iDreamPost

పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై BRS ఎమ్మెల్యే క్లారిటీ!

BRS MLA: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి ఊహించని షాక్ తగిలింది. హ్యాట్రిక్ కొడతామనుకున్న వారి ఆశలు గల్లంత్యయాయి. ఈ నేపథ్యంలో ఓ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ లోకి వెళ్తారనే ప్రచారం జరిగింది. తాజాగా ఆ ప్రచారంపై సదరు ఎమ్మెల్యే స్పందించారు.

BRS MLA: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి ఊహించని షాక్ తగిలింది. హ్యాట్రిక్ కొడతామనుకున్న వారి ఆశలు గల్లంత్యయాయి. ఈ నేపథ్యంలో ఓ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ లోకి వెళ్తారనే ప్రచారం జరిగింది. తాజాగా ఆ ప్రచారంపై సదరు ఎమ్మెల్యే స్పందించారు.

పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై BRS ఎమ్మెల్యే క్లారిటీ!

2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగిరింది. తెలంగాణ ఏర్పడిన తొమ్మిదేళ్ల తరువాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇక కాంగ్రెస్ వేవ్ కి బీఆర్ఎస్ ప్రభుత్వంలోని పలువురు మంత్రులు ఓటమి పాలయ్యారు. ఇక తెలంగాణ ఎన్నికల్లో ప్రధాన పార్టీలన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిల్లా ఖమ్మం. ఇక్కడ నుంచి కాంగ్రెస్ మెజార్టీ సీట్లను కైవసం చేసుకుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి బీఆర్ఎస్ పార్టీ గెలిచిన ఏకైక స్థానం భద్రాచలం. ఇక ఫలితాలు వెలువడి కొన్ని గంటల్లోని ఆయన పార్టీ మారుతున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఆ వార్తలపై భద్రాచలం ఎమ్మెల్యే క్లారిటీ ఇచ్చారు.

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ 64 స్థానాలు కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ 39 స్థానాలతో ప్రతిపక్ష హోదాలో ఉంది.  ఈఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి బీఆర్‌ఎస్‌ నెగ్గిన ఏకైక​ నియోజకవర్గం భద్రాచలం. ఇక్కడ ఎమ్మెల్యేగా బీఆర్‌ఎస్‌ నుంచి తెల్లం వెంట్రావు విజయం సాధించారు. అలా ఖమ్మంలో గెలిచిన ఏకైక బీఆర్ఎస్ ఎమ్మెల్యే పార్టీ ఫిరాయించబోతున్నారనే ప్రచారం నడుస్తోంది. పొంగులేటి అనుచరుడిగా తెల్లం వెంకట్రావుకు ముద్రపడి ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పార్టీ మారి స్వామి భక్తి చాటుకునేందుకు అడుగులు వేస్తున్నాడని  ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో కూడా ఓ ఫొటో కూడా వైరల్ అయ్యింది.

ఈ విషయంపై తాజాగా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు నేరుగా స్పందించారు. తాను కాంగ్రెస్‌లో  చేరుతున్నానంటూ సోషల్ మీడియాలో వైరలైన ఫోటోను త పూర్తిగా ఖండిస్తున్నానని తెలిపారు. తనను నమ్మి బీఫామ్ ఇచ్చిన కేసీఆర్‌ గారికి రుణపడి ఉంటానని ఎమ్మెల్యే వెంకట్రావు తెలిపారు. తన ప్రయాణం కేసీఆర్ గారితోనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం వెలువడిన తెలంగాణ అసెంబ్లీ  ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ 64 స్థానాల్లో విజయం సాధించగా.. బీఆర్‌ఎస్‌ పార్టీ 39 స్థానాల్లో గెలుపొందింది.

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ పార్టీ మారి కాంగ్రెస్‌లోకి చేరిపోతున్నాడంటూ వార్తలు వచ్చాయి. అంతేకాక టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, పొంగులేటిలతో ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో  తెగ వైరల్ అవ్వడమే కాకుండా దుమారం లేపింది. ఈ ప్రచారం తారాస్థాయికి చేరడంతో తెల్లం వెంకట్రావు స్వయంగా స్పందిస్తూ ఖండించారు. మరి.. పార్టీ మారే అంశంపై భద్రాచలం ఎమ్మెల్యే ఇచ్చిన వివరణపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి