iDreamPost

Rathika Rose: ఓ మంత్రి, MLA, దర్శకుడు.. రతిక లైఫ్ ని తీర్చి దిద్దిన ఆ ముగ్గురు?

Rathika Rose: ఓ మంత్రి, MLA, దర్శకుడు.. రతిక లైఫ్ ని తీర్చి దిద్దిన ఆ ముగ్గురు?

రతికా రోజ్.. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు బాగా వైరల్ అవుతోంది. బిగ్ బాస్ గేమ్ తన లైఫ్ ని ఛేంజ్ చేస్తుందనే గట్టి నమ్మకంతో హౌస్ లో అడుగుపెట్టింది. కప్పు కొట్టే తిరిగి వస్తానని కాన్ఫిడెంట్ గా చెప్పింది. అయితే బిగ్ బాస్ ఆటో.. తన గేమ్ ప్లానో గానీ.. నాలుగోవారమే ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. అయితే బిగ్ బాస్ వల్ల మంచి జరుగుతుందని భావించిన రతికకు నిరాశే ఎదురైంది. ఎందుకంటే ఆ షో ఆమెకు నెగిటివిటీని మూటకట్టింది. ప్రతి సీజన్ లో ఎవరో ఒకరు ఇలా బలైపోతూనే ఉంటారు. ఈసారి రతికా రోజ్ అయ్యిందనే చెప్పాలి. అయితే రతిక రియల్ లైఫ్ స్టోరీ తెలిస్తే ఆమెను ఇంతలా ట్రోల్ చేయరేమో?

రతికా రోజ్ సాధారణ కుటుంబంలో జన్మించింది. 2016లో పటాస్ షోతో తనకంటూ ప్రత్యక గుర్తింపు సంపాదించుకుంది. తన మాటలు, అమాయకత్వంతో ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత చిన్నగా కెరీర్ ని బిల్డ్ చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు హీరోయిన్ స్థాయికి వచ్చింది అంటే అదేదో ఓవర్ నైట్ లో జరిగిన మిరాకిల్ కాదు. రతిక ఒక గోల్ సెట్ చేసుకుని జీవితంలో మెట్టు మీద మెట్టు ఎక్కుతూ ఈ స్థాయికి వచ్చింది. అయితే బిగ్ బాస్ లో రతికాను చూసి చాలా నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఆమెపై దారుణమైన ట్రోలింగ్ చేస్తున్నారు. ఆమె ఇన్ స్టాగ్రామ్ కామెంట్ బాక్స్ కూడా ఆఫ్ చేసుకునే పరిస్థితికి వచ్చింది. నిజానికి లైఫ్ లో ఈ స్థాయికి రావడానికి రతిక ఎంత కష్టపడిందో.. ఆమెకు ఎవరెవరు సహాయం చేశారో ఆమె తండ్రే స్వయంగా వివరించారు. రతిక జీవితాన్ని ఎంపీ మల్లారెడ్డి, రసమయి బాలకిషన్, దర్శకుడు రాఘవేంద్రరావు తీర్చిదిద్దినట్లు తెలియజేశారు.

రతికకు 9వ తరగతిలో నవోదయ సీటు వచ్చింది. ఆ తర్వాత ఇంటర్ వరకు నవోదయాలోనే చదివింది. ఆ తర్వాత మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్ లో ఫ్రీ సీటు వచ్చింది. వందలోపు ర్యాంకు వచ్చిందని హాస్టల్ ఫీజు కూడా మల్లారెడ్డి కట్టి చదివించారట. రతిక తండ్రి గొర్రెల కాపరి.. ఆయన దగ్గర అప్పుడు డబ్బు లేదు. ఆ విషయాన్ని మల్లారెడ్డికి చెబితే అన్నీ ఖర్చులు ఆయనే పెట్టుకుని రతికని చదివించారు. రతిక డాన్స్ బాగా చేసేది. పటాస్ షోలో చేస్తూ సినిమాల్లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఆ సమయంలో తుపాకి రాముడు సినిమాలో ఛాన్స్ వచ్చేలా రసమయి బాలకిషన్ చేశారు. రతికాకు లైఫ్ ఇచ్చింది ఆయనే అంటూ చెప్పుకొచ్చారు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత ప్రియ పేరు మారిస్తే బాగుంటుందని దర్శకుడు రాఘవేంద్రరావు చెప్పారు.

 

View this post on Instagram

 

A post shared by Rathika (@rathikarose_official)

జాతకం చూపించగా.. ‘ర’ అక్షరంతో మొదలై ‘క’ అక్షరంతో ముగించే పేరు పెట్టమన్నారు. అందుకే రతిక అని పెట్టినట్లు వివరించారు. ఇలా జీవితంలో రతికా రోజ్ ఈ స్థాయికి రావడానికి మంత్రి మల్లారెడ్డి, రసమయి బాలకిషన్, దర్శకుడు రాఘవేంద్రరావు కారణం అయ్యారనమాట. రతికా రోజ్ కి సంబంధించి ఆమె అభిమానులు పదే పదే ఒక కామెంట్ చేస్తున్నారు. ‘డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్’ అని. నిజానికి రతికా లైఫ్ లో చాలనే కష్టపడింది. ఎంత కష్టపడుతున్నా బ్రేక్ రావడం లేదు అంటూ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే ముందే చెప్పింది. ఈ షో ద్వారా అయినా తన లక్ ని పరీక్షించుకుంటాను అంది. కానీ, ఈ షో కూడా ఆమెకు అంత ఆదరణ తెచ్చిపెట్టినట్లుగా అనిపించడం లేదు. ఆట ముగిసింది కాబట్టి ఇప్పటికైనా నెటిజన్స్ రతికా రోజ్ పై ట్రోలింగ్, నెగిటివ్ కామెంట్స్ ఆపేస్తే బాగుటుందేమో.

 

View this post on Instagram

 

A post shared by Rathika (@rathikarose_official)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి