iDreamPost

అద్దంలో ముఖం చూస్కోమన్నారు! కట్‌ చేస్తే.. 100 కోట్ల బంగ్లా ఉన్న ఈ హీరోయిన్‌ ఎవరో తెలుసా?

  • Published Apr 18, 2024 | 1:29 PMUpdated Apr 18, 2024 | 1:29 PM

ఇండస్ట్రీలో నీది ఒకే అందమేనా అంటూ హేళన మాటాలు, విమర్శలు, అవమానాలు ఎదుర్కొన్న ఈ హీరోయిన్ ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా.. ఈమెకు ఓ ప్రైవేట్ జెట్ కూడా కలిగి ఉండటం విశేషం. ఇంతకి ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..?

ఇండస్ట్రీలో నీది ఒకే అందమేనా అంటూ హేళన మాటాలు, విమర్శలు, అవమానాలు ఎదుర్కొన్న ఈ హీరోయిన్ ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా.. ఈమెకు ఓ ప్రైవేట్ జెట్ కూడా కలిగి ఉండటం విశేషం. ఇంతకి ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..?

  • Published Apr 18, 2024 | 1:29 PMUpdated Apr 18, 2024 | 1:29 PM
అద్దంలో ముఖం చూస్కోమన్నారు! కట్‌ చేస్తే.. 100 కోట్ల బంగ్లా ఉన్న ఈ హీరోయిన్‌ ఎవరో తెలుసా?

వెండితెర పై ప్రముఖ నటులుగా గుర్తింపు తెచ్చుకొని, స్టార్ స్టేటస్ ను సంపాదించడం అంత ఈజీ అయినా విషయం కాదు. ఎందుకంటే.. దీని వెనుక ఎన్నో అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు, గెలుపు, ఓటమీలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఒకనొక సమయంలో అవకాశాలు కూడా వచ్చినట్టు వచ్చే చేయిజారుతుంటాయి. ఇలా ఎన్నో కష్టాలు పడిన తర్వాతే సక్సేస్ అవుతారు. ముఖ్యంగా కెరీర్ లో ఎవరైనా సక్సేస్ అవ్వాలి అనుకుంటే.. మొదట జీరోగా స్టార్ట్ అవ్వాలిసిందే. ఇప్పటికే సిని పరిశ్రమలో స్టార్స్ గా రాణిస్తున్న ఎందరో మొదట తమ సిని ప్రయాణాన్ని జీరోగానే మొదలుపెట్టి.. నేడు ఇండస్ట్రీని ఓ ఊపు ఊపుతున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ఓ హీరోయిన్ కూడా ఈ కోవకు చెందినదే. ఈమె తన సినీ జీవితంలో మొదట చాలా అవమనాలు ఎదుర్కొంది. ఒకనొక సమయంలో తన అందన్నీ కూడా వెక్కిరించేవారు. చాలా హేళనగా మాట్లాడేవారు. కానీ, ఇప్పుడు ఆమె ఇంటస్ట్రీలో ఓ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అంతేకాకుండా.. ఆమెకు ఓ ప్రైవేట్ జెట్ కూడా ఉండటం విశేషం. ఇంతకి ఆ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

సినీ పరిశ్రమలో అవకాశాలు దొరకడం అనేది అంతా సులభమైన పని కాదు. ఇక్కడ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన స్టార్స్ హీరోయిన్లు కూడా మొదట ఎన్నో అవమానాలు, మరెన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొని సక్సేస్ గా నిలుస్తారు. అలాంటి వారిలో బాలీవుడ్ ప్రముఖ నటి శిల్పాశెట్టి కూడా ఒకరు. ఈమె తన సినీ కెరీర్ ప్రారంభంలో.. చాలామంది నిర్మాతల నుంచి అవమానాలు ఎదుర్కొంది.   ఆమె నటిస్తున్న సినిమాల్లో కనీసం  కారణం చెప్పకుండా తనని తొలగించేవారంట. అలా తన కెరీర్ ప్రారంభ దశలోనే చాలా నిరాశ, నిరుత్సాహానికి గురైంది. కానీ, అక్కడితోనే అగిపోయి తన ప్రయాత్నాలను విరమించుకోలేదు. ఈ క్రమంలోనే.. విమర్శలు వస్తున్న చోటే పడి లేచే కెరటం లా మారిన శిల్పాశెట్టి.. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. అయితే ఇటీవలే శిల్పాశెట్టి తన కెరీర్, వ్యక్తిగత జీవితం గురించి హ్యూమన్స్ ఆప్ బాంబేతో షేర్ చేసుకున్నా విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ సందర్భంగా శిల్పాశెట్టి మాట్లాడుతూ.. ‘నేను మొదటిలో చాలా డార్క్ గా, సన్నగా, పొడవుగా ఉండేదాన్ని. అయితే నా గ్రాడ్యుయేషన్ పుర్తియ్యాక మా నాన్నతో కలిసి పని చేయాలనుకున్నాను. అంతేకాకుండా.. నేనంటూ ఏదైనా కొత్తాగా, గొప్పగా చేయాలని ఉన్నా, నాకు  ఆ అవకాశం ఉందని ఎప్పుడూ అనుకోలేదు. కేవలం ఫన్ కోసమే ఓ ఫ్యాషన్ షోలో పాల్గొన్నప్పుడు నా పరిస్థితులు మారాయి. ఈ క్రమంలోనే.. ఓ ఫొటోగ్రాఫర్ చూసి, నన్ను ఫోటోలు తీయాలని చెప్పారు. దీంతో అలా గ్లామర్‌ ఇండస్ట్రీకి నేను పరిచయమయ్యాను.  అలా వెంటనే నాకు మొదటి ఆఫర్ వచ్చింది. అప్పటి నుంచి నా కెరీర్ వెనుదిరిగి చూడలేదు. ఎందుకంటే.. నా కెరీర్ లో నేను పడతూ లేస్తూ సక్సెస్ లను చూడసాగాను. ఇక నేను ఇండస్ట్రీకి  అడుగు పెట్టినప్పుడు నాకు 17 ఏళ్లు. అప్పుడు నేను ప్రపంచాన్ని చూడలేదు, జీవీతాన్ని సరిగ్గా అర్ధం చేసుకోలేదు. అలాగా నాకు హీందీ రాక చాలా, హీందీ ఎలా మాట్లాడాలో అర్ధం కాక చాలా ఇబ్బంది పడ్డాను. కొన్నిసార్లు కెమెరా ముందు ఉంటానని తలుచుకుని వణికిపోయాను. ఆ క్షణం ఇక్కడితే నా కెరీర్ ముగిసిపోయిందేమో అనే స్థాయికి చేరుకున్నాను. కానీ నేను ఎప్పుడూ వెనుకబడి ఉన్నట్లు అనిపించేది. ఒక క్షణం సెలబ్రేట్ చేసుకుని, మరుసటి క్షణం విస్మరించడం అంత సులభం కాదు. ఎలాంటి కారణం లేకుండా నన్ను తమ సినిమాల నుంచి తప్పించే నిర్మాతలు కూడా ఉన్నారని నాకు గుర్తుంది.

ఇక బిగ్ బ్రదర్‌ షో విన్నర్‌ ఇతర కంటెస్టెంట్ల వివక్షకు గురవ్వడం నాకు గుర్తుంది.  బహిరంగంగా చాలా వేధింపులు, వివక్షకు గురయ్యాను.  ఆ హౌస్‌లో నేను ఒంటరిదాన్నైపోయాను. కానీ నేను పట్టుదలతో కొనసాగాను. ఇంత దూరం వచ్చిన తర్వాత వెనకడుగు వేయాలని అనుకోలేదు. చివరికి నేను గెలిచిన తర్వాత.. చాలా మంది మమ్మల్ని గర్వపడేలా చేశారని ప్రశంసించారు. నేను చూపిన పట్టుదల, పోరాట స్ఫూర్తి విజయాన్ని అందించాయి. నా జీవితం హెచ్చు తగ్గులతో నిండిపోయింది. భయంకరమైన సమయాలు ఉన్నాయి, కానీ కొన్ని గొప్ప విజయాలు కూడా ఉన్నాయి. నేను దానిలోని ప్రతి నిమిషాన్ని ఆస్వాదించాను.  అదే నన్ను గర్వించదగ్గ నటిగా, భార్యగా, తల్లిగా మార్చింది’ అని శిల్పాశెట్టి చెప్పుకొచ్చింది . కాగా, శిల్పా శెట్టి, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను వివాహం చేసుకుంది. వారికి వియాన్, షమీషా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అలాగే ఆమెకు రూ.100 కోట్ల విలువైన సీ ఫేసింగ్‌ బంగ్లా సహా విలాసవంతమైన ఆస్తులు ఉన్నాయి. ఆమెకు ప్రైవేట్ జెట్ కూడా ఉండడం విశేషం. మరి, నటి శిల్పాశెట్టి సినీ జీవితం గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి