iDreamPost

మండలి రద్దుకు కేబినెట్‌ ఆమోదం

మండలి రద్దుకు కేబినెట్‌ ఆమోదం

ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి రద్దుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఈ రోజు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సమావేశమైన మంత్రివర్గం ఈ మేరకు శాసన మండలిపై చర్చించింది. ఇటీవల జరిగిన పరిణామాలు, రాజ్యాంగ విరుద్ధంగా మండలి చైర్మన్‌ వ్యవహరించిన తీరు, టీడీపీ వైఖరిపై మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మండలి రద్దుకే మెజారీటీ మంత్రులు మొగ్గు చూపారు. ఫలితంగా మండలి రద్దుకు తీర్మానం చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.

Read Also: మండ‌లికి మంగ‌ళం.. 13 ఏళ్లకే ముగిసిన ప్రయాణం

మండలి కొనసాగాలా..? వద్దా..? అనే అంశంపై ఈ రోజు శాసన సభలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. ఈ రోజు ఉదయం 11 గంటలకు సభ మొదలు కాబోతోంది. మండలిపై చర్చించిన అనంతరం రద్దుకు తీర్మానం చేయడం ఇక లాంఛనమే కానుంది. మంత్రివర్గం కూడా రద్దుకే తీర్మానం చేయడంతో శాసన సభ కూడా అదే దారిలో వెళ్లే అవకాశం ఉంది. శాసన సభలో జరిగే తీర్మానం ఆ తర్వాత పార్లమెంట్‌కు వెళ్లనుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి