iDreamPost

ఈ నరకం ఏ తల్లికీ రాకూడదు.. మనసు ముక్కలైందంటూ ఏడ్చేసిన హీరోయిన్!

  • Author singhj Published - 03:51 PM, Sun - 6 August 23
  • Author singhj Published - 03:51 PM, Sun - 6 August 23
ఈ నరకం ఏ తల్లికీ రాకూడదు.. మనసు ముక్కలైందంటూ ఏడ్చేసిన హీరోయిన్!

బిపాషా బసు.. బాలీవుడ్​లో ఒక టైమ్​లో చక్రం తిప్పిన హీరోయిన్లలో ఒకరు. ఈ డస్కీ బ్యూటీ అందం, డ్యాన్సులకు యూత్ ఆడియెన్స్​ ఫిదా అయిపోయారు. యువ హీరోల దగ్గర నుంచి టాప్ స్టార్స్​ వరకు అందరి హీరోల చిత్రాల్లో నటించారు బిపాషా. ఒక సమయంలో హిందీ చిత్ర పరిశ్రమలో టాప్​ హీరోయిన్స్​తో ఆమె పోటీపడ్డారు. అయితే ఆ తర్వాత రేసులో వెనుకపడ్డారు. ‘రాజ్​’, ‘జిస్మ్’, ‘ధూమ్​ 2’, ‘నో ఎంట్రీ’, ‘ఫిర్ హేరా ఫేరీ’, ‘ఓంకార’, ‘రేస్ 2’, ‘బచ్నా హే హసీనో’ లాంటి హిట్ మూవీస్​లో తనదైన నటనతో ఆడియెన్స్​ మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారామె. తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ‘టక్కరి దొంగ’లో నటించి ఇక్కడి వారినీ అలరించారు.

బాలీవుడ్​లో స్టార్ హీరోయిన్​గా వెలుగొందిన బిపాషా బసు ఈమధ్య సినిమాలు చేయడం తగ్గించారు. ప్రియుడు కరణ్ సింగ్ గ్రోవర్​ను ఆమె పెళ్లాడిన విషయం విదితమే. అయితే బిపాషాకు పెద్ద కష్టం వచ్చింది. గత సంవత్సరం నవంబర్​లో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారామె. ఆ పాపాయికి దేవి అని నామకరణం చేశారు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తన గారాలపట్టి పుట్టుకతోనే గుండెలో రంధ్రాలతో జన్మించిందని చెప్పారు బిపాషా. దీంతో చిన్నారి దేవీకి మూడు నెలల వయసులోనే సర్జరీ చేశారని చెబుతూ కంటతడి పెట్టుకున్నారు బిపాషా.

ఇన్​స్టాగ్రామ్​లో లైవ్​లోకి వచ్చిన బిపాషా బసు.. తన ప్రెగ్నెన్సీ జర్నీతో పాటు ఓ అమ్మగా తాను ఎదుర్కొన్న ఒడిదొడుకుల గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. దేవి గుండెలో రంధ్రాలను సరిచేయడానికి వెంట్రిక్యులర్ సెప్టల్ డిఫెక్ట్ సర్జరీ చేయాలని డాక్టర్లు చెప్పారని బిపాషా తెలిపారు. ఆ సమయంలో బాధను పంటి కింద అదిమిపెట్టి నవ్వుతూ కనిపించానని.. ఇలాంటి నరకం ఏ తల్లికీ రాకూడదన్నారు. దీని గురించి తమ కుటుంబ సభ్యులకు కూడా చెప్పలేదన్నారు. పాపాయి రాకను ఎంతో ఘనంగా వేడుక చేసుకోవాలని అనుకున్నామని.. కానీ ఈ విషయం తెలిసి మనసు ముక్కలైందని బిపాషా చెప్పుకొచ్చారు. ఆపరేషన్ సక్సెస్ కావడంతో ఊపిరి పీల్చుకున్నామని చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు బిపాషా.

 

View this post on Instagram

 

A post shared by Bipasha Basu (@bipashabasu)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి