iDreamPost

ఆ స్టార్ ప్లేయర్ ఐపీఎల్ కు గర్ల్ ఫ్రెండ్ ను తీసుకురావొచ్చా? అని అడిగాడు: గంభీర్

ఆ స్టార్ ప్లేయర్ ఐపీఎల్ కు గర్ల్ ఫ్రెండ్ ను తీసుకురావొచ్చా? అని తనను అడిగాడని చెప్పుకొచ్చాడు గౌతమ్ గంభీర్. ఆ ఆటగాడు ఎవరు? తెలుసుకుందాం పదండి.

ఆ స్టార్ ప్లేయర్ ఐపీఎల్ కు గర్ల్ ఫ్రెండ్ ను తీసుకురావొచ్చా? అని తనను అడిగాడని చెప్పుకొచ్చాడు గౌతమ్ గంభీర్. ఆ ఆటగాడు ఎవరు? తెలుసుకుందాం పదండి.

ఆ స్టార్ ప్లేయర్ ఐపీఎల్ కు గర్ల్ ఫ్రెండ్ ను తీసుకురావొచ్చా? అని అడిగాడు: గంభీర్

సాధారణంగా క్రికెటర్లు అంతర్జాతీయ పర్యటనల నేపథ్యంలో వివిధ దేశాలకు వెళ్తూ ఉంటారు. దాంతో ఫ్యామిలీకి దూరంగా ఉండాల్సి వస్తుంది. అయితే కొంత మంది క్రికెటర్లు డేరింగ్ గానే తమ ఫ్యామిలీని, గర్ల్ ఫ్రెండ్స్ ను తమతో తీసుకురావొచ్చా? అంటూ కోచ్ లను టీమ్ మేనేజ్ మెంట్ ను అడుగుతూ ఉంటారు. అచ్చం ఇలాగే తనను కూడా కేకేఆర్ స్టార్ ప్లేయర్.. గర్ల్ ఫ్రెండ్ ను ఐపీఎల్ కు తనతో పాటుగా తీసుకురావొచ్చా? అని అడిగాడని చెప్పుకొచ్చాడు కేకేఆర్ మెంటర్ గౌతమ్ గంభీర్. ఆ క్వశ్చన్ విని గంభీర్ షాక్ కు గురైనట్లు తెలిపాడు. మరి అంత డేర్ గా గంభీర్ నే అనుమతి అడిగిన ఆ ఆటగాడు ఎవరు? చూద్దాం పదండి.

గౌతమ్ గంభీర్.. కోల్ కత్తా నైట్ రైడర్స్ కు ముచ్చటగా మూడో ఐపీఎల్ టైటిల్ ను అందించాడు. మెంటర్ గా కేకేఆర్ కప్ గెలవడంతో గంభీర్ పాత్ర అమోఘం. ఏ ప్లేయర్ ను ఎలా వాడుకోవాలో అతడికి బాగా తెలుసు. అయితే కేకేఆర్ స్టార్ ప్లేయర్ సునీల్ నరైన్ గురించి తాజాగా ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నాడు గంభీర్. నరైన్ ను ఫస్ట్ టైమ్ కలిసినప్పుడు అతడు ఓ కోరిక కోరాడని ఎవ్వరికీ తెలియని నిజాలు వెల్లడించాడు. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సునీల్ నరైన్ గురించి గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ..”2012లో ఐపీఎల్ లోకి నరైన్ ఎంట్రీ ఇచ్చినప్పటి రోజులు నాకు ఇంకా గుర్తున్నాయి. ఇకపోతే.. నాదీ, నరైన్ ది ఒకే తరహా మనస్తత్వం. ఇద్దరం ఒకేలా ఆలోచిస్తాం. ఇక జైపూర్ లో ఇద్దరం కలిసి ప్రాక్టీస్ చేశాం. ఆ తర్వాత అతడిని నేను లంచ్ కు ఆహ్వానించాను. నరైన్ చాలా సిగ్గరి. లంచ్ టైమ్ లో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ ఆ తర్వాత ఒకే ఒక్క ప్రశ్న అడిగాడు. ఐపీఎల్ కు గర్ల్ ఫ్రెండ్ ను తీసుకురావొచ్చా? అని. దాంతో నేను షాక్ కు గురైయ్యాను” అని ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియని విషయాలు చెప్పుకొచ్చాడు గంభీర్.

కాగా.. సునీల్ నరైన్ ను నిఖార్సైన బ్యాటర్ గా తయ్యారు చేసిన ఘనత గంభీర్ కే చెందుతుంది. అతడిని ఓపెనర్ గా దించి.. అద్భుతమైన విజయాలు సాధించాడు. 2012, 2014లో కేకేఆర్ ఐపీఎల్ టైటిళ్లు సాధించడంలో నరైన్ ముఖ్య పాత్ర పోషించాడు. ఇటు బ్యాట్ తో, అటు బంతితో రాణించి.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. గంభీర్ పట్టుపట్టి మరీ నరైన్ ను ఓపెనర్ గా పంపించి.. విజయం సాధించాడు. దాంతో ఇద్దరి మధ్య ఏర్పడిన బాండింగ్ ఇప్పటికీ అలాగే ఉందని గంభీర్ చెప్పుకొచ్చాడు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి