iDreamPost
android-app
ios-app

అంతర్జాతీయ క్రికెట్ కు భువనేశ్వర్ కుమార్ రిటైర్ మెంట్? ముందే హింట్ ఇచ్చాడా?

  • Author Soma Sekhar Published - 08:43 PM, Fri - 28 July 23
  • Author Soma Sekhar Published - 08:43 PM, Fri - 28 July 23
అంతర్జాతీయ క్రికెట్ కు భువనేశ్వర్ కుమార్ రిటైర్ మెంట్? ముందే హింట్ ఇచ్చాడా?

ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలు ఏ విషయాన్ని అయినా సోషల్ మీడియా ద్వారా నర్మగర్భంగా చెబుతున్నారు. తద్వారా అభిమానులకు ముందే హింట్ ఇస్తున్నారు. తాజాగా టీమిండియా వెటరన్ పేసర్, స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ సైతం తన రిటైర్ మెంట్ పై ఫ్యాన్స్ కు ముందే హింట్ ఇచ్చాడా? అంటే అవుననే సంకేతాలే కనిపిస్తున్నాయి. 33 ఏళ్ల భువనేశ్వర్ కుమార్ టీమిండియాకు ఎన్నో మరపురాని విజయాలను అందించాడు. తాజాగా అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలకబోతున్నడు అన్న వార్త వైరల్ గా మారింది. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

భువనేశ్వర్ కుమార్.. టీమిండియా వెటరన్ పేసర్ గా జట్టుకు ఎన్నో చిరస్మరణియమైన విజయాలు అందించాడు. ఆడింది తక్కువ మ్యాచ్ లే అయినప్పటికీ ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. టీ20, టెస్ట్, వన్డే ఫార్మాట్స్ లో ఐదు వికెట్ల హాల్ సాధించిన ఏకైక టీమిండియా బౌలర్ గా నిలిచాడు భువీ. కాగా గత కొంతకాలంగా జట్టుకు దూరమయ్యాడు. గాయాలు, ఫామ్ లో లేకపోవడం కారణంగా అతడు వన్డే జట్టుకు దూరం అయ్యాడు.

కాగా.. భువీ 2022లో తన చివరి వన్డే ఆడాడు. ఈ క్రమంలోనే ఐర్లాండ్ తో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత తన అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలుకుతాడని తెలుస్తోంది. అందుకు సంబంధించి తాజాగా హింట్ కూడా ఇచ్చాడు ఈ పేసర్. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ బయోలో క్రికెటర్ అన్న పదాన్ని తొలగించాడు భువనేశ్వర్. ఇంతకు ముందు అతడి బయోలో ‘ఇండియన్ క్రికెటర్’ అని ఉండేది. ప్రస్తుతం క్రికెటర్ అన్న పదాన్ని తొలగించాడు ఈ వెటరన్ పేసర్. దాంతో త్వరలోనే భువీ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలకబోతున్నాడు అన్న వార్తలు వైరల్ గా మారాయి.

భువనేశ్వర్ కుమార్ రిటైర్ మెంట్ వార్తలు రావడంతో..  బీసీసీఐపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భారత క్రికెట్ అభిమానులు. టీమిండియా అత్యుత్తమ బౌలర్ అయిన భువీని బోర్డు పట్టించుకోట్లేదని వారు ఆరోపిస్తున్నారు. ఇక భువనేశ్వర్ కెరీర్ విషయానికి వస్తే.. టీమిండియా తరఫున 21 టెస్టులు ఆడి 61 వికెట్లు, 117 వన్డేల్లో 132 వికెట్లు, 48 టీ20ల్లో 49 వికెట్లు పడగొట్టాడు. మరి భువనేశ్వర్ కుమార్ నిజంగానే రిటైర్ మెంట్ హింట్ ఇచ్చాడా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: గుడ్ న్యూస్ చెప్పిన ధోని భార్య! సంతోషంలో ఫ్యాన్స్..