iDreamPost

41 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్ ఎవరంటే..?

  • Published Apr 06, 2024 | 5:44 PMUpdated Apr 06, 2024 | 5:44 PM

ఈ మధ్యకాలంలో చాలామంది సినీ తారలు లేటు వయసులో పెళ్లి, పిల్లలు అంటూ నెట్టింట తెగ హంగామా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రముఖ హీరోయిన్ తాజాగా లేట్ వయసులో తన అభిమానులతో ఓ గుడ్ న్యూస్ ను షేర్ చేసింది.ఇంతకి ఆమె ఎవరంటే..

ఈ మధ్యకాలంలో చాలామంది సినీ తారలు లేటు వయసులో పెళ్లి, పిల్లలు అంటూ నెట్టింట తెగ హంగామా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రముఖ హీరోయిన్ తాజాగా లేట్ వయసులో తన అభిమానులతో ఓ గుడ్ న్యూస్ ను షేర్ చేసింది.ఇంతకి ఆమె ఎవరంటే..

  • Published Apr 06, 2024 | 5:44 PMUpdated Apr 06, 2024 | 5:44 PM
41 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న స్టార్  హీరోయిన్ ఎవరంటే..?

ఈ మధ్యకాలంలో చాలామంది సినీ తారలు వయసు మీద పడుతున్న కెరీర్ కోసం ఆలోచించి పెళ్లి చేసుకోవలనే ప్రసక్తే తీసుకురావడం లేదు. ఈ క్రమంలోనే చాలామంది వరుస సినిమాలు చేసుకుంటూ కెరీర్ పరంగా దూసుకుపోవడమే కాకుండా..హ్యాపీగా సింగెల్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. మరి కొందరు మాత్రం లేటు వయసులో ప్రేమ, పెళ్లి అంటూ తమ ఫ్యాన్స్ కు సర్‌ప్రైజ్‌ చేస్తూ.. నెట్టింట తెగ హంగామా చేస్తుంటరు. అయితే ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగే బాగుంటుంది అంటారు పెద్దలు. కానీ, ఈ మాట సెలబ్రిటీల విషయంలో మాత్రం పూర్తిగా మారిపోతుంది. ఇప్పటికే చాలామంది కెరీర్ ఓ స్టేజ్ కి వెళ్తే తప్పా.. పెళ్లి, పిల్లలు అనే కాన్సెఫ్ట్ ను ఫాలో అవ్వడం లేదు. ఇప్పుడు ఇదే కాన్సెఫ్ట్ ను ఫాలో అయిన ఓ హీరోయిన్ తాజాగా లేట్ వయసులో తన అభిమానులతో ఓ గుడ్ న్యూస్ ను షేర్ చేసింది.ఇంతకి ఆమె ఎవరంటే..

బాలీవుడ్ భామ ఆర్తి చబ్రియా గురించి ప్రేక్షకుల అందరికి తెలిసిందే. ఈ బ్యూటీ బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో కూడా హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఆర్తి.. 2019లో ఆస్ట్రేలియాకు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ విశారద్ బీడస్సిని వివాహం చేసుకొని ఆస్ట్రేలియా వెళ్ళిపోయింది. ఇక పెళ్లి చేసుకొని మ్యారెజ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్న ఆర్తి చబ్రియా సినిమాలకు పూర్తిగా దూరమైన విషయం తెలిసిందే. అయితే సినిమాల్లో కనుమరుగైన ఆర్తి సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పుడు తనకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే.. గత రెండు రోజుల క్రితం ఈ ముద్దుగుమ్మ తాను ప్రగ్నెంట్ అని బేబీ బంప్ తో ఉన్న ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే 41 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్నఆర్తి చబ్రియా బేబీ బంప్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. ఆమె అభిమానులు పలువురు ప్రముఖులు సైతం ఆమెకు కంగ్రాట్స్ చెప్తున్నారు.

ఇక ఆర్తి చబ్రియా సినిమాల విషయానికొస్తే.. ఈమె హిందిలో లజ్జ, ఆవారా పాగల్ దీవానా, షూటౌట్ ఎట్ లోఖండ్‌వాలా, మిలేంగే మిలేంగే.. వంటి మరెన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. అలాగే తెలుగులో ఒకరికి ఒకరు, ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి, గోపి – గోడమీద పిల్లి వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. మరి, లేటు వయసులో తల్లి కాబోతున్న ఆర్తి చబ్రియా పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి