iDreamPost

విషాదం.. బోటు మునిగి 90 మందికి పైగా జలసమాధి!

Boat Sinks off Mozambique Coast: అప్పటి వరకు పడవలో అందరూ ఎంతో సంతోషంగా ప్రయాణిస్తున్నారు. ఊహించని పరిణామంతో ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు.

Boat Sinks off Mozambique Coast: అప్పటి వరకు పడవలో అందరూ ఎంతో సంతోషంగా ప్రయాణిస్తున్నారు. ఊహించని పరిణామంతో ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు.

విషాదం.. బోటు మునిగి 90 మందికి పైగా జలసమాధి!

భూమి, ఆకాశం, సముద్రం ఎక్కడైనా మృత్యువు ఏ రూపంలో వస్తుందో ఎవరూ ఊహించలేరు. అప్పటి వరకు ఎంతో సంతోషంగా ఉన్న వాళ్లు హఠాత్తుగా కంటికి కానరాని లోకాలకు వెళ్లడంతో ఆ కుటుంబం సభ్యులు పడే ఆవేదన అంతా ఇంతా కాదు.  చాలా వరకు అనారోగ్యం, హార్ట్ ఎటాక్, అగ్ని ప్రమాదాలు, కరెంట్ షాక్, రోడ్డు ప్రమాదాల చనిపోతున్నారు. ఇటీవల విమాన, పడవ ప్రమాదాలు కూడా ఈ మధ్య ఎక్కువ అయ్యాయి. ఇటీవల పడబ ప్రమాదాలు బాగా పెరిగిపోయాయి.  తాజాగా ఆఫ్రికా దేశం మొజాంబిక్ లో పడవ ప్రమాదంతో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ప్రమాదం ప్రపంచ వ్యాప్తంగా ఉలిక్కి పడేలా చేసింది. వివరాల్లోకి వెళితే..

మొజాంబిక్ లో ఘోర పడవ ప్రమాదం జరిగింది. ఆఫ్రికా దేశం మొజాంబిక్ ఉత్తర తీర ప్రాంత సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్లిన వారి పడవ మునిగిపోవడంతో 90 మందికి పైగా  జలసమాధి అయినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రమాద సమయంలో పడవలో మొత్తం 130 మంది ప్రయాణిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే సామర్థ్యానికి మించి పడవలో ప్రయాణం చేయడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు నాంపులా రాష్ట్ర కార్యదర్శి జైమ్ నెటో తెలిపారు. ప్రస్తుతం రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారని వెల్లడించారు.  సముద్రంలో పరిస్థితులు కష్టంగా ఉండటంతో రెస్క్యూ కార్యక్రమంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన తెలిపారు. అయినా కూడా రెస్క్యూ తమ పని తాము చేసుకుంటూ వెళ్తున్నారని జైమ్ నెటో తెలిపారు. మృతుల్లో ఎక్కువగా చిన్నారులు ఉన్నట్లు చెప్పారు.

దక్షిణాఫ్రికాలో అక్టోబర్ నుంచి దాదాపు 15 వేల మంది పలు రకాల వ్యాధులకు ప్రభావితం అయ్యారు. 32 మంది చనిపోయినట్లు కేసులు నమోదు అయ్యాయి.  ప్రపంచ దేశాల్లో అతి పేద దేశంలో ఒకటి మొజాంబికో. ఇటీవల నమోదు అయిన కలరా కేసుల్లో మూడో వంతు నంపులా ప్రావిన్స్ లో నమోదు అయ్యాయి. అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతూ వస్తున్నారు.  దీంతో సురక్షిత ప్రదేశాలకు తరలి వేళ్లే బోట్లలో చిన్నా పెద్ద ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలోనే సామర్ధ్యానికి మించి పడవలో ప్రయాణం చేయడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. మరో వైపు పడవ ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి