iDreamPost
android-app
ios-app

రాజకీయాల్లోకి అభిషేక్ బచ్చన్.. ఆ నియోజక వర్గం నుంచే పోటీ!

రాజకీయాల్లోకి అభిషేక్ బచ్చన్.. ఆ నియోజక వర్గం నుంచే పోటీ!

రాజకీయాల్లోకి సినిమా వాళ్ల ఎంట్రీ అనేది ఎప్పటి నుంచే జరుగుతుంది. సినిమాలు చేస్తూనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. ప్రజలకు సేవ చేస్తున్నారు.  ఆ పరిశ్రమా, ఈ పరిశ్రమ అనే తేడా లేకుండా టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అన్ని ఇండస్ట్రీలకు చెందిన పలువురు సెలబ్రిటీలు పొలిటికల్  ఎంట్రీ ఇచ్చారు. కేవలం ఎంట్రీ ఇవ్వడమే కాకుండా ఘన విజయం సైతం సాధించారు. ఇప్పటికి పలువురు సెలబ్రిటీలు వివిధ పార్టీల తరపున రాజకీయాల్లో పుల్ బిజీగా ఉంటున్నారు. తాజాగా బిగ్ బి అమితాబ్ బచ్చాన్ కుమారుడు అభిషేక్ బచ్చన్ కూడా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

బాలీవుడ్ ప్రముఖ నటుడు అభిషేక్ బచ్చన్ గురించి సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అద్భతమైన నటనతో ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించారు.  అమితాబ్ బచ్చన్ వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రి ఇచ్చాడు. అయితే అతికొద్ది కాలంలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను, ఫ్యాన్ ఫాలోయింగ్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలో నటించి.. అందరిని ఆకట్టుకున్నాడు. ఇక సినిమాల్లో మాదిరిగానే రాజకీయాల్లోకి తండ్రి వారసుడిగా ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తన తండ్రి  అమితాబ్ బచ్చన్ పోటీ చేసిన స్థానం నుంచే అభిషేక్ బచ్చన్ ఎన్నికల బరిలో దిగనున్నట్లు ప్రచారం సాగుతోంది.  అమితాబ్ 1984లో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ కోరిక మేరకు యూపీలోని ప్రయాగ్ రాజ్ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేశారు.

ఆ ఎన్నికలో అమితాబ్ భారీ మెజార్టీతో గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థి హెచ్.ఎన్. బహుగుణపై లక్షకు పైచిలుకు ఓట్ల తేడాతో గెలుపొందారు.  అదే ప్రయాగ్ రాజ్ స్థానం నంచి అభిషేక్ బచ్చన్ పోటీ చేయనున్నారనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఈ వార్తలపై ఎవరూ అధికారికంగా స్పందించలేదు. ప్రస్తుతం సమాజ్ వాదీ పార్టీ తరపున యూపీ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా  అభిషేక్ బచ్చన్ తల్లి జయా బచ్చన్ కొనసాగుతున్నారు.  ఈ నేపథ్యంలోనే అభిషేక్ ను కూడా ప్రయాగ్ రాజ్ లోక్ సభ స్థానం నుంచి వచ్చే ఎన్నికల్లో బరిలో దించాలని సమాజ్ వాదీ పార్టీ ముఖ్యనేతలు భావిస్తున్నట్లు సమాచారం. మరి. అభిషేక్ బచ్చన్ రాజకీయాల్లోకి రానున్నట్లు వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ప్రెగ్నెన్సీతో పోకిరి భామ.. బాయ్ ఫ్రెండ్ ఫోటో షేర్!

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişgrandpashabetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişcasibom