iDreamPost

Jeevan Reddy Mall Seized:మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి RTC అధికారులు షాక్! షాపింగ్ మాల్ సీజ్!

ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు.. ఎన్నో వివాదాలకు ఆయన కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు. తాజాగా మరోసారి ఆయన వార్తల్లోనిలిచారు.

ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు.. ఎన్నో వివాదాలకు ఆయన కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు. తాజాగా మరోసారి ఆయన వార్తల్లోనిలిచారు.

Jeevan Reddy Mall Seized:మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి RTC అధికారులు షాక్! షాపింగ్ మాల్ సీజ్!

ఇటీవల తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పదేళ్ళ బీఆర్ఎస్ పాలనకు చెక్ పెట్టారు తెలంగాణ ప్రజలు. దీనికి ముఖ్య కారణం కొంతమంది నేతలని విమర్శలు వినిపించాయి. అధికార పార్టీని అడ్డు పెట్టుకొని ఆర్థికంగా పలు అన్యాయాలకు తెగపడ్డారని తీవ్ర ఆరోపణలు రావడం ఓటమికి ముఖ్య కారణం అని సోషల్ మీడియాలో టాక్ వినిపించింది. ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ప్రతిపక్ష నేతలపై తనదైన స్టైల్లో మాటల యుద్దానికి దిగేవారు. ఆయనపై ఎన్నో ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా జీవన్ రెడ్డికి ఆర్టీసీ అధికారులు షాక్ ఇచ్చారు. అసలు ఏం జరిగింది.. ఆర్టీసీ అధికారులు ఏం చేశారు? అన్న విషయం గురించి తెలుసుకుందాం.వివరాల్లోకి వెళితే..

బీఆర్ఎస్ కీలక నేత, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఆర్టీసీ అధికారులు షాక్ ఇచ్చారు. గత కొంత కాలంగా అద్దె చెల్లించే విషయంలో నిర్లక్ష్యం వహించారని జీవన్ రెడ్డి షాపింగ్ మాల్ సీజ్ చేస్తున్నట్లు మైక్ లో అనౌన్స్ మెంట్ చేశారు ఆర్టీసీ అధికారులు. జీవన్ రెడ్డి ఆర్టీసీ స్థలంలో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ విశ్వజిత్ ఇన్ఫాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి నోటీసులు ఇచ్చినప్పటికీ ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు ఆర్టీసీ అధికారులు.ఆర్టీసీ కి సబంధించిన స్థలంలో నిర్మించిన జీవన్ రెడ్డి మాల్ అద్దె బకాయిలను గడువు లోపు చెల్లించాలని హైకోర్టు ఉత్తర్వుల మేరకు సీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ మెంట్ చేశారు.సాయంత్రంలోగా రూ.3.41కోట్ల బకాయీ చెల్లించకుండా కాంప్లెక్స్ సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఇందుకోసం సాయంత్రం వరక డెడ్ లైన్ విధించారు.

గత కొంత కాలంగా విశ్వజిత్ ఇన్ఫాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి నోటీసులు పంపించామని.. అద్దె చెల్లింపు విషయంలో జాప్యం చేయవొద్దని చెప్పినప్పటికీ ఎలాంటి స్పందన ఇవ్వకపోవడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ చర్యలు తీసుకున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ విషయం షాపింగ్ మాల్ లో ఉన్న అద్దె దారులకు ఆర్టీసీ మైక్ అనౌన్స్ మెంట్ గమనించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో ఏ క్షణమైనా జీవన్ రెడ్డి షాపింగ్ కాంప్లెక్స్ ను ఆర్టీసీ అధికారలు సీజ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.ఈ విషయంపై ఆయన ఎలా స్పందింస్తారో అన్న అంశంపై పొలిటికల్ సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి