రాస్ సుమారుగా నూటా యాభై కోట్లకు పైగానే రావాలి. బ్లాక్ బస్టర్ టాక్ వస్తే అసాధ్యం కాదు. తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు వెసులుబాటు ఉండటంతో సింగల్ స్క్రీన్లలో సైతం గరిష్ట ధరని 200 రూపాయలకు ఫిక్స్ చేశారు. మల్టీ ప్లెక్సుల్లో ఇంకో 50 అదనం. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఆ అవకాశం లేనట్టే. ఒకవేళ అఖండ రేంజ్ లో రెస్పాన్స్ వస్తే ఈ ఫిగర్ ని రాబట్టుకోవడం కష్టం కాదు. అల వైకుంఠపురములో ఆ ఫీట్ ని సాధించి చూపించింది కూడా. కానీ అప్పటికి ఇప్పటికి పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి.

మరోవైపు ఒక రోజు ముందు వస్తున్న స్పైడర్ మ్యాన్ నో వే హోమ్, వారం గ్యాప్ తో రాబోతున్న శ్యాం సింగ రాయ్ – 83 సినిమాలు కూడా పుష్పని ఇబ్బంది పెట్టే అవకాశాలు లేకపోలేదు. అలా జరగకూడదు అంటే పుష్ప థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ కంటెంట్ అనే మాట పబ్లిక్ నుంచి బయటికి రావాలి. మూడు గంటల నెరేషన్ లో సుకుమార్ బన్నీని ఎలా చూపించబోతున్నాడనేది ఆసక్తికరంగా మారింది. ఒకపక్క మెల్లగా ఒమిక్రాన్ భయాలు మొదలయ్యాయి. అవసరమైతే రాత్రి పూట కర్ఫ్యూలు విధించమని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం లేఖలు రాసింది. ఇన్నేసి సవాళ్లు పుష్ప చుట్టూ ఉన్నాయి. వాటిని ఎర్రచందనం దొంగ ఎలా గెలుస్తాడో చూడాలి మరి

Also Read : Akhanda : బాక్సాఫీస్ వద్ద బాలయ్య నాన్ స్టాప్ ప్రభంజనం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి