iDreamPost

Annapoorani Movie: నయనతార సినిమాపై తెలంగాణ MLA షాకింగ్ కామెంట్స్!

సీనియర్ హీరోయిన్, లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన అన్నపూరణి చిత్రం వివాదాలకు కారణమైంది. తాజాగా ఈ మూవీపై ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ ఎమ్మెల్యే.

సీనియర్ హీరోయిన్, లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన అన్నపూరణి చిత్రం వివాదాలకు కారణమైంది. తాజాగా ఈ మూవీపై ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ ఎమ్మెల్యే.

Annapoorani Movie: నయనతార సినిమాపై తెలంగాణ MLA షాకింగ్ కామెంట్స్!

లేడీ సూపర్ స్టార్ నయనతారకు కొత్త సంవత్సరం కలిసిరావడం లేదు. ఆమె నటించిన చిత్రం ‘అన్నపూరణి’ పెద్ద ఎత్తున వివాదానికి దారితీసింది. ఇక ఇప్పటికే ఈ మూవీపై పొరుగురాష్ట్రాలైన మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లో కేసులు నమోదైయ్యాయి. తాజాగా ఈ మూవీని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సైతం స్ట్రీమింగ్ నుంచి తొలగించింది. ఈ క్రమంలోనే ఈ సినిమాపై ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ భాజాపా ఎమ్మెల్యే రాజాసింగ్. అన్నపూరణి మూవీని నిర్మించిన జీ స్టూడియోస్ పై పూర్తిగా నిషేధం విధించాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు.

అన్నపూరణి.. సీనియర్ హీరోయిన్, లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన ఈ చిత్రం వివాదాలకు కారణమైంది. ఈ మూవీపై మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లో కేసులు నమోదైయ్యాయి. తాజాగా ఈ చిత్రంపై తెలంగాణ భాజాపా ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ..”హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఇలాంటి సినిమాలు తీస్తే సహించం. ఈ సినిమా విషయంలో తలెత్తిన వివాదంపై జీ స్టూడియోస్ క్షమాపణలు చెప్పిందని విన్నా. కానీ సారీ చెప్పినా ఇలాంటివి రిపీట్ అవుతూనే ఉంటాయి. ఈ వివాదానికి కారణమైన జీ స్టూడియోస్ పై పూర్తిగా నిషేధం విధించాలి. ఇక ఇలాంటి సినిమాలు తీసే డైరెక్టర్లు, నటీ, నటులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు విన్నపం చేస్తున్నా” అంటూ వీడియోలో కోరారు రాజాసింగ్. కాగా.. ఈ వివాదంపై స్పందించిన జీ స్టూడియోస్ అభ్యంతరకర సన్నివేశాలను తొలగించే వరకు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ నిలిపివేస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయంపై క్షమాపణలు కోరుతున్నామని ఓ ప్రకటనలో వెల్లడించింది సంస్థ. ఇక సినిమా విషయానికి వస్తే.. నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించగా.. కార్తీక్ కుమార్, జై, సత్యరాజ్, పూర్ణిమ రవి కీలక పాత్రలు పోషించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి