iDreamPost

BRS నేత మృతి కేసులో కీలక పరిణామం.. నటుడు రఘుబాబు అరెస్ట్‌.. గంటల వ్యవధిలో విడుదల

  • Published Apr 20, 2024 | 8:17 AMUpdated Apr 20, 2024 | 8:17 AM

బీఆర్‌ఎస్‌ నేత యాక్సిడెంట్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నటుడు రఘుబాబుకు చిక్కులు తప్పేలా లేవు. ఇంతకు ఏం జరిగింది అంటే..

బీఆర్‌ఎస్‌ నేత యాక్సిడెంట్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నటుడు రఘుబాబుకు చిక్కులు తప్పేలా లేవు. ఇంతకు ఏం జరిగింది అంటే..

  • Published Apr 20, 2024 | 8:17 AMUpdated Apr 20, 2024 | 8:17 AM
BRS నేత మృతి కేసులో కీలక పరిణామం.. నటుడు రఘుబాబు అరెస్ట్‌.. గంటల వ్యవధిలో విడుదల

కొన్ని రోజుల క్రితం.. సీనియర్‌ నటుడు రఘుబాబు కారు ఢీకొని బీఆర్‌ఎస్‌ నేత ఒకరు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్‌ఎస్‌ నేత మృతికి గాను.. రఘుబాబును అరెస్ట్‌ చేశారు. అయితే కాసేపటికే ఆయన బెయిల్‌ మీద విడుదలయ్యారు. మృతుడు భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. శుక్రవారం నాడు రఘుబాబుని అరెస్ట్‌ చేశారు. ఆ వివరాలు..

బీఆర్‌ఎస్‌ నల్లగొండ పట్టణ ప్రధాన కార్యదర్శి సందినేని జనార్దన్‌రావు యాక్సిడెంట్ కేసులో నల్గొండ రెండో పట్టణ పోలీసులు శుక్రవారం సాయంత్రం సీనియర్‌ నటుడు రఘుబాబుని అదుపులోకి తీసుకున్నారు. అయితే అరెస్ట్‌ అయిన కొన్ని గంటల్లోనే ఆయన బెయిల్‌ మీద బయటకు వచ్చారు. ఇక యాక్సిడెంట్‌ ఎలా జరిగింది అనే విషయానికి వస్తే.. కొన్న నల్లగొండ పట్టణంలోని శ్రీనగర్ కాలనీకి చెందిన సందినేని జనార్థన్ రావు(51) బీఆర్‌ఎస్‌ టౌన్ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కూడా చేస్తారు. ఈ క్రమంలో కొందరితో కలిసి పట్టణ పరిధిలోని రిక్షా పుల్లర్స్ కాలనీ వద్ద దత్త సాయి వెంచర్ ఏర్పాటు చేశారు.

ఈ క్రమంలో జనార్థన్‌ రావు ప్రతిరోజు మధ్యాహ్నం సమయంలో వెంచర్ వద్దకు వెళ్లి అక్కడి పనులు చూసుకుని వస్తుండేవాడు. దానిలో భాగంగానే బుధవారం మధ్యాహ్నం సమయంలో వెంచర్ వద్దకు వెళ్లి అక్కడ పనులు చూసుకుని.. సాయంత్రం తిరిగి ఇంటికి బయలు దేరాడు. అయితే అదే సమయంలో.. హైదరాబాదు నుండి మిర్యాలగూడ వైపు వెళ్తున్న బీఎండబ్ల్యూ కారు జనార్థన్‌ రావు వెళుతున్న బైక్‌ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జనార్థన్‌ రావు.. స్పాట్‌లోనే చనిపోయాడు. ఇక ప్రమాదానికి కారణమైన కారులో.. సీనియర్‌ నటుడు రఘుబాబు ప్రయాణిస్తున్నారు.

యాక్సిడెంట్‌ తర్వాత.. రఘుబాబు.. మరో కారులోకి మారారు. ఆ సమయంలో అక్కడే ఉన్న వారితో రఘుబాబు మాట్లాడి.. అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే జనార్థన్‌ రావు భార్య.. నాగమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. దీనిలో భాగంగానే శుక్రవారం సాయంత్రం రఘుబాబును అరెస్ట్‌ చేశారు. జనార్థన్‌ రావు విషయానికి వస్తే.. ఆయన స్వస్థలం నకిరేకల్ మండలంలోని మంగళపల్లి గ్రామం. ఆయనకి భార్య నాగమణి, కుమార్తె, కుమారుడు సంతానం ఉన్నారు. కాగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సందినేని జనార్థన్‌రావుకు టీఆర్ఎస్ ప్రముఖులు నివాళులర్పించారు. శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మాజీ మంత్రి.. సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం, ఆయన భౌతిక కాయంపై పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి