iDreamPost

Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ అరెస్టు వీడియో.. ఓవరాక్షన్ అంతా తగ్గింది!

రైతుబిడ్డగా హౌస్ లోకి అడుగు పెట్టిన పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ అయ్యాడు. అయితే షో ముగిసిన తర్వాత అతను, ఫ్యాన్స్ చేసిన హంగామాతో కేసులు కూడా నమోదు అయ్యాయి.

రైతుబిడ్డగా హౌస్ లోకి అడుగు పెట్టిన పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ అయ్యాడు. అయితే షో ముగిసిన తర్వాత అతను, ఫ్యాన్స్ చేసిన హంగామాతో కేసులు కూడా నమోదు అయ్యాయి.

Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ అరెస్టు వీడియో.. ఓవరాక్షన్ అంతా తగ్గింది!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్ ని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. బిగ్ బాస్ ముగింపు వేడుకల్లో ప్రశాంత్ పోలీసుల మాట వినకుండా అక్కడ అల్లర్లకు పరోక్షంగా కారకుడు అయ్యాడు. అప్పటి నుండి ప్రశాంత్ అరెస్ట్ తప్పదన్న వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. కాగా.. కొన్ని నిమిషాల క్రితం జూబ్లీహిల్స్ పోలీసులు పల్లవి ప్రశాంత్ ని అతని స్వస్థలం వద్ద అరెస్ట్ చేశారు. రైతుబిడ్డపై మొత్తంగా 9 కేసులు నమోదు అయినట్టు తెలుస్తోంది. అయితే.. పోలీసులు ఇంటి వద్దకి రాగానే.. పల్లవి ప్రశాంత్ ప్రవర్తనలో మార్పు వచ్చేసింది. నేను పోలీస్ స్టేషన్ కి వస్తాను.. కానీ.. ఎక్కడికి నను తీసుకెళ్తున్నారు? మా సర్పంచ్ వచ్చే వరకు ఆగండి. నా బట్టలు మాసిపోయి ఉన్నాయి. అవి మార్చుకుని వస్తా అంటూ చాలాసేపు కాలయాపన చేస్తూ వచ్చాడు. అప్పటికే అతని గ్రామస్థులు, ఫ్యాన్స్ అక్కడికి పెద్దఎత్తున చేరుకుంటూ ఉండటంతో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి ప్రశాంత్ ని అక్కడి నుండి తరలించారు. ఇంకొన్ని గంటల్లో ప్రశాంత్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి చేరుకోవచ్చు.

బిగ్ బాస్ షో ప్రారంభం అయినప్పటి నుంచి పల్లవి ప్రశాంత్ పేరు ఒక సెన్సేషన్ అనే చెప్పాలి. కామన్ మ్యాన్ గా హౌస్ లోకి అడుగుపెట్టాడు. రైతుబిడ్డ ట్యాగ్ తో హౌస్ లోకి వెళ్లిన ప్రశాంత్ కు ప్రేక్షకుల వద్ద మంచి పేరు వచ్చింది. అతని ఆటతో అందరినీ ఆకట్టుకున్నాడు. అలాగే ఓటింగ్ లో కూడా ఎప్పుడూ టాప్ ప్లేస్ లో వస్తూ వచ్చాడు. అలాగే చివరిగా టైటిల్ కూడా కొట్టాడు. కానీ, బయటకు వచ్చిన తర్వాత అతని ప్రవర్తన పలు విమర్శలు, ఆరోపణలకు తావిచ్చింది. అంతేకాకుండా అతడిని ఎన్నో ఇబ్బందుల్లోకి నెట్టేసింది. అభిమానులను తీసుకురావద్దు అంటూ పోలీసులు ఎంత చెప్పినా వినకుండా అన్నపూర్ణ స్టూడియో వద్దకు భారీ ఎత్తున ఫ్యాన్స్ ని తెచ్చుకున్నారు. అంతేకాకుండా స్టూడియో బ్యాక్ గేటు నుంచి వెళ్లమంటే నేనేమైనా దొంగనా అంటూ మళ్లీ స్టూడియో వద్దకు ర్యాలీగా చేరుకున్నాడు.

అప్పుడు కూడా పోలీసులు వద్దని వారించారు. కానీ, ప్రశాంత్ మాత్రం వినకుండా ర్యాలీ చేశాడు. ఆ తర్వాత అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రైవేటు ఆస్తులు మాత్రమే కాకుండా ప్రభుత్వ ఆస్తులను కూడా ధ్వంసం చేశారు. ముఖ్యంగా అమర్ దీప్, గీతూ రాయల్, అశ్వినీ శ్రీ కార్లను పగలగొట్టారు. అంతేకాకుండా ఆర్టీసీ బస్సులను కూడా ధ్వంసం చేశారు. ఈ దాడులను పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. కేసులు కూడా నమోదు చేశారు. వీడియోలు అన్నీ జల్లెడ పడుతూ నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇప్పటికే పల్లవి ప్రశాంత్ డ్రైవర్లను అరెస్టు చేసిన పోలీసులు.. ఇప్పుడు ప్రశాంత్ ను కూడా అరస్టు చేశారు. అతనికి బెయిల్ తెచ్చేందుకు లాయర్ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ అల్లర్లలో ఇవే ఆఖరు అరెస్టులు అనుకోవడానికి లేదు. ఇంకా నిందితుల కోసం గాలింపు అయితే కొనసాగుతూనే ఉందని తెలుస్తోంది. పల్లవి ప్రశాంత్ ను అరెస్టు చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి