iDreamPost
android-app
ios-app

కల్కి అనుకున్నంత సీరియస్ కాదా! భైరవలో బుజ్జిగాడి పోలికలు!

  • Published May 31, 2024 | 3:40 PMUpdated May 31, 2024 | 3:40 PM

Kalki 2898 AD, B and B, Prabhas: ప్రభాస్‌ నటించిన కల్కి 2898 ఏడీ సినిమాలో ప్రభాస్‌ క్యారెక్ట్‌.. బుజ్జిగాడు సినిమాలోని ప్రభాస్‌ క్యారెక్ట్‌లా బిహేవ్‌ చేసేలా కనిపిస్తోంది. దానికి దీనికి లింక్‌ ఏంటి? ఎందుకు ఫ్యాన్స్‌ ఖుష్‌ అవుతున్నారో ఇప్పుడు చూద్దాం..

Kalki 2898 AD, B and B, Prabhas: ప్రభాస్‌ నటించిన కల్కి 2898 ఏడీ సినిమాలో ప్రభాస్‌ క్యారెక్ట్‌.. బుజ్జిగాడు సినిమాలోని ప్రభాస్‌ క్యారెక్ట్‌లా బిహేవ్‌ చేసేలా కనిపిస్తోంది. దానికి దీనికి లింక్‌ ఏంటి? ఎందుకు ఫ్యాన్స్‌ ఖుష్‌ అవుతున్నారో ఇప్పుడు చూద్దాం..

  • Published May 31, 2024 | 3:40 PMUpdated May 31, 2024 | 3:40 PM
కల్కి అనుకున్నంత సీరియస్ కాదా! భైరవలో బుజ్జిగాడి పోలికలు!

రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ నటించిన మోస్ట్ అవైటెడ్ సైన్స్ ఫిక్షన్ సినిమా ‘కల్కి 2898 ఏడీ’ కోసం ఆయన అభిమానులే కాదు సగటు సినిమా అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా గురించి తెలిసిన ప్రతి విషయం సినిమాపై అంచనాలను పెంచేస్తూ పోయింది. కల్కి సినిమా ఒక సాధారణ సినిమా కాదు.. చాలా సీరియస్‌ సబ్జెక్ట్‌ అనే భావన అందరిలో క్రియేట్‌ అయింది. పైగా ప్రభాస్‌, కమల్‌ హాసన్‌, అమితాబ్‌ బచ్చన్‌ ఇలా పెద్ద పెద్ద స్టార్లతో నాగ్‌ అశ్విన్‌ భారీ రేంజ్‌లో ఈ సినిమాను నిర్మిస్తున్నాడని ప్రభాస్‌ అభిమానులు ఒక వైపు సంతోష పడుతున్నా.. మరోవైపు మరీ ఇంత సీరియస్‌ సబ్జెక్ట్‌ అయితే జనాలకు రీచ్‌ అవుతుందా? అసలు వాళ్లకు అర్థం అవుతుందా? అనే భయం కూడా వారిలో ఉంది.

ఆ భయాన్నే తాజాగా కూకటివేళ్లతో సైతం తొలగించాడు డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌. అందుకు కారణం తాజాగా రిలీజ్‌ చేసిన బీ అండ్‌ బీ(బుజ్జి అండ్‌ భైరవ్‌) యానిమేషన్‌ సిరీస్‌. అమెజాన్ ప్రైమ్‌లో ఈ సిరీస్‌ను రిలీజ్ చేశాడు. దీనికి సంబంధించి రెండు ఎపిసోడ్లు విడుదల అయ్యాయి. ఒక్కో ఎపిసోడ్ నిడివి 14 నిమిషాలుగా ఉంది. మరో రెండు ఎపిసోడ్లు సినిమా రిలీజ్ అయ్యాక విడుదల చేస్తామని యూనిట్ ప్రకటించింది. అయితే.. ఈ రెండు ఎపిసోడ్లతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ను భయపెడుతున్న.. సీరియస్‌ సబ్జెక్ట్‌ అనే ఫోబియా పోయింది. ఈ సిరీస్‌ చూస్తే.. బుజ్జి అండ్‌ భైరవ మధ్య బీభత్సమైన కామెడీ ఉంది.

కామెడీ, ఎంటటైన్‌మెంట్‌ విలువ ఏంటో బాగా తెలిసిన నాగ్‌ అశ్విన్‌.. తన విజువల్‌ వండర్‌లో నవ్వు తెప్పించే సీన్లు కూడా అద్భుతంగా పండేలా ప్లాన్‌ చేసుకున్నట్లు తెలుస్తుంది. అసలు ఈ బుజ్జి ఎవరు? భైరవతో బుజ్జికి లింక్‌ ఏంటి అనే విషయాలపై క్లారిటీ ఇచ్చేందుకు ఈ బుజ్జి అండ్‌ భైరవ అనే యానిమేషన్‌ సిరీస్‌ను రిలీజ్‌ చేశారు. ఈ సిరీస్‌లో భైరవ బాడీ లాంగ్వేజ్‌ కానీ, ఆ పాత్ర వ్యవహరించే తీరు కానీ, ప్రభాస గత సినిమా బుజ్జిగాడులో ప్రభాస్‌ క్యారెక్టర్‌ను గుర్తుచేస్తున్నట్లు ఉంది. బుజ్జిగాడు సినిమాలో ప్రభాస్‌ నటన, ఆ కామెడీ టైమింగ్‌కు ఫిదా అవ్వని సినీ అభిమాని లేడంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు ఈ బుజ్జి అండ్‌ భైరవ సిరీస్‌లో ఉన్న కామెడీ సినిమాలో కూడా ఉంటే.. సీరియస్‌ సబ్జెక్ట్‌కు ఈ కామెడీ జతకలిస్తే.. ఇక సినిమాను ఆపడం కష్టం అంటూ సినిమా పండితులు కూడా అభిప్రాయపడుతున్నారు. మరి ప్రభాస్‌ అభిమానుల భయం పోగొట్టడంలో డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ సక్సెస్‌ అయ్యాడని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి