iDreamPost

సైబర్ మోసగాడి ఉచ్చులో పడ్డ బాలీవుడ్ నటుడు!

ఈ మధ్యకాలంలో ఆన్ లైన్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. సైబర్ కేటుగాళ్లు ప్రజలను మాయ మాటలతో ఉచ్చులోకి దింపి.. లక్షలాది రూపాయలను కాజేస్తున్నారు. ఈ కేటుగాళ్ల మాయలో సినీ, రాజకీయ ప్రముఖులు కూడా పడుతున్నారు.

ఈ మధ్యకాలంలో ఆన్ లైన్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. సైబర్ కేటుగాళ్లు ప్రజలను మాయ మాటలతో ఉచ్చులోకి దింపి.. లక్షలాది రూపాయలను కాజేస్తున్నారు. ఈ కేటుగాళ్ల మాయలో సినీ, రాజకీయ ప్రముఖులు కూడా పడుతున్నారు.

సైబర్ మోసగాడి ఉచ్చులో పడ్డ బాలీవుడ్ నటుడు!

ఈ మధ్యకాలంలో ఆన్ లైన్ ద్వారా లావాదేవీలు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రతిదానికి డిజిటిల్ పేమెంట్సే తప్ప.. లిక్వీడ్ క్యాష్ చాలా తక్కువగా వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సైబర్ నేరాలకు సంబంధించిన ఘటనలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. సైబర్ కేటుగాళ్ల ఉచ్చులో చిక్కుక్కుని ఎంతో మంది ప్రజలు లక్షలాది రూపాయాలు నష్టపోతున్నారు. నిత్యం ఇలాంటి వార్తలు అనేకం వస్తూనే ఉన్నాయి. ఒక్కోసారి ఉద్యోగం ఇప్పిస్తానని, మరొక్కసారి తక్కువ ధరకే రుణం ఇప్పిస్తానంటూ అనేక రకాలుగా కేటుగాళ్లు ప్రజలను మభ్యపెడి మాయ చేస్తున్నారు. సైబర్ కేటుగాళ్లు రోజుకో కొత్త పద్ధతులను అవలంబిస్తూ చోరీలకు పాల్పడుతున్నారు. ఇక ఈ కేటుగాళ్ల మాయలో సినీ, రాజకీయ ప్రముఖులు కూడా పడుతున్నారు. తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటుడు సైబర్ మోగాళ్ల ఉచ్చులో పడి భారీగా నష్టపోయాడు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…

బాలీవుడ్ హస్యనటుడు రాకేశ్ బేడీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కమేడియన్ గా వెండితెరపై నవ్వులు పూయించే ఈ నటుడు తాజాగా గదర్ 2 సినిమాలో కూడా నటించాడు. ఎన్నో సినిమాల్లో, టీవీ షోల్లో తనదైన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక తాజాగా సైబర్ మోసగాళ్ల ఉచ్చులో పడిన సినీ ప్రముఖల జాబితాలో  ఆయన కూడా చేరారు. ఓ కేటుగాడు.. తనను ఆర్మీ అధికారిని అని పరిచయం చేసుకుని రాకేశ్ బేడీని మోసం చేశాడు. రాకేశ్ బేడీకి ఒక వ్యక్తి ఫోన్ చేసి.. తన పేరు ఆదిత్య కుమార్ అని, తాను ఒక ఆర్మీ అధికారినంటూ పరిచయం చేసుకున్నాడు.

Leading Actor in Cyber Ketugadi Maya!

పుణేలో తనకున్న ఇంటిని అమ్మాలని ఓ హౌసింగ్ పోర్ట లో ఆస్తికి సంబంధించిన వివరాలను ఆయన పొందుపరిచాడు. మరుసటి రోజే సదరు వ్యక్తి ఫోన్ చేసి.. రాకేశ్ బేడీని పరిచయం చేసుకున్నాడు. గతంలోనూ ఓ ఇంటిని ఆర్మీ అధికారికి విక్రయించిన రాకేశ్.. ఈ కేటుగాడి మాటలను సులువుగా నమ్మాడు. అంతేకాక అతడితో ఇళ్లు అమ్మకం విషయంలో ఒప్పందం కూడా చేసుకున్నాడు.  ముందుగా రూ. లక్ష బదిలీ చేస్తానని ఆ వ్యక్తి చెప్పాడు. అయితే కాసేపటికి తరువాత ఫోన్ చేసి.. బదిలీ ప్రక్రియలో ఏదో సమస్య ఉందని ప్రత్యామ్నాయంగా రాకేశ్ సతీమణి అకౌంట్ వివరాలు చెప్పాలని కోరాడు.

దీంతో సరేన్న రాకేశ్.. తన భార్య అకౌంట్ వివరాలను సదరు వ్యక్తికి పంపాడు. ఎక్కువ మొత్తంలో డబ్బులు బదిలీ చేస్తున్నందున బ్యాంకు నుంచి ఓ సందేశం వస్తుందని, దాన్ని అంగీకరిస్తే వెంటనే డబ్బు జమ అవుతుందని ఆ వ్యక్తి తెలిపాడు. రాకేశ్ అతడు చెప్పినట్టే చేయగా డబ్బులు రాలేదు. అంతేకాక రాకేశ్ బేడీ భార్య ఖాతా నుంచి రూ. 50 వేలు మాయం అయ్యాయి. వెంటనే బేడీ అతడికి ఫోన్ చేశాడు. బదిలీ ప్రక్రియలో పొరపాటు జరిగిందని రీఫండ్ కోసం రూ.30 వేలు  ఖాతాలో డిపాజిట్ చేయమని కోరాడు.  ఆ 30 వేలతో కలిపి మొత్తం రూ.80 వేలు రాకేశ్ నుంచి కేటుగాళ్లు కొట్టేశారు. ఆ తరువాత  అవతలి నుంచి ఫోన్ చేసిన వ్యక్తి తిరిగి కాల్ చేస్తే.. స్పందించలేదు.

దీంతో తాను మోసపోయినట్లు గ్రహించిన రాకేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాను గతంలో ఒక ఆర్మీ అధికారికే తన ఆస్తి ఒకటి అమ్మాననీ, అందువల్ల ఆర్మీ అధికారినని ఆ మోసగాడు చెప్పడంతో నమ్మేశాననీ రాకేశ్ చెప్పారు. మరి.. ఇలాంటి సైబర్ కేసులు అరికట్టే మార్గాలు ఏమిటి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి