iDreamPost
android-app
ios-app

భగవంత్‌కేసరి OTT స్ట్రీమింగ్‌ డేట్‌ ఫిక్స్‌.. ఎప్పుడు, ఎక్కడ అంటే

  • Published Nov 10, 2023 | 12:12 PM Updated Updated Nov 10, 2023 | 12:12 PM

అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో.. బాలకృష్ణ, కాజల్‌, శ్రీలీల కాంబినేషన్‌లో తెరకెక్కిన భగవంత్‌ కేసరి సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయం సాధించింది. ఇక తాజాగా ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్‌ డేట్‌కు సంబంధించిన వార్తలు వైరలవుతున్నాయి. ఆ వివరాలు..

అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో.. బాలకృష్ణ, కాజల్‌, శ్రీలీల కాంబినేషన్‌లో తెరకెక్కిన భగవంత్‌ కేసరి సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయం సాధించింది. ఇక తాజాగా ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్‌ డేట్‌కు సంబంధించిన వార్తలు వైరలవుతున్నాయి. ఆ వివరాలు..

  • Published Nov 10, 2023 | 12:12 PMUpdated Nov 10, 2023 | 12:12 PM
భగవంత్‌కేసరి OTT స్ట్రీమింగ్‌ డేట్‌ ఫిక్స్‌.. ఎప్పుడు, ఎక్కడ అంటే

సాధారణంగా బాలయ్య సినిమాలు అంటే ఫ్యాక్షన్‌ డ్రామా, ఫ్లాష్‌ బ్యాక్‌, రివేంజ్‌, యాక్షన్‌ ఎలిమెంట్స్‌ ఎక్కువగా ఉంటాయి. ఇక అనిల్‌ రావిపూడి సినిమాలంటే.. ఫుల్‌ ఆఫ్‌ కామెడీ. ఇలాంటి వేర్వేరు అభిరుచులు ఉన్న వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా అంటే.. చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారు. బాలయ్య అంటే ఊర మాస్‌ యాక్షన్‌.. అలాంటిది ఆయన చేత అనిల్‌ రావిపూడి ఎలాంటి సినిమా తీస్తాడో అని అందరికి ఆసక్తి మొదలైంది. ఇక అందరి అనుమానాలను పంటాపంచలు చేస్తూ.. భగవంత్‌ కేసరి అనే పవర్‌ ఫుల్‌ టైటిల్‌తో.. అంతకుముందెన్నడు చూడని సరికొత్త క్యారెక్టర్‌లో బాలయ్యని ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చాడు.

ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో బాలయ్య నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దసరా సందర్భంగా వచ్చిన ఈ చిత్రం భారీ విజయం సాధించింది. అంతేకాక బాలయ్య కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డులు సృష్టించింది.  ఈ సినిమాలో బాలయ్య కామెడీ, యాక్షన్‌తో పాటు.. ప్రస్తుతం సమాజంలో ఉన్న ఓ సమస్య గురించి బాలయ్య చేత చెప్పించడం.. అందరిని ఆకట్టుకుంటుంది.

ఈ చిత్రంలో బాలయ్య కుమార్తెగా శ్రీలీల నటించింది. అలానే కాజల్ కీలకపాత్రలో కనిపించింది. ఇప్పటివరకు థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా త్వరలోనే ఓటీటీలోకి రాబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ డేట్‌ గురించి ప్రస్తుతం సోఫల్‌ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. దీని ప్రకారం.. ఈ సినిమా నవంబర్‌ 23 నుంచి ఓటీటీ ప్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు.

అయితే గత కానీ కొన్ని రోజులుగా భగవంత్ కేసరి సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ గురించి నెట్టింట జోరుగా ప్రచారం సాగుతోంది. ముందుగా ఈ సినిమా నవంబర్ 25న స్ట్రీమింగ్ కానుందని అన్నారు. ఇప్పుడు నవంబర్ 23నే స్ట్రీమింగ్ అవుతుందని ప్రచారం చేస్తున్నారు. మరీ ఈ రెండింటిలో ఏది నిజమో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య నటించిన భగవంత్‌ కేసరి సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యింది. అక్టోబర్ 19న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాదాపు రూ.125 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఈ సినిమాకు భారీ విజయాన్ని అందించినందుకు గురువారం బైదరాబాద్‌లోని జెఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో బనావో బేటీ కో షేర్ పేరుతో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కే.రాఘవేంద్ర రావు, అంబికా కృష్ణ ప్రత్యేక అతిథులుగా విచ్చేశారు.

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişCasibomcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobetJojobet Girişiptv satın al