మణిపూర్ లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన దేశంలో ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిన విషయమే. రెండు తెగల మధ్య గత కొంతకాలంగా జరుగుతున్న అల్లర్లలో ఎన్నో అమానవీయ సంఘటనలు చోటు చేసుకున్నాయి. కాగా.. మేలో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరిలో ఉరేగించిన సంఘటనకు సంబంధించిన వీడియో తాజాగా బయటకు రావడంతో.. దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ ఘటనకు కేంద్ర ప్రభుత్వంమే బాధ్యత వహించాలని, ఈ అంశంపై ప్రధాని మోదీ పార్లమెంట్ లో సమాధానం చెప్పాలని ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ఈ ఘటనపై సంచలన నిర్ణయం తీసుకుంది.
మణిపూర్ లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన దేశంలో సంచలన రేపింది. ఈ ఘటనపై ఆవేదన వ్యక్తం చేస్తూ.. తెలంగాణ మంత్రి కేటీఆర్ సైతం కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. కేటీఆర్ తో పాటుగా దేశంలోని వివిధ రాష్ట్రాల నాయకులు ప్రధాని మోదీ ఈ ఘటనకు సంబంధించి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దాంతో స్పందించిన మోదీ ఈ ఘటనపై నోరు విప్పారు. ఈ సంఘటనకు బాధ్యులు అయిన వారిని కఠినంగా శిక్షిస్తామని చెప్పుకొచ్చాడు.
ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియోపై విచారణ కేసును కేంద్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగిస్తూ.. నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఘటన మే నెలలో జరగ్గా.. ఇటీవలే వీడియో బయటకి వచ్చింది. ఇక ఈ అమానవీయ సంఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు తెలిపారు. ఇక ఈ అంశంపై పార్లమెంట్ లో ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తున్న క్రమంలో.. కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. మరి మణిపూర్ ఘటన కేసును సీబీఐకి అప్పగించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.