iDreamPost

జగన్‌ బాటలో బీజేపీ

జగన్‌ బాటలో బీజేపీ

యువ సీఎం వైఎస్‌జగన్‌ ఆలోచనను నిన్న తృణముల్‌ కాంగ్ర్‌స్‌ అందిపుచ్చుకోగా.. నేడు బీజేపీ కూడా జై కొట్టింది. విప్లవాత్మకమైన సంక్షేమ పథకాలు, వినూత్న కార్యక్రమాలతో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్న ట్రెండ్‌ సెట్‌ చేస్తున్న వైఎస్‌ జగన్‌ పథకాలు, కార్యక్రమాలను దేశంలోని వివిధ పార్టీలు అందిపుచ్చుకుంటున్నాయి. తాజాగా జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఆయా పార్టీలు విడుదల చేస్తున్న ఎన్నికల మేనిఫెస్టోలో పెడుతున్న పథకాలు, కార్యక్రమాలు ప్రస్తుతం ఏపీలో వైఎస్‌ జగన్‌ సర్కార్‌ అమలు చేస్తున్నవే కావడం విశేషం.

దేశంలోనే తొలిసారిగా ఇంటింటికి రేషన్‌ పంపిణీ కార్యక్రమాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్నారు. 9,260 వాహనాలతో పట్టణాలు, పల్లెల్లో రేషన్‌ లబ్ధిదారుల ఇంటి వద్దకే పంపిస్తున్నారు. దీని వల్ల లబ్ధిదారులకు సమయం ఆదా కావడమే కాకుండా.. వాహన డ్రైవర్, సహాయకుడు పేరిట 18,520 మందికి ఉపాధి లభించింది. ఈ కార్యక్రమాన్ని తృణముల్‌ కాంగ్రెస్, బీజేపీలు ఇప్పుడు అందిపుచ్చుకున్నారు. పశ్చిమ బెంగాల్‌లో మళ్లీ అధికారంలోకి వస్తే.. ఇంటింటికి రేషన్‌ పంపిణీ చేస్తామని తృణముల్‌ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. ఇదే క్రమంలో బీజేపీ కూడా తమిళనాడులోనూ హమీ ఇచ్చింది. తమిళనాడులో తమ కూటమి అధికారంలోకి వస్తే.. ఇంటింటికి రేషన్‌ పంపిణీ చేస్తామని తన ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ ప్రకటించింది.

సమర్థవంతమైన పరిపాలనతో ప్రజలకు మంచి చేసేందుకు పరిపాలనా అనుభవం అవసరం లేదని 21 నెలల పాలనలోనే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నిరూపించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి వైఎస్‌ జగన్‌ అమలు చేసిన పథకాలు, కార్యక్రమాలు, పరిపాలనా పరంగా తీసుకొచ్చిన విప్లవాత్మక చర్యలు ప్రజలకు అత్యున్నత స్థాయిలో మేలు చేశాయి. వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచాయి. ప్రభుత్వ సేవలు అత్యంత సులభంగా, సరళతరంగా అందుతున్నాయి. సీఎం వైఎస్‌ జగన్‌ అమలు చేసిన పథకాలు, కార్యక్రమాలు, పరిపాలనలో తీసుకొచ్చిన సంస్కరణలతో ప్రజల ఆర్థిక, సామాజిక పరిస్థితులు మెరుగయ్యాయి. అందుకే గడచిన స్థానిక ఎన్నికల్లో ఏపీ ప్రజలు వైఎస్‌జగన్‌ పార్టీకి బ్రహ్మరథం పట్టారు.

వైఎస్‌ జగన్‌ పాలనను, ఆయన ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను నిశితంగా గమనిస్తున్న దేశంలోని ఇతర రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు ఆయా రాష్ట్రాలలో వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న తరహా పథకాలను ప్రవేశపెట్టేందుకు యత్నిస్తున్నాయి. ఏపీలో అమలు చేస్తున్న వలంటీర్‌ తరహా వ్యవస్థను ఢిల్లీలోనూ, ఒడిశాలోనూ ప్రవేశపెట్టేందుకు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు అరవింద్‌ కేజ్రీవాల్, నవీన్‌ పట్నాయక్‌లు పరిశీలిస్తుండడం వైఎస్‌ జగన్‌ ఆలోచన విజయవంతం అయిందనేందుకు ఓ సూచిక.

Also Read : ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు బీజేపీ ఆశలపై నీళ్లు జల్లేశాయా

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి