iDreamPost

కేంద్రం కీలక నిర్ణయం.. 70 లక్షల మొబైల్ కనెక్షన్లు రద్దు!

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్‌లో జరుగుతున్న సైబర్ మోసాల్ని అరికట్టేందుకు అనేక చర్యలు తీసుకుంటుంది. ఆర్థిక మోసాల్ని అరికట్టేందుకు ప్రభుత్వం 70 లక్షల మొబైల్ కనెక్షన్లను రద్దు చేసింది.

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్‌లో జరుగుతున్న సైబర్ మోసాల్ని అరికట్టేందుకు అనేక చర్యలు తీసుకుంటుంది. ఆర్థిక మోసాల్ని అరికట్టేందుకు ప్రభుత్వం 70 లక్షల మొబైల్ కనెక్షన్లను రద్దు చేసింది.

కేంద్రం కీలక నిర్ణయం.. 70 లక్షల మొబైల్ కనెక్షన్లు రద్దు!

ఈ మధ్యకాలంలో సైబర్ మోసాలు బాగా పెరిగిపోయాయి. వివిధ నెంబర్ల నుంచి కాల్ చేస్తూ.. సామాన్యులను బురిడీ కొట్టిస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది ప్రజలు..ఫేక్ కాల్స్ బారిన పడి.. భారీగా నష్టపోయారు. అయితే ఇలాంటి మోసాలను అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. అయినప్పటికే ఇంకా ఇలాంటి సైబర్ మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఆర్థిక మోసాలను వీలైనంత తొందరగా కట్టడి చేసేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. ఏకంగా 70 లక్షల మొబైల్ కనెక్షన్లను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

ఆర్థిక మోసాలను అరికట్టడంలో భాగంగా  కేంద్రం అనేక చర్యలు తీసుకుంటుంది. ఇలాంటి మోసాలను వీలైనంత త్వరగా నిర్మూలించేందు కేంద్ర ప్రభుత్వం పలు రకాల చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే డిసెంబర్ 1 నుంచి సిమ్ కార్డులకు సంబంధించిన కొత్త నిబంధనలు తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మరో కీలక ప్రకటన చేసింది కేంద్ర ప్రభుత్వం. 70 లక్షల ఫోన్ నంబర్లను రద్దు చేసినట్లు ఆర్థిక సేవల విభాగం సెక్రటరీ వివేక్ జోషి చెప్పారు. ఆయా నంబర్ల నుంచి అనుమానిత కార్యకలాపాలు జరుగుతున్నందునే తాజా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.

ఆర్థిక  భద్రత, పెరుగుతున్న డిజిటల్ చెల్లింపుల మోసాలపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బ్యాంకులు తమ వ్యవస్థల్ని బలోపేతం చేసుకోవాలని ఆయన సూచించారు. ఇలాంటి మీటింగ్స్ మరిన్ని నిర్వహించుకుంటూ, మోసాలకు అడ్డుకుట్టే వేయాల్సిన అవసరం ఉందన్నారు. తదుపరి సమావేశం జనవరిలో ఉంటుందని జోషి తెలిపారు.

ఆధార్ కార్డు ఆధారంగా జరిగే చెల్లింపు వ్యవస్థ ద్వారా జరుగుతున్న మోసాలపై రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలని, అంతేకాక నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని , డేటా ప్రొటెక్షన్ అనేది ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. సైబర్ మోసాలను అరికట్టేందుకు వివిధ ఏజెన్సీలు సమన్వయంతో ఎలా ముందుకెళ్లాలనే దానిపై డీఎఫ్ఎస్ సెక్రటరీ వివేక్ జోషి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ప్రధానంగా చర్చించారు. సైబర్ మోసాలపై  సమాజాన్ని అవహగాన కల్పించాలని, వినియోగదార్లను మోసపూరిత కార్యకలాపాల నుంచి కాపాడాలని జోషి సూచించారు.

డిజిటల్ చెల్లింపుల మోసాలపై జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ లో నమోదు చేసిన తాజా గణాంకాలను ఆ సంస్థ వివరించింది. సైబర్ మోసాలను అధిగమించేందుకు , ఎదుర్కొవాల్సిన సవాళ్ల, సమస్యలను ప్రస్తావించింది. ఇక ఈ సమావేశంలో ఆర్ధిక వ్యవహారాల విభాగం, రెవెన్యూ శాఖ, టెలికాం డిపార్టమెంట్, ఇతర విభాగలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇటీవలే యూకో బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడాల్లో డిజిటల్ మోసాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ మీటింగ్ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి