iDreamPost

Pallavi Prashanth: వినూత్న రీతిలో రాముడిపై తనకున్న భక్తిని చాటుకున్న పల్లవి ప్రశాంత్!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విన్నర్.. రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ అయోద్య రామయ్యపై తనకున్న భక్తిని వినూత్నంగా చాటుకున్నాడు.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విన్నర్.. రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ అయోద్య రామయ్యపై తనకున్న భక్తిని వినూత్నంగా చాటుకున్నాడు.

Pallavi Prashanth: వినూత్న రీతిలో రాముడిపై తనకున్న భక్తిని చాటుకున్న పల్లవి ప్రశాంత్!

సోమవారం దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠను చూసి తరించిపోయారు. వేలాది మంది ప్రముఖులు ఈ కార్యక్రమాన్ని కళ్లారా తిలకించారు. వారిలో రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, వ్యాపార వేత్తలు ఉన్నారు. అయోధ్యకు అహ్వానం అందుకున్న వాళ్లు ప్రత్యక్షంగా ఈ కార్యక్రమాన్ని తిలకించారు. దేశ పౌరులు అంతా టీవీల్లో ఈ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని వీక్షించి పులకించిపోయారు. అలాగే పౌరులు, సెలబ్రిటీలు అయోధ్య రామయ్య మీద తమకున్న భక్తిని వివిధ రూపాల్లో చూపించుకున్నారు. పాన్ ఇండియా లెవల్లో ఉన్న స్టార్లు అయోధ్య రామయ్యను తలుచుకుంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. వారి భక్తిని చాటుకున్నారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ కూడా వినూత్న రీతిలో తన భక్తిని చాటుకున్నాడు.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సీజన్ అంత బాగా క్లిక్ అవ్వడానికి కారణం రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ అని కూడా చెప్పచ్చు. ప్రశాంత్ వల్ల సిటీల్లోనే కాకుండా.. పల్లెటూర్లలో కూడా బిగ్ బాస్ తెలుగు చూడటం విపరీతంగా పెరిగిపోయింది. కామన్ మ్యాన్ కేటగిరీలో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ప్రశాంత్.. చివరకు టైటిల్ విన్నర్ అయ్యాడు. అయితే బిగ్ బాస్ లోకి రాక ముందునుంచే పల్లవి ప్రశాంత్ కు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఉంది.

Pallavi Prashanth who showed her devotion to Lord Rama in an innovative way

పల్లవి ప్రశాంత్ ఇన్ స్టాగ్రామ్ లో 4 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉండేవాళ్లు. ఆ సంఖ్య ఇప్పుడు 1 మిలియన్ దాటేసింది. అతను ఎప్పుడూ తాను అనుకున్న విషయాలను వినూత్న రీతిలో చెబుతూనే ఉంటాడు. తాజాగా అయోధ్య రామయ్య ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా తనకు ఆ శ్రీరాముడిపై ఉన్న భక్తిని వినూత్న రీతిలో చాటుకున్నాడు. కాషాయ వస్త్రాలు ధరించింది. వెనుకవైపు శ్రీరాముడి జెండాను పెట్టుకుని ధ్యానం చేస్తున్నట్లు కూర్చుని ఉన్న ఫొటోని షేర్ చేశాడు. ఆ పోస్టుకు “500 ఏళ్ల నిరీక్షణ ఫలించిన వేళ.. జైశ్రీరామ్” అంటూ క్యాప్షన్ పెట్టాడు. ప్రశాంత్ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ పోస్టుపై అభిమానుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇంక ప్రశాంత్ విషయానికి వస్తే.. సీజన్ జరిగినన్ని రోజులు పల్లవి ప్రశాంత్ కు విపరీతమైన సపోర్ట్ లభించింది. కామన్ మ్యాన్ ను గెలిపించాలంటూ పెద్దఎత్తున క్యాంపెయిన్లు కూడా చేశారు. అందరూ కోరుకున్నట్లు ప్రశాంత్ విన్నర్ అయ్యాడు. కానీ, సీజన్ ముగిసిన తర్వాత జరిగిన పరిణామాలను మాత్రం ఎవరూ ఊహించలేదు. అతను అరెస్టు కావడం చంచల్ గూడాలో రిమాండు ఖైదీగా ఉండటం, ఆ తర్వాత షరతులతో కూడిన బెయిల్ పై బయటకు రావడం అన్నీ చకాచకా జరిగిపోయాయి. ప్రస్తుతానికి అన్నీ వివాదాలు దాదాపుగా ముగిసిపోయినట్లు కనిపిస్తున్నాయి. మరి.. పల్లవి ప్రశాంత్ పోస్టుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by MALLA OCHINA (@pallaviprashanth_)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి