iDreamPost
android-app
ios-app

ప్రేమలు మూవీలో మిస్టేక్.. ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యారు? నెటిజన్స్ నవ్వేస్తున్నారు..

Big Mistake In Premalu Movie: మలయాలం నుంచి వచ్చిన ప్రేమలు మూవీ ఏ స్థాయి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అయితే ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఈ మూవీ క్లయిమ్యాక్స్ లో జరిగిన ఒక మిస్టేక్ ని ఇప్పుడు నెట్టింట వైరల్ చేస్తున్నారు.

Big Mistake In Premalu Movie: మలయాలం నుంచి వచ్చిన ప్రేమలు మూవీ ఏ స్థాయి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అయితే ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఈ మూవీ క్లయిమ్యాక్స్ లో జరిగిన ఒక మిస్టేక్ ని ఇప్పుడు నెట్టింట వైరల్ చేస్తున్నారు.

ప్రేమలు మూవీలో మిస్టేక్.. ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యారు? నెటిజన్స్ నవ్వేస్తున్నారు..

ఈ ఏడాదిని మలయాళం మూవీస్ ఇయర్ గా అభివర్ణిస్తున్నారు. ఎందుకంటే మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన చిత్రాలు ఈ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ లో అద్భుతాలు సృష్టించాయి. మోహన్ లాల్ భ్రమయుగం, ప్రేమలు, మంజుమ్మెల్ బాయ్ మూవీస్ పాన్ ఇండియా లెవల్లో రికార్డులు మీద రికార్డులు క్రియేట్ చేశాయి. అలాగే ఓటీటీల్లో కూడా ఈ చిత్రాలు నెక్ట్స్ లెవల్ వ్యూవర్ షిప్ ని సొంతం చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రముఖ ఓటీటీ ఆహాలో ప్రేమలు సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. హాట్ స్టార్ లో ప్రేమలు మలయాళం, హిందీ, తమిళ్ వర్షన్స్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. అయితే ఈ ప్రేమలు సినిమా మేకర్స్ ఒక చిన్న లాజిక్ మిస్ అయ్యారు. అది ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

చిన్న సినిమాగా, ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ప్రేమలు సినిమా పాన్ ఇండియా లెవల్లో సెన్సేషన్స్ క్రియేట్ చేసింది. రూ.5 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కిన ఈ మూవీ ఏకంగా రూ.135 కోట్లు కలెక్ట్ చేసి అందరినీ షాక్ కి గురి చేసింది. ఈ ప్రేమలు మూవీ ఏప్రిల్ 12న ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆహాలో అయితే టాప్ 10లో ఫస్ట్ ప్లేస్ లో ట్రెండ్ అవుతోంది. హాట్ స్టార్ లో కూడా ప్రేమలు సినిమాకి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ ప్రేమలు మూవీలో ఒక చిన్న మిస్టేక్ చేశారు. దానిపై డైరెక్టర్ ఫోకస్ చేయలేదు. ఆడియన్స్ కూడా చేయరేమో అనుకున్నారు. కానీ, ఇప్పుడు నెట్టింట ప్రేమలు సినిమా ఆ విషయంలో మాత్రం నవ్వుల పాలు అవుతోంది.

స్పాయిలర్ అలర్ట్:

విషయం ఏంటంటే.. ప్రేమలు సినిమాలో హీరో సచిన్ హీరోయిన్ కి ప్రపోజ్ చేస్తాడు. కానీ, హీరోయిన్ మాత్రం చాలా హార్ష్ గా రిజెక్ట్ చేస్తుంది. పైగా సచిన్ బాధ పడేలా కామెంట్స్ చేస్తుంది. దాంతో సచిన్ హైదరాబాద్ వదిలేసి చెన్నై వెళ్లిపోతాడు. అక్కడే ఉండి మళ్లీ తన యూకే ప్రయత్నాలు ప్రారంభిస్తాడు. ఎట్టకేలకు యూకే వీసా కూడా వచ్చేస్తుంది. యూకేకి వెళ్లేందుకు సచిన్ హైదరాబాద్ వస్తాడు. అక్కడ పార్టీలో రీనూని కలుస్తాడు. అస్సలు పట్టించుకోడు ఆమెను. మధ్యలో ఆదికి కూడా ఇచ్చి పడేస్తాడు. ఇలా కథ నడుస్తూ ఉంటుంది. యూకే వెళ్లిపోతున్నా రేపు మార్నింగ్ 11.30కి ఫ్లైట్ అంటూ సచిన్ చెప్తాడు.

కట్ చేస్తే ఉదయం సచిన్ కి సెండావ్ ఇవ్వడానికి రీనూ కూడా వస్తుంది. మధ్యలో ఆది వచ్చి వీళ్లను అటాక్ చేస్తాడు. ఎలాగో తప్పించుకుని వాళ్లు ఎయిర్ పోర్టుకు వెళ్లిపోతారు. సచిన్ కు రీనూ ప్రపోజ్ చేస్తుంది. ఇద్దరు ఎమోషనల్ గా హగ్ చేసుకుని ఏడ్చేస్తారు. తర్వాత సచిన్ ఫ్లైట్ ఎక్కి వెళ్లిపోతాడు. అయితే ఇక్కడ మిస్టేక్ ఏంటి అని తలలు పట్టుకోవద్దు. సచిన్ చెప్పిన 11.30 ఫ్లైట్ కి ఎయిర్ పోర్టుకి ఎలా లేదన్నా 10 గంటల కల్లా వెళ్లాలి. కానీ, రీనూని హగ్ చేసుకున్నప్పుడు సచిన్ చేతికి ఉన్న వాచ్ లో టైమ్ 12.10 గంటలు చూపిస్తోంది. ఈ మిస్టేక్ ని పట్టుకుని ఇప్పుడు అంత గొప్ప ఎంటర్ టైనర్ ని నెట్టింట గేలి చేస్తున్నారు. మరి.. ప్రేమలు సినిమా చూశారా? మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetcasibomjojobetcasibomjojobetpokerklasmadridbetjojobetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişcasibomcasibomgrandpashabetmarsbahis giriş