iDreamPost

ఆర్మీబేస్ పై ఆత్మాహుతి దాడి.. 23 మంది సైనికులు మృతి!

ప్రపంచంలో ఏదో ఒక చోట ఉగ్ర దాడుల ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్నో దేశాలు ఉగ్రవాద మహమ్మారికి అల్లాడిపోతున్నాయి. అలాంటి దాడుల బాధిత దేశాల్లో మన దేశం కూడా ఉంది. తాజాగా ఓ ఆర్మీ బేస్ క్యాంప్ పై దాడి జరిగింది. ఈ ఘటనలో 23 మంది సైనికులు మృతి చెందారు.

ప్రపంచంలో ఏదో ఒక చోట ఉగ్ర దాడుల ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్నో దేశాలు ఉగ్రవాద మహమ్మారికి అల్లాడిపోతున్నాయి. అలాంటి దాడుల బాధిత దేశాల్లో మన దేశం కూడా ఉంది. తాజాగా ఓ ఆర్మీ బేస్ క్యాంప్ పై దాడి జరిగింది. ఈ ఘటనలో 23 మంది సైనికులు మృతి చెందారు.

ఆర్మీబేస్ పై ఆత్మాహుతి దాడి.. 23 మంది సైనికులు మృతి!

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న వాటిల్లో ఉగ్రవాదం ఒకటి. ఇది ఎన్నో దేశాలకు పెను సవాలుగా మారింది. ఇంకా దారుణం ఏమిటంటే..కొన్నిదేశాలు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాయి. చివరకు పాముకు పాలు పోసి.. కాటేయించుకున్నట్లు.. ఆఉగ్రవాదానికి అల్లాడిపోతున్నాయి. తరచూ ప్రపంచంలో ఏదో ఒక మూలన ఉగ్రవాద దాడులు జరుగుతూనే ఉన్నాయి. సామాన్య ప్రజలు, సైనికులు, ప్రభుత్వాధినేతలే లక్ష్యంగా ఆత్మాహుతి, ఇతర దాడులకు పాల్పడుతున్నారు. ఇటీవలే జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడటంతో నలుగురు జవాన్లు అమరులయ్యారు. తాజాగా పాకిస్థాన్ లో ఆర్మీ బేస్ క్యాంపుపై ఆత్మహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 23 మంది సైనికులు మృతి చెందారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

పాకిస్థాన్‌లో సైనికులే లక్ష్యంగా ఉగ్రదాడులు జరుగుతుంటాయి. గతంలో అనేకసార్లు ఇలాంటి ఘటనలు జరిగి ఎందరో సైనికులు మృతి చెందారు. తాజాగా మరోసారి సైనికులే లక్ష్యంగా ఉగ్రదాడి జరిగింది. మంగళవారం తెల్లవారు జామున అఫ్గనిస్థాన్ సరిహద్దుల్లోని పాక్ ఆర్మీ బేస్ క్యాంప్ పై ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఉగ్రదాడిలో 23 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు.

పాకిస్థాన్ లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సుల్లోని డైరే ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలో ఉన్న ఆర్మీ స్థావరంపై ఆత్మాహుతి దాడి జరిగిందని స్థానిక అధికారులు తెలిపారు. ఈ దాడికి బాధ్యతవహిస్తూ పాకిస్థానీ తాలిబన్లు లేఖ విడుదల చేశారు. ఈ ఆత్మాహుతి దాడి జరిగిన సమయానికి సైనికులంతా గాఢనిద్రలో ఉన్నారని అధికారులు పేర్కొన్నారు. సాధారణ దుస్తుల్లో ఉండటం వల్ల వీరంతా సైనికులేనా అనేది ఖచ్చితంగా గుర్తించలేకపోతున్నామని తెలిపారు.

ఇక ఈ ఆత్మాహుతి దాడిలో మరో 27 మందికి తీవ్రంగా గాయాలయ్యాయని, వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించిటన్లు అధికారులు పేర్కొన్నారు. తాత్కాలిక సైనిక బేస్ క్యాంప్ గా వినిగియోగిస్తోన్న ఓ పాఠశాల భవనం వద్ద పేలుడు పదార్థాలతో కూడిన వాహనాన్ని నిలిపి ఉంచినట్లు అధికారులు గుర్తించారు. పేలుడు ధాటికి పాఠశాలలోని మూడు గదులు కుప్పకూలిపోయాయి. దీంతో శిథిలాల కింద సైనికుల మృతదేహాలు చిక్కుకుపోయాయి. వాటిని తీసేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

మంగళవారం తెల్లవారు జామున 2.30 గంటల సమయంలో ఈ దాడికి జరిగింది. పాకిస్థాన్ తాలిబన్లకు చెందిన తెహ్రీక్-ఇ-జిహాద్ పాకిస్థాన్..తామే పాల్పడినట్టు ప్రకటించింది. అయితే ఈ ఘటనపై పాకిస్థాన్ సైన్యం ఇంత వరకూ స్పందించలేదు. పాక్‌లో ఇటీవల ఉగ్రదాడుల ఘటనలు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తాలిబన్లు రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అఫ్గనిస్థాన్ సరిహద్దుల్లో పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. మరి.. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి