iDreamPost

ఘోర బస్సు ప్రమాదం.. 12 మంది సజీవదహనం

  • Published Dec 28, 2023 | 8:48 AMUpdated Dec 28, 2023 | 11:45 AM

బుధవారం అర్థరాత్రి ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 12 మంది అక్కడికక్కడే సజీదవహనం అయ్యారు. ఈ దారుణం వివరాలు ఇలా ఉన్నాయి.

బుధవారం అర్థరాత్రి ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 12 మంది అక్కడికక్కడే సజీదవహనం అయ్యారు. ఈ దారుణం వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Dec 28, 2023 | 8:48 AMUpdated Dec 28, 2023 | 11:45 AM
ఘోర బస్సు ప్రమాదం.. 12 మంది సజీవదహనం

వారంతా వేర్వేరు పనుల నిమిత్తం ఇంటి నుంచి బయటకు వెళ్లారు. తాము వెళ్లిన పనులు చూసుకుని.. తిరిగి ఇంటికి బయలుదేరారు. మరి కొన్ని క్షణాల్లో.. గమ్య స్థానాలకు చేరుకుంటామని భావించారు. కానీ వారికి తెలియదు.. రోడ్డు మీద బస్సు ప్రమాదంలో వారి కోసం మృత్యువు కాపు కాచి ఉందని. మరి కాసేపట్లో ఇంటికి చేరుకుని.. తమ కుటుంబాన్ని చూస్తామని అనుకుంటున్న వారు.. ప్రమాదం కారణంగా.. అక్కడికక్కడే సజీవదహనం అయ్యారు. ఈ దారుణ సంఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 12 మంది సజీవదహనం కాగా.. 14 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ప్రమాదం ఎక్కడ చోటు చేసుకుంది అంటే..

మధ్యప్రదేశ్‌ గుణ జిల్లాలో బుధవారం రాత్రి ఈ ఘోర బస్సు ప్రమాదం సంభవింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు.. ట్రక్కును(డంపర్‌) ఢీ కొట్టింది. దాంతో మంటలు చెలరేగాయి. ఇక ఈ ప్రమాదంలో సుమారు 12 మంది అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు. మరో 14 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదం గురించి తెలుసుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని.. సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు అంటున్నారు.

ఈ బస్సు గుణ నుంచి ఆరోన్‌ వెళ్తుండగా రాత్రి 9 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు అతివేగంగా వెళ్లడం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని.. పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇక ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. మరో నలుగురు ప్రమాదం నుంచి బయటపడి.. వాళ్ల ఇళ్లకు వెళ్లిపోయినట్లు తెలిపారు. ఈ ఘటనపై గుణ కలెక్టర్‌ తరుణ్‌ రతి దర్యాప్తునకు ఆదేశించారు.

ఈ బస్సు ప్రమాద ఘటనపై మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులు అన్ని రకాల సహాయక చర్యలు అందించాలని.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అంతేకాక ప్రమాదంలో చనిపోయిన వారికి ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల ఆర్థిక సాయం ప్రకటించారు సీఎం మోహన్ యాదవ్.

మరోవైపు ఈ ఘటనపై కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సైతం స్పందించారు. బస్సు ప్రమాదం తనను తీవ్రంగా బాధించిందన్నారు. ఘటనపై స్థానిక అధికారులతో తాను మాట్లాడినట్లు.. అలాగే మృతుల కుటుంబాలకు తన సంతాపం చెబుతూ ఎక్స్‌లో ఓ సందేశం ఉంచారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి